Suryaa.co.in

Andhra Pradesh

3 లక్షల ఎకరాల్లో పంట నష్టమైతే 34 వేల ఎకరాలకు మాత్రమే పరిహారం చెల్లించారు

– మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్
గులాబ్ తుఫాను సమయంలో 3 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే కేవలం 34 వేల ఎకరాలకు మాత్రమే పంట నష్ట పరిహారం చెల్లించారని మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పేర్కొన్నారు. మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జూమ్ యాప్ ద్వారా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే యథాతథంగా …
ప్రకృతి విపత్తుల్లో రైతులు నష్టపోతుంటే వారిని ఆదుకోవడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. బటన్ నొక్కితే కోట్లు సాక్షి పత్రికకు, ఛానల్ కు వెళ్తున్నాయేమో. రెండున్నరేళ్లలో 40 లక్షల ఎకరాల్లో ప్రకృతి వైపరిత్యాల వల్ల పంటలు దెబ్బతింటే జగన్ రెడ్డి అరకొరగా సాయమందించారు. అన్ని తుఫాన్లలో జరిగిన పంట నష్టానికి సుమారు రూ.17 వేల కోట్ల పంట ఉత్పత్తులను రైతులు నష్టపోతే జగన్ రెడ్డి కేవలం రూ.1070.56 కోట్లు మాత్రమే చెల్లించారు.
జగన్ రెడ్డి రెండున్నరేళ్ల పాలనలో 8 తుఫాన్లలో దాదాపు 40 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే ఒక వంతు సాయం కూడా రైతులకు అందలేదు. ప్రభుత్వ సాయం కోసం అన్నదాతలు వేయి కళ్లతో ఎదురుచూస్తే ఈ ప్రభుత్వం కనికరించలేదు. వారిని నిరాశపరుస్తోంది. వందలాది కోట్లతో ప్రకటనలు ఇస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. వెయ్యి మంది రైతుల్లో పంట నష్ట పరిహారం ఒకరిద్దరికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అంకెల గారడీ చేస్తున్నారు. గులాబ్ తుఫాను ధాటికి 3 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే జగన్ రెడ్డి మాత్రం కేవలం 34,555 ఎకరాలకు కేవలం రూ.22 కోట్లు చెల్లిస్తూ.. తన పత్రిక సాక్షికి మాత్రం వంద కోట్ల రూపాయలతో ప్రకటనలు ఇచ్చారు. ప్రకటనల ఖర్చులో ఒక వంతు కూడా రైతులకు సాయం అందలేదు.
64.06 లక్షల మందికి రైతు భరోసా పథకం వర్తింపజేస్తామని హామీ ఇచ్చి.. అమలులో మాత్రం 45 లక్షల మందికి కుదించారు. 15.36 లక్షల మంది ఉన్న కౌలు రైతులను 41వేలకు కుదించారు. చంద్రన్న పాలనలో రుణమాఫీ కింద రూ.15,279 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. రూ.50 వేల లోపు రుణాలను ఒకే దఫాలో రద్దు చేశారు. చంద్రన్న పాలనలో రుణమాఫీ కింద రూ.15,279 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. రూ.50 వేల లోపు రుణాలను ఒకే దఫాలో రద్దు చేశారు.
జగన్ రెడ్డి సున్నా వడ్డీకి రైతులందరికీ రుణాలిస్తామని ఓదార్పు యాత్రలో మాటిచ్చి మాటతప్పారు. రూ.4వేల కోట్లు ఇస్తామని చెప్పి.. బడ్జెట్ లో రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారు. రైతే ముందుగా బ్యాంకుకు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితిని తెచ్చారు. చంద్రన్న పాలనలో రూ.3 లక్షల వరకు ఉన్న వడ్డీలేని రుణాన్ని రూ.లక్షకు తగ్గించారు. నేర చరిత్ర కల ముఖ్యమంత్రి నేడు రాష్ట్రాన్ని పరిపాలిస్తు్న్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితిని హీన స్థితికి దిగజార్చారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి విషయంలో రైతులను దగా చేశారు. ఈ నిధులు వ్యవసాయశాఖామాత్యుల ఖాతాలోకి వెళ్లాయా? జగన్ సొంత ఖాతాల్లోకి వెళ్లాయో చెప్పాలి.
జగన్ ది రైతు నయవంచన ప్రభుత్వం. రైతు వెన్నెముక విరుస్తున్నారు. 2020 ఏడాదికి సంబంధించి రైతులు, రైతు కూలీలు బలవన్మరణాలకు పాల్పడ్డ రాష్ట్రాల జాబితాలో వరుసగా రెండో ఏడాది కూడా ఏపీ 3వ స్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో ఉండడం బాధాకరం. టీడీపీ హయాంలో రైతులకు పనిముట్లు ఇచ్చాం. జలసిరి పథకం ద్వారా బోర్లు వేయించి, మోటార్లు పెట్టి ఆదుకున్నాం. ఆ పథకాలన్నింటిని నేడు రద్దు చేశారు.
డ్రిప్ ఇరిగేషన్ అటకెక్కింది. వ్యవసాయ పరికరాల పంపిణీ నిలిచిపోయింది. ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వరు, సకాలంలో ఇన్సూరెన్స్ జమ చేయరు. రైతులకు క్రాప్ హాలిడే ప్రకటిచడం జగన్ చేతకాని, అసమర్థ, అవినీతి తనంతోనే. ఉద్యోగస్థులకు జీతాలిచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రైతుల నుండి కొనుగోలు చేసే ధాన్యానికి డబ్బులిచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. 2 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. టీడీపీ హయాంలో ఇన్ పుట్ సబ్సిడీ కింద 2014-15లో రైతులకు రూ.932.కోట్లు ఇచ్చి ఆదుకున్నాం.
నేడు జగన్ 2019-20లో కేవలం రూ.123.70 కోట్లు మాత్రమే ఇచ్చారు. రైతులందరూ ఈ అరాచకాలను ప్రశ్నించాలి. ప్రతి ఒక్కరు నినదించాలి. ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రస్తుతం తుఫానులొస్తున్నాయి. అనేకచోట్ల పంటలు నేలకొరిగాయి. దిగుబడి పూర్తిగా తగ్గిపోయే అవకాశాలున్నాయి. ఎకరానికి కనీసం పది బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. రైతులను ప్రభుత్వం ఆదుకునే పరిస్థితులు కనిపించడంలేదు. కాలక్రమంలో రైతులే గుణపాఠం చెబుతారు. రైతు కంట కన్నీరు ఈ రాష్ట్రానికి మంచిదికాదు. నివార్ తుఫానులో 17 లక్షల ఎకరాలు, రైతులకిచ్చే సాయాన్ని పెంచాలి. రైతులు ఎరువులు కొనలేని స్థితి ఉంది. ఇన్ పుట్ సబ్సిడీ శాతాన్ని పెంచి రైతులను ఆదుకోవాలని టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE