నీటిపారుదల పనులలో వేగవంతం పెంచాలి

-భూసేకరణ లో అలసత్వం వలదు
-సోలిపురం బ్రిడ్జి నిర్మాణపు పనులు తక్షణం ప్రారంభించాలి
-పెండింగ్ లో ఉన్న చౌటుప్పల్ మినీ ట్యాన్క్ బండ నిర్మాణపు పనులు పూర్తి చేయాలి
-మినీ ట్యాన్క్ బండా నిర్మాణపు పనులను అలసత్వం చేసిన కాంట్రాక్టర్ ను పక్కకు తప్పించండి
-మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి పనులపై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష

పాల్గొన్న శాసనసభ్యులు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,గాధరి కిశోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ అజయ్ కుమార్,రెవిన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్,ఇ ఇ రాములు జిల్లా నీటిపారుదల అధికారి ప్రభు కళ్యాణ్ తదితరులు

మునుగోడు నియోజకవర్గ పరిధిలో మొదలు పెట్టిననీటిపారుదల పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.అందుకు సంబంధించిన భూసేకరణ లో అలసత్వం చూపొద్దని ఆయన అధికారులకు సూచించారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలో నీటిపారుదల శాఖా చేపట్టిన శివన్న గూడెం ప్రాజెక్ట్ కు సంబంధించిన ఆర్ & ఆర్ ప్యాకేజీ తో పాటు, లక్ష్మణపురం ఆర్ & ఆర్ ప్యాకేజీ శశిలేటి వాగు ఫిడర్ చానల్ కు సంబంధించిన భూసేకరణ మరియు నిర్మాణపు పనులు,వెలిమకన్నే,బెందలమ్మ చెరువు, సోలిపురం బ్రిడ్జి,చెక్ డ్యామ్ లు చౌటుప్పల్ లోని మినిట్యాన్క్ బండ నిర్మాణాల పురోగతి పై హైదరాబాద్ లోని తన ఛాంబర్ లో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. మునుగోడు శాసనసభ్యులు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తో పాటు శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్ ,చిరుమర్తి లింగయ్యజిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ అజయ్ కుమార్,రెవిన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్,ఇ ఇ రాములు జిల్లా నీటిపారుదల అధికారి ప్రభు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ శివన్న గూడెం,లక్ష్మణపురం ప్రాజెక్ట్ ల నిర్వాసితులకు తక్షణం ప్లాట్లు మంజూరు ఇవ్వాలని ఆదేశించారు. అందుకు సంబంధించిన పేపర్ వర్క్ ను వేగిరపరచాలని ఆయన చెప్పారు.అదే విదంగా శశిలేటి వాగు ఫిడర్ కు సంబంధించిన పనులను వేగవంతం చెయ్యడం తో పాటు అందుకు సంబంధించిన భూసేకరణ ను పూర్తి చేయాలన్నారు. అదే విదంగా ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సోలిపురం బ్రిడ్జి నిర్మాణపు పనులను ప్రారంభించడం తో పాటు పెండింగ్ లో ఉన్న చౌటుప్పల్ మినీ ట్యాన్క్ బండ నిర్మాణపు పనులు పూర్తి చేయాలన్నారు.ఇప్పటికే మినీ ట్యాన్క్ బండ నిర్మాణపు పనులు చేపట్టి పూర్తి చెయ్యలేక పోయిన సదరు కాంట్రాక్టర్ కు నోటీస్ ఇచ్చి పక్కకు తప్పించి మరొకరితో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు.

Leave a Reply