Suryaa.co.in

Telangana

వైద్య రంగంలో తెలంగాణ దేశంలో నెంబర్ వన్ గా నిలపాలి

-సీ సెక్షన్ ఆపరేషన్లు బాగా తగ్గించాలి
-నార్మల్ డెలివరీ చేయిస్తే వైద్య సిబ్బందికి ఇన్సెంటీవ్ 
-ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు.. సమయపాలన తప్పనిసరి
-మందుల కొరత లేదు..డాక్టర్లు మందులు బయటికి రాస్తే కఠిన చర్యలు
-రూాపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మొకాళ్ల ఆపరేషన్లు
-వైద్యరంగంలో డబులు ఇంజన్ గ్రోత్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ చిట్టచివరి స్థానంలో
-కాంగ్రెస్ పాలనలో తెలంగాణ వైద్య రంగం అభివృద్ది చెందేదా..?
-జగిత్యాల సభలో మంత్రి హరీశ్ రావు

జగిత్యాలలో ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖమంత్రి హరీశ్ రావు పర్యటన
జగిత్యాల పట్టణంలో వంద పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి ప్రారంభించిన ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు.ఎంపీ వెంకటేష్, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, రవి శంకర్, టీఎస్ఎంఎస్ఐడిసి ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండి చంద్రశేఖర్ రెడ్డి, డీఎంఇ రమేష్ రెడ్డి, ఇతర అధికారులు, స్థానిక నేతలు ఈ సందర్బంగా ఉన్నారు.అంతకుముందు జగిత్యాల పట్టణంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణాలను ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పరిశీలించారు.

ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కామెంట్స్
కరోనా సమయంలో బాగా కష్టపడి అత్యుత్తమ సేవలు అందించిన వైద్య సిబ్బంది అందరికీ అభినందనలు. చాలా మంచి పేరు తెచ్చారు. ఇంటింటికి ఆరోగ్య సర్వే దేశానికే ఆదర్శంగా ఉంది.ఈ సర్వే వల్ల ఇంటి
harish-rao వద్దే వైద్యం అందించే సౌకర్యం కల్పించారు. ఆసుపత్రుల మీద లోడ్ తగ్గింది. ప్రజలకు ఆందోళన తగ్గింది. నీతి అయోగ్ ఇది గుర్తించి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రసంశించింది. ఇతర రాష్ట్రాలు ఇలా చేయాలని కేంద్రం సూచించింది.కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జీతం పెంచాలంటే ఆశాలు ఇందిరాపార్కు వద్ద ధర్నాలు, అరెస్టులు, గుర్రాలతో తొక్కించడం, నిరహార దీక్షలు.

తెలంగాణ వచ్చినప్పుడు ఆశాల జీతం 1500 ఉంటే కేసీఆర్ గారు 9500 రూపాయలు పెంచారు. గుజరాత్ రాష్ట్రం ప్రధాని స్వంత రాష్ట్రం లో ఆశా వర్కర్ల జీతం 4 వేలు మాత్రమే. రాజస్థాన్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో 3 వేలు, బీజేపీ అధికారింలో ఉన్న ఎంపీలో ఆశాల జీతం 3 వేలు మాత్రమే.మీ జీతం కేసీఆర్ గారు 9500 కు పెంచారు. మన రాష్ట్ర గౌరవం నిలబెట్టాలి. జగిత్యాల జిల్లా ఆరోగ్య సమాక్ష జరిపాను.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య జగిత్యాల జిల్లాలో 44 శాతం మాత్రమే ఉంది. కేసీఆర్ కిట్ వచ్చాక 56 శాతం మంది ఎందుకు ప్రయివేటుకు వెళ్తున్నరు. అద్భుతంగా 18 కోట్లతో వంద పడకల ఆసుపత్రిని జగిత్యాలలో ప్రారంభించుకున్నం. 12 లేబర్ రూంలు ఉన్నాయి. న్యూ బోర్న్ బేబీ కేర్ సెంటర్ పెట్టాం. పీడియాట్రిక్ కేర్ సెంటర్ ఉంది.

తెలంగాణ రాక ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు 30 శాతం మాత్రమే అయ్యేవి. సీఎం గారు వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు వచ్చాక 56 శాతానికి పెరిగాయి. 26 శాతం కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగాయి. జగిత్యాల 44 శాతం మాత్రమే ఉంది. ఇది ఎందుకు పెరగడం లేదో ఆలోచించండి.

మొదటి ఎ.ఎన్. సి చెకప్ మీరే చేస్తున్నరు. నాల్గవ ఎ.ఎన్. సి చెకప్ కూడా మీరే తీసుకోవాలి. మీ పరిధిలో ప్రసవాలు చేయించుకునే వారిని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చెయించుకునేలా చూడాలి.అమ్మ ఒడి వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు అయితే 12 వేల రూపాయలు ఇస్తున్నం. కేసీఆర్ కిట్ ఇస్తున్నం. ఆటో కిరాయి లేకుండా ఇంటి వద్ద దింపుతున్నం.కాని ప్రయివేటుకు వెళ్తే ఆపరేషన్లు చేసి 50-60 వేలు ఖర్చు. అనవసరంగా సీ సెక్షన్ ఆపరేషన్ వల్ల

జగిత్యాల జిల్లా 80 శాతం సీ సెక్షన్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడ చూసినా 30 శాతం కన్నా ఎక్కువ సీ సెక్షన్ ఆపరేషన్లు జరగవు. రాష్ట్రంలో 60 శాతం సీ సెక్షన్ ఆపరేషన్లు జరుగుతున్నయి. కాని జగిత్యాల లో రాష్ట్ర సగటు కన్నా ఎక్కువగా అంటే 80 శాతం జరగడం బాధాకరం.

పిల్లవాడు పుట్టిన వెంటనే తొలి గంటలోనే తల్లి పాలు తాగాలి. 36 శాతం మందే మన రాష్ట్రంలో తొలి గంటలో తల్లిపాలు తాగుతున్నరు. 64 శాతం మంది తల్లిపాలకు మొదటి గంటలో దూరమవుతున్నరు. తొలి గంటలో పిల్లలు తల్లి పాలు తాగితే చురుకుగా ఉంటరు. ఎదుగుదల బాగా ఉంటుంది. రోగ నిరోథక శక్తి పెరుగుతుంది.

సి.సెక్షన్ ఆపరేషన్ వల్ల తల్లి 30 ఏళ్లకో రోగాల బారిన పడుతుంది. ఏ బరువు పని చేయలేని పరిస్థితి.మూఢనమ్మకాలతో అయ్యగార్లు ముహూర్తం పెడితే పురుడు పోయడం సరి కాదు. శాంతి హోమం అని ఇంకా ఏదో అని ఖర్చులు పెడుతున్నరు అని డాక్టర్లు చెబుతున్నరు. గండాల పేరుతో భయపెడుతున్నరు అని చెబుతున్నరు. ఈ మూఢ నమ్మకాల వల్ల తల్లి, పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది.

వచ్చే ఆరునెలల్లో జగిత్యాల 50 శాతానికి తగ్గించాలి. అందరం కలిసి పని చేద్దాం. ఇదంతా నా కోసం కాదు. మన అక్కా చెళ్లేల్ల ఆరోగ్యం కాపాడుదాం.ముఖ్యమంత్రి గారి అనుమతితో నార్మల్ డెలివరీ చేస్తే ఇన్సెంటీవ్ ఇచ్చే ఆలోచన చేస్తున్నం. ఆశాకు, ఎ.ఎన్.ఎంకు, డాక్టర్ కు, స్టాఫ్ నర్స్ కు ఇస్తాం. సీ సెక్షన్ ఇస్తే ఇప్పటిదాకా డబ్బులు ఇస్తున్నం. అది బంద్ పెడ్తం.

తెలంగాణ వ చ్చాక చాలా మంచిగ అవుతుంది. తెలంగాణ రాక ముందు అన్ని ఆంధ్రలోనే పెట్టారు. డాక్టర్లు, మెడికల్ కాలేజీలు అక్కడే. 75 ఏళ్లలో తెలంగాణలో ఉన్నవి వరంగల్, ఆదిలాబాద్,నిజామాబాద్ 3 మాత్రమే వచ్చినవి. కాని సీఎం గారు తెలంగాణలో మూడింటిని ఏడేళ్లలో 33 కాలేజీలు చేశారు. జగిత్యాల లో మెడికల్ కాలేజి వచ్చిందంటే 650 పడకల ఆసుపత్రి వస్తుంది. 150 మంది డాక్టర్లు పని చేస్తరు. పిల్లలకు మెడికల్ ఎడ్యుకేషన్ అందుతుంది. ఇది టీఆర్ఎస్ వల్లే సాధ్యం. కాంగ్రెస్ వాళ్లు చాలా మాట్లాడుతున్నరు. మరి వారు ఎందుకు మెడికల్ కాలేజీలు పెట్టలేదు కరీంనగర్ జిల్లాలో.

కరీంనగర్ జిల్లాలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాలే. రామగుండం వచ్చింది. జగిత్యాల వచ్చింది. రేపు సిరిసిల్లలో వస్తది, కరీంనగర్ లో వచ్చే ఏడాది కల్ల వస్తది.చదువుకోవడానికి తెలంగాణ వచ్చేనాడు ఎం.బీబీఎస్ 700 సీట్లు మాత్రమే తెలంగాణలో ఉండేది. ఇవాళ 700 నుండి 2840 సీట్లకు ఎం.బీ.బీ.ఎస్ సీట్లు పెంచాం. వీటిని 5 420 కి పెంచుతున్నం. పేదలకు వైద్యం- మన విద్యార్థులకు చదువు ఇస్తున్నం.

ఒకడు పాదయాత్ర, సైకిల్ యాత్ర, డబులు ఇంజన్ స్పీడ్ అంటూ చేస్తున్నరు. దవాఖానాల్లో ఏ రాష్ట్రంలో బాగ చేస్తున్నరు అని కేంద్రం లెక్కలు చెప్పింది. అందులో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉంది.ఉత్తర ప్రదేశ్ నుండి సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని మోదీ ఎంపీగా ప్రాతినిద్యం వహిస్తున్నరు. ఆ రాష్ట్రం వైద్య సేవలు అందించడం లో చిట్టచివరి స్థానంలో ఉంది . ఇది డబులు ఇంజన్ గ్రోత్. ఎవరి పరిపాలన బాగున్నట్లు

రాహుల్ గాంధీ వస్తున్నడు. ఇన్నేళ్లు మీరే కదా పాలించింది. తెలంగాణ రాక ముందు కరీంనగర్ జిల్లాలో డయాలిస్ సెంటర్ ఉందా. కిడ్నీ రోగం వస్తే హైదరాబాద్ లేదా వరంగల్ వెళ్లాలి. తెలంగాణ రాకముందు మూడు కేంద్రాలు మాత్రమే ఉండేవి. ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం మాత్రమే ఉండేవి. తెలంగాణలో ఇవాళ మూడు నుండి 102 కు పెంచినం. జగిత్యాలలో పెట్టినం, ధర్మపురిలో పెట్టినం, కోరుట్ల, చొప్పదండిలో ఈ వారంలో డయాలిసిస్ సెంటర్ మంజూరు చేస్తం.

కాంగ్రెస్ వాళ్లు పెద్ద నోరు పెట్టుకోని మాట్లాడుతున్నరు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బాగా మాట్లాడుతున్నరు. ఎందుకో మెడికల్ కాలేజీలు రాలే ఆనాడు, డయాలిసిస్ కేంద్రాలు రాలే.తెలంగాణ రాకముందు ఐసీయూ బెడ్లు 200 మాత్రమే ఉండేవి. ఇవాళ వాటిని 6 వేలకు పెంచినం. పేదలకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్నం.

తెలంగాణ రాక ముందు ఆరు ఎం.సీ.హెచ్ కేంద్రాలు ఉండేవి. ఇవాళ వాటిని 28కు పెంచుకున్నం. 403 కోట్ల రూపాయలు ఖర్చు చేసినం. పేదలకు మంచి వైద్యం దొరకాలని 28 ఎం.సీ. హెచ్ కేంద్రాలు పెట్టినం.పేదల వైద్యం పైన సీఎం గారు ఎంత సీరియస్ గా దృష్టిపెట్టారో ఆలోచించండి. ఈ కాంగ్రెస్ ఉంటే ఇవన్నీ వచ్చేవా ఆలోచించండి. ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తున్నది.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెరగాలి. ఆశాలు దీనిపై పూర్తిగా దృష్టి పెట్టాలి. 56 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరగాలి. కొన్ని జిల్లాల్లో తెలంగాణ వచ్చాక ప్రయివేటు ఆసుపత్రులకు తాళాలు పడుతున్నయి.

దుబ్బాకలో ప్రభుత్వ ఆసుపత్రి పెట్టాక 3-4 గెనకాలజిస్టు ఆసుపత్రులకు తాళాలు పడ్డాయి. ప్రయివేటు ఆసుపత్రులతో పోటీ పడి వైద్యం అందించాలి. ప్రయివేటు కన్నా చక్కటి ఆసుపత్రి ఇక్కడ కట్టినం. అన్ని సౌకర్యాలు కల్పించినం.

నార్మల్ డెలివరీకి ఆశాలు, డాక్టర్లు, ఎ.ఎన్.ఎంలు కృషి చేయాలి. కలెక్టర్ గారు, ప్రజా ప్రతినిధులు అయ్య గార్లతో మాట్లాడి ముహుర్తాల గోల లేకుండా చూడాలి.ప్రజలకు రోగాలు రాకుండా కాపాడాడమే మన బాధ్యత. ఎన్సీడీ స్క్రీనింగ్ పెంచండి. సుగర్, బీపీ ఉన్నవాళ్లను గుర్తించండి. వాళ్లకు మందులు ఇవ్వండి.అన్ని పీహెచ్సీలలో కెమెరాలు పెట్టిస్తున్న. డాక్టర్లు 9 నుండి నాల్గింటి వరకు ఉంటున్నరా లేదా, మందులు ఇస్తున్నరా లేదా అన్ని చూస్తం. మీకు ఏది కావాలంటే అది ఇస్తం. పని కూడా కావాలే.ప్రతీ నెల ఆశాలతో మీటింగ్ లు పెడతా, కలెక్టర్లు, డీఎంఈ రమేష్ రెడ్డి, ఇతర వైద్యాధికారుల అందరీ లెక్క చూస్త. నా లెక్క సీఎం గారు చూస్తరు.

దేశంలో వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ ఆదర్శంగా ఉండాలి.జగిత్యాలకు సీటీ స్కాన్ మిషన్ మంజూరు చేస్తున్నం. జగిత్యాలలో టీ- డయాగ్నసిస్ కేంద్రం పెట్టినం. ఉచితంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో రక్తపరీక్షలు చేయాలి. ప్రజలు ఎందుకు ప్రయివేటు పరీక్ష కేంద్రాలకు వెళ్తున్నరు. మీరు ప్రజల్లో దీనిపై అవగాహన పెంచాలి. 56 పరీక్షలు ఉచితంగా చేస్తున్నం. రేడియాలజీ ల్యాబ్ కూడా జగిత్యాలలో త్వరలో పెడుతున్నం.

కాన్పు సమయంలో మాతా శిశు మరణాల్లో తమిళనాడు ముందుండేది. ఆ రాష్ట్రాన్ని అధిగమించినం. దేశంలో మనం రెండో స్థానంలో నిలిచాం.ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మొకాళ్ల ఆపరేషన్లు జగిత్యాలఆసుపత్రుల్లో చేయిస్తం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయిస్తున్నం.

నలబై రూపాయలకు రెండు పూటల భోజనం రాదు. ఆసుపత్రుల్లో భోజనం కోసం ప్రతీ పేషంట్ కు 80 రూపాయలతో కడుపునిండా భోజనం పెట్టనున్నాం. శానిటేషన్ మంచానికి ప్రతీ నెల 5 వేల రూపాయలు ఇచ్చేది. ఇప్పుడు 7500 కు పెంచుతున్నం. వారితోను మంచిగ పని చేయిస్తం. నెల నెలా జీతం ఇస్తం.

వైద్యరంగంలో ప్రతీ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నం. పాము కాటుకు, కుక్క కాటుకు మందు లేదు అనే పరిస్థితి లేదు. మందులు ఉచితంగా ఇస్తున్నం. మందులు లేవు అన్న పరిస్థితి లేదు. జనరిక్ మందులు ఇవ్వాలి. బయట మందులు రాస్తే డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటం. అనవసరంగా బ్రాండెడ్ మందులకు చీటీలు రాస్తున్నరు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రాయవద్దు. అవసరమైన డబ్బులు సూపరిండెంట్ల వద్ద పెట్టినం.

LEAVE A RESPONSE