Suryaa.co.in

Andhra Pradesh

మరో 100 రోజుల్లో రాష్ట్రంలో రామరాజ్యం తీసుకొస్తాం

-చంద్రబాబు బీజేపీ ఆహ్వనం మేరకే ఢిల్లీ వెళ్లారు
-రాష్ట్రానికి పట్టిన శని, దరిద్రం ఈ రోజుతో వదిలిపోతోంది
-టీడీపీ ప్రభుత్వం రాగానే వైసీపీ సోషల్ మీడియా సన్నాసుల ఆటకట్టిస్తాం
-శాసనసభకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు ఇతర ఎమ్మెల్యేలు
-5 ఏళ్లపాటు 5 కోట్ల ప్రజల తరుపున ప్రధాన ప్రతిపక్షం వినిపించే గొంతుని జగన్ రెడ్డి ప్రభుత్వం తొక్కేసింది.
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు

“ 5కోట్ల మంది ప్రజలకు దేవాలయం శాసనసభ. అలాంటి సభలో పాలకులు తీసుకునే ప్రతినిర్ణయం ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండాలి. ప్రజలకు మంచి చేయడానికి శాసనసభ వేదికగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. కానీ పవిత్రమైన సభను జగన్ రెడ్డి తన సొంత పార్టీ కార్యాలయంగా మార్చాడు. వైసీపీప్రభుత్వం, జగన్ రెడ్డి తీసుకొచ్చిన ప్రతి చట్టం రాష్ట్ర వినాశనానికే పాటుపడింది తప్ప, ప్రజలకు ఉపయోగపడిందిలేదు.

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎంత అవసరమో… ప్రజలపక్షాన మాట్లాడటానికి ప్రతిపక్షం కూడా అంతేముఖ్యం. ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో శాససభలో ప్రతిపక్షం గొంతు దారుణం గా నొక్కేశారు. ఈ రోజు బడ్జెట్ సమావేశాల్లో నాలుగో రోజు. సభ నిర్వహణకు చివరి రోజు. ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతుంటే, వారి తరుపున టీడీపీ రోజుకో అంశంపై వాయిదా తీర్మానం ఇస్తుంటే, మా గోడు అంటే ప్రజల గోడు పట్టించుకోకుండా ప్రభుత్వం దారుణాతిదారుణంగా టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయడం దారుణం.

ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు ముఖ్యమంత్రి యువతకు అనేక హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ ప్రకటిస్తామని, ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు యువతకు అబద్ధాలు చెబుతున్నాడని ఆనాడు నమ్మబలికారు. అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లపాటు గాఢనిద్రపోయిన వైసీపీ ప్రభుత్వం, నేడు ఎన్నికల ముంగిట మొక్కుబడిగా 6,100 ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం యువతను వంచించడం కాదా?

వీటన్నింటిని ప్రశ్నిస్తూ నేడు సభలో వాయిదా తీర్మానం ఇవ్వబోతున్నాం. అలానే 5ఏళ్లుగా దళిత, గిరిజన, బడుగుబలహీన వర్గాలు, మైనారిటీలపై జగన్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండకు సంబంధించి కూడా వాయిదా తీర్మానం ఇవ్వబోతున్నాం. వాటిపై చర్చ చేపట్టాలని సభలో గట్టిగా పట్టుబడతాం.

రాష్ట్రానికి పట్టిన శని, దరిద్రం ఈ రోజుతో వదిలిపోతోంది. శాసనసభ సాక్షిగా జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన చట్టాలన్నీ రాష్ట్ర వినాశనానికే దోహదపడ్డాయి. అమరావతిని నాశనం చేస్తూ మూడు రాజధానుల నిర్ణయానికి సంబంధించిన చట్టంతో పాటు, పోలవరం ప్రాజెక్ట్ పై ఆడిన రివర్స్ టెండరింగ్ డ్రామాల చట్టం సహా, అనేక చీకటి చట్టాలను వైసీపీ ప్రభుత్వం ఈ సభలోనే చేసింది. అలాంటి చట్టాలకు సంబంధించిన చీకటి జీవోల ప్రతుల్ని సభ నుంచి బయటకు వచ్చాక దహనం చేస్తాం. మరో 60రోజుల్లో ఈ సభను గౌరవసభగా మార్చి, రాష్ట్రంలో రామరాజ్యం తీసుకురాబోతున్నాం.

టీడీపీ ప్రభుత్వం రాగానే వైసీపీ సోషల్ మీడియా సన్నాసుల ఆటకట్టిస్తాం. చంద్రబాబు బీజేపీ పెద్దలకాళ్లు పట్టుకున్నట్టు ఫోటోలు మార్ఫింగ్ చేసి వైసీపీ సోషల్ మీడియా సన్నాసులు చేస్తున్న దుష్ప్రచారానికి వారు తగిన మూల్యం చెల్లించుకుంటారు

చంద్రబాబు బీజేపీ ఆహ్వనం మేరకే ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఆయన మాట్లాడిన వివరాలు ఆయన వచ్చాక ప్రజలకు వెల్లడిస్తారు. చంద్రబాబుతో పాటు అమిత్ షా, జేపీ నడ్డాలు మాత్రమే ఉన్నారు. వారిమధ్య జరిగిన చర్చల వివరాలు ఎవరికి తెలుసు? ఇష్టమొచ్చినట్టు దుష్ప్రచారం చేస్తారా? వైసీపీ సోషల్ మీడియా వెధవలు గతంలో చంద్రబాబు పుడమితల్లికి నమస్కరించిన ఫోటోను మార్ఫింగ్ చేసి, మోదీ కాళ్లు పట్టుకున్నట్టు, అమిత్ షాకు మొక్కినట్టుగా మార్చి సోషల్ మీడియాలో వదిలారు. ఇలాంటి వెధవపనులు పనికిమాలిన వైసీపీ సన్నాసులే చేస్తారు.

ఆ వెధవలు ఇప్పటికైనా తమవైఖరి మార్చుకోకుంటే, భవిష్యత్ లో దారుణమైన స్థితిని ఎదుర్కొంటారు. ఎవరి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం చంద్రబాబుకి.. తెలుగుదేశానికి లేదు. మేంగానీ, మాపార్టీ గానీ ఏనిర్ణయం తీసుకున్నా అది 5కోట్ల ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని తీసుకునే నిర్ణయమై ఉంటుం ది. చంద్రబాబు ఫోటోలు మార్ఫింగ్ చేసి, చేస్తున్న దుష్ప్రచారంపై మేం ఫిర్యాదు చేస్తాం.

ప్రభుత్వం తమ ఫిర్యాదుల్ని పట్టించుకోదని తెలిసినా, మేం చేయాల్సింది చేస్తాం. తర్వాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇలాంటి దుశ్చర్యల సంగతి.. వైసీపీ సోషల్ మీడియా సన్నాసుల సంగతి తేలుస్తాం.” అని అచ్చెన్నాయుడు తీవ్రస్వరంతో హెచ్చరించారు

LEAVE A RESPONSE