మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య
అమరావతి : సోమవారం నాడు ఉదయం అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర 2.0 కు పెనుమాక వద్ద రైతులను కలిసి వారి యాత్రకు సంఘీభావం తెలియజేసిన మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య మాట్లాడుతూ..అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్ర 2.0కు అంకురార్పణ జరిగింది. అమరావతిపై అధికార పార్టీ పెద్దలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, రాజధాని ఆవశ్యకతను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు అమరావతి ప్రాంత రైతులు మహా పాదయాత్ర 2.0కు శ్రీకారం చుట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ ఈ అమరావతి ఉద్యమ అణచివేతకు మొదటినుంచి ఆటంకాలు సృష్టిస్తూనే ఉంది. ఈ అమరావతి ఉద్యమంలో ఎంతో మంది రైతులు తమ ప్రాణాలను కోల్పోయారు. అమాయకులైన వారిపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి సామాన్య ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురి చేయాలని చూశారు. అమరావతి ఉద్యమం మహోన్నత రూపం దాల్చి రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని ఎండగట్టి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని సాధించేవరకు ఈ ఉద్యమం ఆగదు.