Suryaa.co.in

Political News

నలగని ఇస్త్రీ చొక్కాలు.. పెత్తనం కోసం పరితపిస్తున్నాయ్!

పసుపు జెండా ఆకాశాన ఎగిరే సమయాన
విజయోత్సవాలు కన్న ముందు
కార్యకర్తల బంగారు భవిష్యత్ కి
ప్రణాళిక సిద్ధం చెయ్యండి.

మరల
పొరలు కప్పుకున్న స్వార్థనాగులెన్నో
ఆధిపత్యం కోసం విషం జిమ్మటానికి సిద్ధమవుతున్నాయి

చెమట చుక్కలతో తడిసిన చొక్కాలు ఆరకముందే
నలగని ఇస్త్రీ చొక్కాలు పెత్తనం కోసం
పరితపిస్తున్నాయి

గంజి తాగి జెండా మోసెటోడు ఒకడైతే
అదే గేంజిని తమ ఖద్దరుకు వాడేటోడు మరొకడు

దమ్ముగా బూత్ ల్లో నిలబడి
ఓటు వెయ్యించినోడు చివరి వరుసలో
బూతు రాజకీయాలు చేసేటోడు
ముందు వరుసలో

ఇకనైన
ఏళ్ల తరబడి జెండా మోసే
కార్యకర్తల కష్టం
నాయకుల కుర్చి కోడుల క్రింద
నలిగిపోకూడదు
స్వార్థ రాజకీయాలకు స్వస్తిపలికి

జెండా మోసిన
ప్రతి సామాన్య కార్యకర్తని
కష్ట కాలంలో కాడెద్దులులా
పార్టీ బరువును
తమ భుజాలపై వేసుకున్న గ్రామ స్థాయి నాయకత్వాన్ని గుర్తించండి.

కాకర్ల సత్యేంద్ర ప్రసాద్
కొవ్వూరు నియోజకవర్గం – టీడీపీ

2)మళ్ళా తయారైపోతున్నారు…

బీరువాలో దాచిన ఖద్దరు చొక్కాకి గంజి బిర్రుగా పెట్టి ఇస్త్రీ చేయించి బయలుదేరుతున్నారు..

తెలుగుదేశం గెలవబోతుంది అనగానే..
ఈ ఐదేళ్ళు ఇళ్ళలో నిద్రపోయిన వాళ్ళు,
పార్టీని సమర్ధిస్తూ ఒక్క పోస్టు పెట్టని వాళ్ళు,
వైకాపాని విమర్శించడానికి ఉచ్చపోసుకున్న వాళ్ళు..
400రూ పసుపు గులాబీల బొకేలతో తయారైపోయారు…
కొత్త నాయకుల ముందు మేరుమానం కోసం..
గతంలో తవ్విన గోతులను మర్చిపోయి..
మళ్ళా తయారైపోతున్నారు..
బాబు గారూ.. బహుపరాక్!

LEAVE A RESPONSE