Suryaa.co.in

Andhra Pradesh

యువశక్తిని సక్రమంగా వినియోగించుకుంటే ప్రపంచంలో అత్యున్నత స్థాయికి భారత్

-రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
-ఉండవల్లి నివాసంలో జాతీయ జండా ఆవిష్కరించిన టీడీపీ అధినేత
– టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

‘విజన్-2047’తో ప్రణాళికా బద్దంగా ప్రయాణం సాగించాలి. పేదరికం, అసమానతలు లేని సమాజం సాధించడం లక్ష్యం కావాలి. రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణకు స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలి. నైపుణ్యం గల పౌరులు, డిజిటల్ స్ట్రెంగ్త్, ప్రపంచంలో ఎవరికీ లేని యువశక్తి భారత దేశానికి ఉన్న బలం. యువశక్తిని సమగ్రంగా వినియోగించుకోవడం ద్వారా భారత దేశాన్ని ప్రపంచ మేటి దేశంగా మార్చవచ్చు.

ఇప్పుడే ‘విజన్-2047’ సిద్ధం చేసుకుని….ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లడం ద్వారా…భారత్ ప్రపంచంలోని అగ్రదేశాల్లో 1 లేదా 2వ స్థానాలకు చేరుతుంది. ఐటీ విప్లవాన్ని అవకాశంగా మార్చుకోవడం ద్వారా తెలుగువారు ప్రపంచ స్థాయిలో ఉత్తమ విజయాలు సాధించారు

2029 నాటికి ఏపీని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా మార్చేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రణాళికాబద్దంగా పనిచేశాం. వైసిపి ప్రభుత్వం విధ్వంసాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. రాజ్యాంగ విరుద్ద, ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనతో రాష్ట్ర భవిష్యత్ ప్రమాదంలో పడింది. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోలేకపోతే ప్రజాస్వామ్య మనుగడే ప్రమాదంలో పడుతుంది.

LEAVE A RESPONSE