– ఎంపీ విజయసాయి రెడ్డి
విశాఖపట్నం, ఆగస్టు 17:ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహం ఫలితంగా పారిశ్రామిక దిగ్గజ కంపెనీల చూపు ఇప్పుడు ఏపీ వైపు మళ్లిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా గురువారం పలు అంశాలు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో జపాన్ టైర్ల తయారీ కంపెనీ యెకహోమా నెలకొల్పిన అలయన్స్ టైర్స్ మొదటి దశ ప్లాంట్లో ఉత్పత్తిని ప్రారంభించి రెండో దశ ప్లాంట్ కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.
అలాగే మరో 8 పరిశ్రమలకు కూడా శంకుస్థాపన చేశారని చెప్పారు. సెజ్లో పీడీలైట్స్, మేఘా ఫ్రూట్ ప్రోసెసింగ్, ఇనాక్స్ ఎయిర్ ప్రోడక్ట్స్, ఆప్టిమస్ డ్రగ్స్, విన్ విన్ స్పెషాలిటీ ఇన్సులేటర్, సైనాప్టిక్స్ ల్యాబ్స్, స్టైరాక్స్ లైఫ్ సైన్స్, ఇషా రిసోర్సెస్ వంటి కంపెనీలకు ప్రభుత్వం భూములు కేటాయించింది. వందల కోట్ల పెట్టుబడులతో ఆయా కంపెనీలు వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయని ఆయన తెలిపారు.
చంద్రబాబు, లోకేష్ ల శకం ముగిసినట్టే
పచ్చకుల మీడియా ఎంతగా ప్రాకులాడుతున్నా ఫలితం శూన్యం. జాకీలు, క్రేన్లు, భజనలన్నీ వేస్ట్. ఇక చంద్రబాబు, లోకేష్ బాబుల శకం ముగిసినట్లేనని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. మంచి కార్యక్రమాలకు, ప్రజా ఉద్యమాలకు మీడియా దన్నుగా నిలవడం ఆనవాయితీ. అయితే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకొని దివాళా తీసిన టీడీపీతో కుల మీడియా అతుక్కుపోయింది. మీడియా రంగంలో “కాస్ట్ బేస్ డ్ సపోర్టు” దేశంలో మరెక్కడా లేదని ఆయన తెలిపారు.
పంటలకు కనీస మద్దత్తు ధర కల్పించాలి
2021-22 సంవత్సరానికి దేశంలో వరి, మొక్కజొన్న, పప్పులు, నువ్వులు, నూనె గింజలు, చెరుకు మెదలగు పంటలు రికార్డు స్థాయి ఉత్పత్తి సాదించనన్నట్లు అంచనాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం ఆయా పంటలకు కనీస మద్దత్తు ధర కల్పించే దిశగా హామీ ఇవ్వాలని విజయసాయి రెడ్డి కోరారు. ఆయా పంటలతో పాటు ఇతర పంటలకు కూడా కనీస మద్దత్తు ధర పరిధిలోకి తేవాలని, అన్నదాతకు మేలు చేకూర్చాలని అన్నారు.