Suryaa.co.in

ఆగిన రాజధానిలో ఇనుప గద్దలు
Political News

ఆగిన రాజధానిలో ఇనుప గద్దలు

– బేతపూడి, కురగల్లు, నిడమర్రు, నీరు కొండ ప్రాంతాలలో ఇనుము మాయం?
– దీనిలో పెద్ద గద్దల వాటా ఎంత? రాబందుల వాటా ఎంత?
– తరలించు వారి వాటా ఎంత?
– క్షేత్రస్థాయిలో పరిశీలించే నాధుడు కరువు
గత కొంతకాలంగా రాజధాని ప్రాంతంలో ఇనుము అక్రమ రవాణా జరుగుతున్న మాట వాస్తవమే కానీ కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టులు చేసి జైలుకి పంపించిన ఘటనలు లేకపోలేదు అయితే తాజాగా ఆ ఇనుప గద్దల పైనే రాబందులు పీక్కొని తిని పైశాచిక ఆనందం పొందుతున్నారు రాబందులు ఎవరు అనేది బహిరంగ రహస్యమే తాజా ఘటనతో గతంలో పట్టుబడిన ఇనుప దొంగలు ఇనుమును దొంగిలించింది ఎంత? చూపించింది ఎంత? దీనిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
workదీనికి ప్రధాన కారణం తాజాగా బేతపూడి, కురగల్లు, నిడమర్రు, నీరు కొండ ప్రాంతాలలో రాజధాని నిర్మాణ పనుల కోసం ఏర్పాటుచేసిన పనులు నిలిచిపోవడంతో అక్కడే ఉన్న ఇనుమును మరికొంత ఇతరేతర సామాగ్రిని దొంగలించి వాటిని సొమ్ము చేసుకుంటూ ధనార్జన పొందుతున్నారు కొందరు దొంగలు దొంగల పైనే గద్దల్లా వాలిన కొందరు ప్రబుద్ధులు వారు చేసిన దొంగతనాల ని కప్పి పుచ్చే యత్నం చెయ్యబోతే అడ్డంగా బుక్కయ్యారు గతంలో కట్టిన కేసులకు తాజాగా దొరికిన ఆ ప్రబుద్ధులపై కట్టిన కేసులకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయంటూ పాత నేరస్తులే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు.
దీనిపై ఆ శాఖ ఉన్నట్లుగా వ్యవహరిస్తూ ఏదో జాలి దయ చూపుతూ మొక్కుబడిగా చిన్న కేసులతో మామ అనిపించడం సర్వత్ర ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి దీనికితోడు పట్టుబడ్డ వ్యక్తులు చిన్న చితక వారంటూ

వారిపై కేసులు ఎందుకు లే అన్న చందంగా ఓ…. వ్యక్తి ప్రవర్తన తీవ్ర విమర్శలకు తావిస్తుంది అన్నీ తానే వ్యవహరించే విధంగా ఓ గద్ద తనకు మంచి చేస్తే అన్నీ సాఫీ అవుతాయని సలహా ఇచ్చినట్లు సదరు నిందితులు నిందితుల బంధువులు కొందరి వద్ద వాపోయినట్లు విశ్వసనీయ సమాచారం.
నిందితులు మాత్రం తాము కేవలం వస్తువులను ఇస్తే తీసుకువెళ్లే వాళ్ళమే తప్పించి తమకు ఈ పాపంలో ఏమాత్రం సంబంధం లేదని వాపోతున్నారు ఇప్పటివరకు రాజధాని ప్రాంతంలో తరలిపోయిన ఆ సంపద ఎంత? అవి ఎవరి జేబుల్లోకి వెళ్లినాయి దీనిలో పట్టుకున్న వి ఎంత? రికవరీ చేసినది ఎంత? ఆ గద్దల వాటాలు ఎంత ఎంత? అయితే దీనంతటికీ మూల కారకుల పై చర్యలు ఎవరు తీసుకుంటారో ఎలా తీసుకుంటారో వేచి చూడాల్సిందే. లేదా అన్ని కేసులు లాగానే ఈ కేసు కూడా అటకెక్కిస్తారేమో? లేక ఇంకా ఎంత మంది అమాయకుల పై తమ పైశాచికత్వం చూపిస్తారో?!

– రమేష్ పులగం

LEAVE A RESPONSE