తిరుమలలో పెంచినది రేట్లు మాత్రమే అని అనుకుంటే పొరపాటే.
పెంచడం వల్ల జరిగే పరిణామాలు:
1. భక్తుల సంఖ్య తగ్గడం తద్వారా తిరుమల భూమి అన్యాక్రాంతం అయ్యే సంభావ్యత ఎక్కువ.
2. హుండీ ఆదాయం తగ్గడం వల్ల టీటీడీ నడిపే పాఠశాలలు ( మరియు వేదపాఠశాలలు), యాగాలు, కష్టం అవ్వడం తద్వారా, అవి కొంచెం కొంచెం తగ్గి, పూర్తిగా ఆగిపోయే సంభావ్యత ఉంది.
3. టీటీడీ మిగిలిన దేవాలయాలకు పునరుద్దరణకు, నడపటానికి ఇచ్చే ఖర్చు తగ్గడం, మరియు పూర్తిగా స్తంభించి పోయే సంభావ్యత ఉంది.
తద్వారా హిందూ ధర్మ పరిరక్షణ భారంగా మారటం, ఆగిపోయే ప్రమాదము చాలా ఎక్కువ.
తద్వారా మిగిలిన హిందూ దేవాలయాలు వాటి ప్రాశస్త్యాన్ని కోల్పోవడం జరుగుతుంది, అన్యాక్రాంతం అవుతాయి.
4.టీటీడీ ధనము ఎలా ఖర్చు అవుతుంది , ఇప్పటి వరకు ధనము ఏమి అయ్యింది అనేది ఆ వెంకటేశ్వర స్వామికే తెలియాలి.
ఇంక ఇప్పుడు అసలు తెలియదు.
5. టీటీడీ తన ప్రాశస్త్యాన్ని కోల్పోతుంది.
కొన్నాళ్లకు టీటీడీ( తిరుమల) అంటే కూడా ఎవరికీ తెలియని పరిస్థితి వచ్చేస్తుంది.
ఇప్పుడు జరిగింది రేట్లు పెంచడం కాదు, అందులో ఉన్న కుతంత్రం హిందూ సంపదని, సంస్కృతిని, సమాజాన్ని కొల్ల గొట్టడం. ఇది ఇలాగే జరిగితే కొన్నాళ్లకు హిందువు అనే వాడు ఉండే అవకాశం లేదు.
ఇప్పుడు జరిగింది సాంస్కృతిక దాడి. తస్మాత్ జాగ్రత్త.
మన తరాలకు మనం ఇచ్చేది ఒక్కటే. అదే సంస్కృతి, సంప్రదాయం.
అవే కోల్పోతున్నాం.
ఇప్పుడు మేల్కోకపోతే భవిష్యత్ హైందవజాతి మనల్ని క్షమించదు.
– సతు