Suryaa.co.in

Andhra Pradesh

నా ప్రశ్నలకు ముఖ్యమంత్రి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు?

-పొలిటికల్ థీఫ్ లు అధికారంలో ఉంటే, పోలీస్ శాఖ, ఎన్నికల కమిషన్ ఎలా పనిచేస్తాయో, రాష్ట్రంలో జరిగిన ఎన్నికలతో తేలిపోయింది
– అన్నిరోజులు ఇలానే తనదౌర్జన్యాలు సాగుతాయని పెద్దిరెడ్డి అనుకుంటున్నారేమో?
– ప్రజలు తిరగబడి, రాష్ట్రంలో రాజకీయదొంగలుఉండటానికి వీల్లేదని నిర్ణయించిననాడు, నీతి, నిజాయితీ ఉన్నవారు అధికారంలోకివస్తారు.
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య
రాష్ట్రంలోని పరిస్థితుల్ని నెమ్మదిగా ప్రజలు కూడా గమనించాలని…. ఓటేశాం , పలానావ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు.. ఆయనే రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు.. ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది….అధికారపక్షం పరిపాలిస్తుంది… మనపని అయిపోయిం దన్నమంచిదికాదు… నిత్యంఏంజరుగుతోందని గమనించాల్సిన బాధ్యత ప్రజలపైఉందని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య తెలిపారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
ప్రజలు అనుకునే పరిస్థితులు మామూలుగా రాజ్యాంగం ప్రకారం పాలన సాగుతున్నప్పుడు. కానీ ఇప్పుడు రాష్ట్రంలోని పరిస్థితులు తద్భిన్నంగా ఉన్నాయి. రాజ్యాంగం గౌరవించబడటం లేదు, ప్రజాస్వామ్య పరిపాలనలేని పరిస్థితుల్లో ప్రజలు ఏమరపాటుగా ఉండటంమంచిదికాదని నా మనవి. నైజీరియన్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఒకరు, రాష్ట్రంలోని స్థితిగతులకు అద్దంపట్టేలా ఒకబ్లాగ్ పెట్టారు. రాష్ట్రంలోని పరిస్థితులు క్షుణ్ణంగా గమనించాకే, ఆ జర్నలిస్ట్ బ్లాగ్ పెట్టాడేమోనని అదిచూసిన ప్రతిఒక్కరికీ అనిపిస్తుంది.
ఆ బ్లాగ్ లో సదరు జర్నలిస్ట్ ఏంపెట్టారో ముఖ్యమంత్రికూడా చూసి తెలుసుకోవాలి. రాష్ట్రప్రజలు ఐదున్నరకోట్లమందికూడా తెలుసుకోవాలి. “what is the difference between ordinary thief and a political thief” అన్నది ఆ బ్లాగ్ లో సదరు జర్నలిస్ట్ లేవనెత్తిన సందేహం. మామూలు దొంగకు, రాజకీయదొంగకు ఉన్న వ్యత్యాసమేమిటని నైజీరియన్ జర్నలిస్ట్ ప్రశ్నించారు. ప్రశ్నించడంతోపాటు, వ్యత్యాసాన్నికూడా కళ్లకు కట్టినట్టు వివరంగా చెప్పాడు.
మామూలు దొంగ ప్రజలఆస్తిపాస్తి, నగానట్రా దోచేస్తే, రాజకీయ దొంగ ప్రజల భవిష్యత్ ను, వారి పిల్లల చదువులు, బంగారు భవిష్యత్ ను, ప్రజల ఆరోగ్యాన్ని, వ్యాపారాలను, రాష్ట్ర అభివృద్ధి నాశనం చేస్తాడు. ఒక్కమాటలో చెప్పాలంటే రాజకీయదొంగ ప్రజల భవిష్యత్ ను కొట్టేస్తున్నాడు. సాధారణదొంగ ఎవరింట్లో, ఎవరివద్ద, ఏసమయంలో దొంగతనం చేయాలో తనకి తానే ఎన్నుకుంటే, రాజకీయదొంగలకు మాత్రం ఎంపికను ప్రజలు ఇస్తారని సదరు జర్నలిస్ట్ చెప్పారు. ప్రజలుతమకుతాముగా తమని, సొసైటీని, వారిఆరోగ్యాన్ని, వారి పిల్లల భవిష్యత్ ను దోపిడీచేయడానికి రాజకీయదొంగను వారిఓట్లతో వారే ఎన్నుకుంటున్నారని నైజీరియన్ జర్నలిస్ట్ బ్రహ్మండంగా చెప్పాడు.
మరో ఉదాహరణ కూడా రాష్ట్రంలోని ప్రస్తుతపరిస్థితులకు దర్పణం పడుతోంది. పోలీసులు సాధారణదొంగల్ని వెంటాడి పట్టుకుంటే, రాజకీయదొంగలకు మాత్రం అదేపోలీసులు రక్షణనిస్తారు..జీహూజూర్ అంటారు.. సాష్టాంగపడతారు… ఆఖరికి అడ్డమైనసేవలుకూడాచేస్తారు. నైజీరియన్ జర్నలిస్ట్ బ్లాగ్ లోని అంశాలు అచ్చుగుద్దినట్లుగా రాష్ట్రంలోని పరిస్థితులకు సరిపోయాయి. మనరాష్ట్రంలో ఇప్పుడు మామూలుదొంగతనాలు తగ్గిపోయి, రాజకీయదొంగతనాలు పెరిగిపోయాయి. అలాంటి దొంగతనాలు చేసేవారిని ఎన్నుకున్నది ఈ రాష్ట్రప్రజలు కారా?
రాష్ట్రంలో నిన్న, ఈరోజు జరిగిన ఎన్నికలపై డీజీపీ సంతృప్తిగా ఉన్నారా? ఎక్కడైనా ఎన్నికలు అయ్యాక డీజీపీ ప్రశాంతంగా జరిగాయని చెబుతారు. కానీ డీజీపీ సవాంగ్ ఎన్నికలు ఎలా జరిగాయనే దానిపై ఎందుకు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు. స్థానికఎన్నికలు ప్రశాంతంగా, సుహృద్భావ వాతావరణంలో జరిగాయని చెప్పే ధైర్యం పోలీస్ శాఖ, ఎన్నికల కమిషన్ చేయలేకపోయాయి.
చిత్తూరుజిల్లాఎస్పీకి ఫిర్యాదులపై స్పందించే సమయమే లేదంటా? నిన్న కుప్పంలో జరిగేవాటిపై మాట్లాడదామని తాను ఫోన్ చేస్తే, అరనిమిషం కూడా ఆయన తనకు సమయ మివ్వలేదు. తమిళనాడు నుంచి మూడు బస్సులు కుప్పానికివస్తే, అక్కడి పోలీస్ అధికారులు ఏంచేశారు? బస్సుల టైర్లలో గాలి తీసిన స్థానికులపై పోలీసులు లాఠీఛార్జ్ చేస్తారా? పొలిటికల్ థీఫ్ పరిపాలించే స్థానంలోఉంటే, అలాంటిఘటనలే జరుగుతాయని అనుకోవాలి.
మరోచోట మంత్రిగారి తమ్ముడు పోలింగ్ బూత్ లోఉంటే, తానేంచేయలేనని డీఎస్పీస్థాయి వ్యక్తి అనడం సబబేనా? అతనికి డీఎస్పీగా కొనసాగే అర్హత ఉందా? డీఎస్పీపై ఏంచర్యలు తీసుకోబోతున్నారో డీజీపీ సమాధానంచెప్పాలి. పోలింగ్ బూత్ లోని మినిస్టర్ తమ్ముడిని బరబరా బయటకు ఈడ్చుకురావాల్సిన డీఎస్పీ మంత్రితో మాకెందుకు అంటాడా? అక్కడున్నవారంతా డీఎస్పీని ఉద్దేశించి, నువ్వేమీ డీఎస్పీవయ్యా అని హేళనచేశారు. సవాంగ్ గారు, నీలంసాహ్ని గారి ఆధ్వర్యంలోని వ్యవస్థలు ఇలాంటి పనులే చేస్తాయని ప్రజలు భావించాలా?
ఇంతటి అపప్రధను మూటకట్టుకునే ఖర్మ సవాంగ్ గారికి ఎందుకు పట్టింది? పోలీస్ శాఖ ప్రాభవాన్ని దిగజార్చిన సవాంగ్ గారు భవిష్యత్ లో సదరుశాఖకు సమాధానం చెప్పక తప్పదు. రాజకీయ దొంగలు ఉచ్ఛస్థితిలో ఉంటే, రాష్ట్రానికి ఇలాంటి ఖర్మే పడుతుందా? న్యాయస్థానం కుప్పంపరిధిలోని ఓట్లలెక్కింపు కేంద్రాల్లో ప్రత్యేకాధికారిని నియమించమని చెప్పినందుకు, ఎన్నికలసిబ్బంది, పోలీస్ అధికారులు సిగ్గుపడాలి. అంటే కుప్పంలో ఏదో జరుగుతోందని తాముచెప్పిన అంశాలను కోర్టు అంగీకరించిందనే భావించాలి కదా? కోర్టు ప్రత్యేకాధికారిని నియమించడంపై ఎన్నికల సిబ్బంది వారితలలు ఎక్కడపెట్టుకుంటారు?
స్థానిక ఎన్నికల సిబ్బందిపై నమ్మకంలేకే కదా కోర్టు కుప్పంలో ప్రత్యేకఅధికారిని నియమించింది? ప్రత్యేకాధికారి నియాయమకంతో, ఎన్నికల కమిషన్ తీరుని, పోలీస్ శాఖ పనితనాన్ని కోర్టు తప్పుపట్టినట్టే లెక్క. ప్రభుత్వ విభాగం, పోలీస్ శాఖలోని వెబ్ కాస్టింగ్ పై , కెమెరాలపై మాకు నమ్మకంలేదు. అందుకే తాము కుప్పంలోని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా కెమెరాలు ఏర్పాటుచేయించాము. చిత్తూరుజిల్లాలో అన్నిరోజులు పెద్దిరెడ్డి దౌర్జన్యాలు సాగవు… పాలకుల దౌర్జన్యాలు, అరాచకాలు సాగవు. రాజకీయదొంగలు ఉండటానికి వీల్లేదని ప్రజలు నిర్ణయించిననాడు నీతి, నిజాయితీ కలిగిన నేతలు ఎంపికవుతారు.
నా ప్రశ్నలకు ముఖ్యమంత్రి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు?
హూకిల్డ్ బాబాయ్, హూ పెయిడ్ 40 క్రోర్స్ సుపారీ అన్న ప్రశ్నలకు ఈ ముఖ్యమంత్రి సమాధానంచెప్పడేం? ఆయనెందుకు నోరుతెరవడు.. ఎందుకు నిజం చెప్పలేక పోతున్నాడు? వివేకానందరెడ్డిని ఎవరు చంపారో, ఎందుకు చంపారో, ఎంత సుపారీ ఇచ్చారో ముఖ్యమంత్రికి తెలియదా? గౌరవ ముఖ్యమంత్రి తన గుండెలపై చేయివేసి, ఎందుకు నిజం చెప్పలేకపోతున్నాడు? వివేకాను చంపిందిఎవరని రాష్ట్రమంతా కోడైకూస్తుంటే, ముఖ్యమంత్రి ఎందుకు మౌనాన్నిఆశ్రయిస్తున్నారు?
వివేకానందరెడ్డి హత్యతో జగన్ కుటుంబం రెండుగా విడిపోయిందా అని విజయమ్మ, షర్మిలను అడిగితే, వారు ఔననే చెబుతారు. తనమరిదిని చంపినవారిని పట్టుకోవడంలో తనకుమారుడు ఘోరంగా విఫలమ య్యాడని విజయమ్మగారు అంటారు..కావాలంటే విజయమ్మ, వివేకా సతీమణి, కుమార్తెల స్టేట్ మెంట్స్ ముఖ్యమంత్రే రికార్డు చేయించాలి. వివేకాహత్యకేసు విచారణ సీబీఐ అప్పగిం చాలంటూ హైకోర్ట్ లో అఫిడవిట్ వేసింది జగన్మోహన్ రెడ్డికాదా? జగన్మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి అయ్యాక వివేకాహత్యకేసు విచారిస్తున్న సిట్ అధికారులను మార్చారా ….లేదా?
సీబీఐ విచారణకు హైకోర్ట్ ఆదేశించాక జగన్ తన రిట్ పిటిషన్ ఉపసంహరించుకున్నది నిజంకాదా? వివేకాహత్యకేసు విచారణపై ముఖ్యమంత్రిహోదాలో ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి సీబీఐతో ఎందుకు మాట్లాడలేదు? అన్నివేళ్లూ జగన్మోహన్ రెడ్డి వైపుచూపిస్తుంటే, ఆయనెందుకు మౌనాన్నిఆశ్రయిస్తున్నారు? తన బాబాయిని చంపినవారికి శిక్షలు పడాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారా..లేక వారు బయటఉండాలని భావిస్తున్నారా? ముఖ్యమంత్రిని పక్కనపెట్టి, సజ్జలే అన్నీ డ్రామాలు ఆడుతున్నాడని తాడేపల్లి ప్యాలెస్ లో ఇప్పటికే గుసగుసలు మొదలయ్యాయి. నిప్పును అరచేతిలో పెట్టుకొని దాచడం కుదరదు.. అది ఏనాటికైనా భగ్గున మండే తీరుతుంది. ఇవన్నీ చూశాక మనం ఎలాంటినాయకుడిని ఎన్నుకున్నామో, అతను ఎలాంటి వాడో ప్రజలంతా ఇప్పటికైనా అర్థంచేసుకోవాలి.

LEAVE A RESPONSE