నవీన్ కుమార్ రెడ్డి శ్రీవారి భక్తులు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్
– నవీన్ కుమార్ రెడ్డి
గోమాతను పూజిద్దాం గోసంతతిని సంరక్షిస్తాం!
గోమాత విశ్వమాత సర్వదేవతల స్వరూపిణి!!
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, ఉన్నతాధికారులకు విజ్ఞప్తి.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక తిరుపతి నగర ముఖద్వారంలో శ్రీవారి భక్తులకు స్వాగతం పలుకుతూ “సింబాలిక్” గా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చక్కటి తెల్లటి “ఆవు దూడ” ప్రతిమను ఏర్పాటు చేసి హిందూ సనాతన ధర్మంలో గోమాత విశిష్టతను భవిష్యత్ తరాల వారికి తెలియజేయాలన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఇప్పటికే “గుడికో గోమాత” నినాదంతో గోవులను అందిస్తున్నారు, తుమ్మలగుంట వద్ద గోశాలతో పాటు ఇటీవల కాలంలో అలిపిరి పాదాల మండపం వద్ద శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం మరో గోశాలను ఏర్పాటు చేయడం శుభ పరిణామం అనేకమంది భక్తులు “గో ప్రదక్షిణ” చేసి గోవులను పూజించి తిరుమల కొండకు నడచి వెళ్లడం జన్మజన్మల పుణ్యఫలం అన్నారు.
ప్రాచీన హిందూ సంస్కృతికి, సాంప్రదాయానికి ప్రతీక గోమాత “గో ప్రదక్షణ” చేస్తే భూప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం గోమాతకు ఆహారం పెడితే 33 కోట్ల దేవతలకు నైవేద్యం పెట్టినంత పుణ్యఫలం లభిస్తుందన్నారు.
భారతీయులకు “ఆరాధ్య దేవత గోమాత” నూతన గృహప్రవేశాలలో ఆవు దూడతో కొత్త ఇంటిలోకి ప్రవేశిస్తే సాక్షాత్తు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందన్న విశ్వాసం, నమ్మకం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం.
హిందువులు పవిత్రంగా భావించే గ్రంథాలు భారత, రామాయణ,భాగవతంలో గోమాత విశిష్టత గురించి ఎంతో గొప్పగా వర్ణించారు.హిందూ సనాతన ధర్మంలోని ఋగ్వేదంలో సామవేదంలో అధర్వణ వేదంలో గోమాత శరీరంలోని పంచద్రవ్యాల (పాలు పెరుగు నెయ్యి గోమూత్రం పేడ) విశిష్టతను తెలియజేశారు.
శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి “గోపాలుడయ్యాడు” గోమాతను ఆరాధిస్తే సమస్త దేవతలను పూజించినంత పుణ్యఫలం లభిస్తుందన్నారు.
TTD ధర్మకర్తల మండలి చైర్మన్ ఉన్నతాధికారులు సహృదయంతో స్పందించి తిరుపతి ముఖద్వార కూడలిలో “గోమాత దూడ” ప్రతిమను ఏర్పాటు చేయాలని శ్రీవారి భక్తునిగా స్థానికునిగా హిందూ బంధువుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను.