Suryaa.co.in

Andhra Pradesh

ఈ దేశం నాదీ అన్న భావనే ముఖ్యం

– పుట్టిన దేశం, జన్మనిచ్చిన తల్లిదండ్రులను విస్మరించకూడదు
– నలంద విద్యాసంస్ధల స్వాతంత్య్ర వేడుకల్లో జస్టిస్ వేణుగోపాల్ హితవు
– నలంద విద్యా సంస్థల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

నలంద విద్యాసంస్థల ప్రాంగణంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఉల్లాస భరితంగా జరిగాయి. విద్యార్ధుల జాతీయ గీతాలపన, సాంస్కృతిక కార్యక్రమాలు స్పూర్తిదాయకంగా మారాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరయి, స్పూర్తివంతమైనn2 ఉపన్యాసం చేశారు. విద్యార్ధులు పుట్టిన దేశాన్ని, జన్మనిచ్చిన తలిదండ్రులను మర్చిపోకూడదని హితవు పలికారు. ప్రపంచదేశాలకు ధీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్న భారత్, ఈ స్థాయిలో ఉండటానికి కారణమయిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు వారి చరిత్రను, విద్యార్ధులు చదవాలని సూచించారు.

ఈ దేశం నాది అన్న భావన అందరిలో ఉండాలన్నారు. నాకు ఈ దేశం ఏమిచ్చింద ని కాకుండా, నేను ఈ దేశానికి ఏం చేశాను? ఈ దేశాభివృద్ధిలో నా పాత్ర ఏమిటన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకున్నn1 వేళ, ఈ దేశం చైతన్యవంతమవుతుందని అన్నారు. కాగా తొలుత జస్టిస్ వేణుగోపాల్‌కు నలంద విద్యాసంస్ధల చైర్మన్ ఎం. శ్రీనివాసరాజు, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ వేణుగోపాల్ విద్యార్ధులకు బహుమతులు, జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాసరాజు మట్లాడుతూ, జాతీయ సమైక్యత, జాతీయవాద అంశాలే తమ నలంద సంస్థల స్థాపనకు మూలమన్నారు.

LEAVE A RESPONSE