ముందు మీ మంత్రి గంగుల ఆస్తులు ఎప్పుడు ప్రకటిస్తారో తేదీ చెప్పండి

* ఆస్తుల ప్రకటనకు నగరం నడిబొడ్డున చర్చకు మేం సిద్ధం, మా సవాల్ కు మీరు సిద్ధమా..?
* ప్రభుత్వానికి గ్రానైట్ వ్యాపారులు కట్టాల్సిన 749 కోట్ల పన్ను పై మీ మంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారు.
* బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి సవాల్

మంత్రి గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా 2009 కన్నా ముందు ఉన్న ఆస్తులు, ఎమ్మెల్యేగా 2009 తర్వాత నుండి నేటిరోజు వరకు సంపాదించిన ఆస్తుల చిట్టా ఎప్పుడు బహిరంగంగా ప్రకటిస్తారో తేదీ ప్రకటించండని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కు బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి గట్టి సవాల్ విసిరారు. ఈ సవాల్ స్వికరించి కరీంనగర్ నడిబొడ్డున ఉన్న టవర్ సర్కిల్ వేదికగా మీ మంత్రి స్వయంగా ఆస్తులు ప్రకటిస్తే మా ఎంపీ కూడా ఆస్తులు ప్రకటించడానికి సిద్దమని బేతి మహేందర్ రెడ్డి తెరాస నాయకుల్ని డిమాండ్ చేశారు.

అధికార పార్టీ ముసుగులో మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర తెరాస ప్రజా ప్రతినిధులు ప్రజా ధనాన్ని ముడుపుల ముసుగులో ప్రతి పనిలో వాటాలు తీసుకుంటూ అక్రమంగా సంపాదిస్తున్నది మీరు కాదా అని బేతి మహేందర్ రెడ్డి ప్రశ్నించారు. అలాగే మాజీ మేయర్ రవీందర్ సింగ్ కు గ్రానైట్ అక్రమాల గూర్చి మాట్లాడే నైతిక హక్కు లేదని, ఈ అక్రమాలు చేసేది, చేపించేది మీ ప్రభుత్వంలోని పెద్దలే అనే విషయం మరిచిపోవడం సిగ్గుచేటని మహేందర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.

మీ టీ.ఆర్.ఎస్ ప్రభుత్వం అధికారంలోకి ఉండగానే 2016 లో కరీంనగర్ లోని తొమ్మిది గ్రానైట్ కంపెనీలకు అయిదు రేట్లు జరిమానాతో పాటు సినరెజీ డబ్బులు కలిపి 749 కోట్ల 66 లక్షలు చెల్లించాలని గతంలో మీ ప్రభుత్వానికే ఈ డబ్బులు చెల్లించాలని చెప్పిన కూడా నేటివరకు 11 కోట్లు మాత్రమే చెల్లించి మిగతా 738 కోట్ల 66 లక్షలు ఎగొట్టి నేటివరకు ఆ డబ్బులు ఎందుకు కట్టించుకుంటాలేరో మీ మంత్రి గంగుల కమలాకర్ సమాధానం చెప్పాలని రవీందర్ సింగ్ ను బేతి మహేందర్ రెడ్డ్ ప్రశ్నించారు.

మీరు మీ ప్రభుత్వానికి రావాల్సిన గ్రానైట్ పన్నులు కరెక్టుగా కట్టించుకుంటే మేమెందుకు ఈ.డి, సీబిఐ లకు ఆశ్రయిస్తామని రవీందర్ సింగ్ కు ఈ విషయం తెలియకపోవటం సిగ్గుచేటని మహేందర్ రెడ్డి విమర్శించారు. మీ మంత్రి, మీరు చేసిన, చేస్తున్న తప్పులను మీ క్రింద పెట్టుకొని మా పార్జీ నాయకులకు విమర్శించడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని మహేందర్ రెడ్డి ఘాటుగా తిప్పికొట్టారు. అలాగే మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో ప్రధాని మోదీ పై, ఇతర బీజేపీ అగ్ర నాయకుల పై ఆవకులు, చేవకులు పేలుతు పచ్చి అబద్దాలు మాట్లాడడం మానుకోవాలని, లేకపోతే ప్రజా క్షేత్రంలో మీకు త్వరలో గట్టిగా బుద్ది చెపుతామని బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి హెచ్చరించారు.

Leave a Reply