Suryaa.co.in

Telangana

కేటీఆర్ వ్యాఖ్యలు ఖండించిన ఐపీఎస్ సంఘం

– రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌కు బాసట
– కలెక్టర్‌ను సన్నాసి అంటూ కేటీఆర్ విమర్శ
– మావాళ్లను పార్టీ మారమంటున్నారని ఆరోపణ
– కేటీఆర్ వ్యాఖ్యలు సరికావన్న ఐపీఎస్ సంఘం

హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది. నిరాధార ఆరోపణలు సరికాదు. ఇలాంటివి చెడు ప్రభావం చూపుతాయి. కేటీఆర్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం, ప్రజాస్వామ్యానికి హానికరమని వెల్లడించింది. ఈ విషయంలో తాము కలెక్టర్‌కు అండగా ఉంటామని ఐపీఎస్ అధికారుల సంఘం తెలిపింది.

కాగా సిరిసిల్లలో ఇటీవల నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్.. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తలా పని చేస్తున్నారు. తమ పార్టీ నాయకులను పార్టీ మారాలని అడుగుతున్నాడు. ఇలాంటి సన్నాసిని కలెక్టర్‌గా తీసుకొచ్చా రు. అతి చేస్తున్న కలెక్టర్లు, అధికారులు రాసి పెట్టుకోవాలి. కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తే మళ్లీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో చెల్లిస్తామని హెచ్చరించారు.

LEAVE A RESPONSE