– తెలంగాణలోనే అధికం
– మహిళల అక్రమ రవాణా కేసులు 154
– వదంతులు సృష్టించడం, వ్యాప్తి చేయడంలో తెలంగాణ టాప్
-పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడుల్లో తెలంగాణ ది మూడో స్థానం
మహిళలను వేధించిన కేసుల్లో న్యాయస్థానాల్లో రాజీ పడుతున్న ఉదంతాలూ తెలంగాణలోనే అధికం. 4955 ఉదంతాల్లో రాజీ కుదిరింది. మహిళల్ని సంజ్ఞలు, వ్యాఖ్యలతో వేధించే ఘటనలు తెలంగాణ (నాలుగో స్థానం)లో 775 నమోదయ్యాయి. రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా కేసులు 154 నమోదయ్యాయి. దేశంలో ఇది నాలుగో స్థానం.391 జస్టిస్ జువైనల్ చట్టం కేసులతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.
బాల కార్మికుల చట్టం కింద 224 కేసుల్లో 305 మంది బాధితులు దొరికారు. ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో కేసులు నమోదు కాలేదు. అన్ని రాష్ట్రాల్లో కలిపి 613 కేసులు నమోదయ్యాయి. చిన్నారులకు సంబంధించిన చట్టాల కింద 3370 కేసులతో తెలంగాణ నాలుగో స్థానం ఉంది.
వదంతుల వ్యాప్తిలోనూ రాష్ట్రానికి సాటిలేదు. వదంతులు సృష్టించడం, వ్యాప్తి చేయడంలో తెలంగాణ టాప్‌లో ఉంది. దేశంలో 882 కేసులు నమోదవగా తెలంగాణలో 218 కేసులు ఉన్నాయి. పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడుల్లో తెలంగాణ (31 కేసులు)ది మూడో స్థానం. బిహార్ (97), మధ్యప్రదేశ్ (46) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
రహదారులపై వాహనాలను నిర్లక్ష్యంగా నడపడం వల్ల జరిగిన ప్రమాదాల్లో మధ్యప్రదేశ్ (29421 కేసులు), తమిళనాడు (18896) తర్వాత తెలంగాణ (10761)ది మూడో స్థానం.