ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్స్ అండ్ మేనేజ్మెంట్ పుస్తక ఆవిష్కరిన

Spread the love

” ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్స్ అండ్ మేనేజ్మెంట్ ” పుస్తకాన్ని ఆవిష్కరించిన బోయినపల్లి వినోద్ కుమార్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు

నిర్మాణ రంగంలో మౌలిక సదుపాయాలు, కాంట్రాక్టర్లు, యాజమాన్యం అంశంలో సమగ్ర సమాచారాన్ని క్రోడీకరించి ముద్రించిన ” ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్స్ అండ్ మేనేజ్మెంట్ ” పుస్తకాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు.

ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరాయ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రోడ్లు, భవనాల శాఖ ఈ.ఎన్.సీ. రవీందర్ రావు, ఇంజనీర్స్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మారెడ్డి, పుస్తక రచయిత డాక్టర్ శ్రీధర్ మోతె పాల్గొన్నారు.ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ నిర్మాణ రంగంతో పాటు వ్యవసాయ రంగం కూడా ప్రాధాన్యత సంతరించుకుందని అన్నారు. నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్టర్లకు నైపుణ్య శిక్షణ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు.

Leave a Reply