Suryaa.co.in

Andhra Pradesh

పార్టీ మారినవారిపై అక్రమ కేసులు దుర్మార్గం

-జగన్ రెడ్డి పాలన సొంత పార్టీ నేతలకే నచ్చట్లేదు… అందుకే టీడీపీలో చేరుతున్నారు
-తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారిపై జగన్ రెడ్డి, వైసీపీ నేతలు కక్ష్యసాధింపులకు పాల్పడటం దుర్మార్గపు చర్య. రాజంపేట పార్లమెంట్ వైసీపీ రైతు అధ్యక్షులు మద్దిరెడ్డి కొండ్రెడ్డి ఏప్రిల్ 29-2022 తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి వైసీపీ నేతలు కొండ్రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. చంద్రగిరి, మదన పల్లె, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లలో అక్రమ కేసులు బనాయించటమే కాక వైసీపీ గూండాలు అతని ఇంటిపై దాడికి పాల్పడ్డారు. వైసీపీ అరాచక విధానాల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీ మారితే కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడతారా? ప్రజాస్వామ్యంలో ప్రజలు తమకు నచ్చిన రాజకీయపార్టీలో చేరే హక్కుంది. కానీ జగన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రజల హక్కుల్ని కాలరాస్తూ రాక్షస పాలన సాగిస్తున్నారు. జగన్ రెడ్డి పాలన విధానాలు సొంత పార్టీ నాయకులకే నచ్చటం లేదు. రాష్ట్ర పునర్ నిర్మాణం చంద్రబాబు నాయుతోనే సాధ్యమని వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్నారు. ముందు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరేందుకు చాలామంది నాయకులు, కార్యకర్తలు సిద్దంగా ఉన్నారు. జగన్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు.

LEAVE A RESPONSE