Suryaa.co.in

Features

దావూద్.. బ్రతికున్నడా? మరణించాడా?

( పొట్లూరి పార్థసారథి )

మాఫియా డాన్ దావూద్ మరణించాడు!
దీనిమీద పలు భిన్నమయిన వార్తలు వస్తున్నాయి!
నిజా నిజాలు ఏమిటో పరిశీలిస్తే కానీ వాస్తవం బయటపడదు!
రెండు రోజుల క్రితం తన 68వ పుట్టినరోజుని ఘనంగా జరుపుకోవాలని దావూద్ పాకిస్థాన్ లోని ప్రముఖులకు ఆహ్వానం పంపించాడు!
ఆహ్వానం అందుకున్న వారిలో ఇమ్రాన్ ఖాన్ కూడా ఉన్నాడు.
ఆర్మీతో పాటు ISI అధికారులకి, ఇతర రాజకీయ, పారిశ్రామిక, క్రికెట్ ప్రముఖలకి ఆహ్వానం వెళ్ళింది!

కానీ అనూహ్యంగా దావూద్ తీవ్ర అనారోగ్యంతో కరాచీ హాస్పిటల్ కి తరలించాల్సి వచ్చింది!
దావూద్ ఆహారంలో ఎవరో విషపదార్థలను కలపడం వలన తీవ్ర అస్వస్థతకు గురైనట్టు పాకిస్థాన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది!
ఒక్కసారిగా ఇంటర్నెట్ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది దాంతో ఇంటర్నెట్ వేగం పడిపోయింది!
మరీ అంతగా ట్రాఫిక్ పెరగడానికి తద్వార వేగం తగ్గడానికి కారణం పాకిస్థాన్ లో 80% 3G నెట్వర్క్ ఉండగా 20% మాత్రమే 4G నెట్వర్క్ ఉంది!

1.దావూద్ ని కరాచీ లోని అగాఖాన్ యూనివర్సిటీ హాస్పిటల్ కి తీసుకెళ్తున్నప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేశారు 45 నిముషాలపాటు! అక్కడ పరీక్షలు చేశాక తిరిగి PNS షిఫా హాస్పటల్ కి తీసుకెళ్లారు.
2.కరాచీ airport కి కూడా విద్యుత్ సరఫరా నిలిపివేశారు!
3. కరాచీ హాస్పిటల్ వద్ద ప్రత్యేక పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.
4.కరాచీ హాస్పిటల్ లో ఒక ఫ్లోర్ మొత్తం దావూద్ కి కేటాయించి డాక్టర్లు తప్ప ఎవరూ వెళ్ళడానికి వీలు లేకుండా పోలీసులని కాపలాగా పెట్టారు!
5. దావూద్ వియ్యంకుడు జావేద్ మియాందాద్ అతని కుటుంబ సభ్యులు కూడా బయటికి రాకుండా గృహని ర్బంధం లో ఉంచింది సైన్యం!

పాకిస్థాన్ ఆర్మీ ఎందుకింత రహస్యంగా ఉంచుతున్నది?
విషప్రయోగం వలన దావూద్ ఇప్పటికే మరణించాడు.
ఎందుకంటే దావూద్ డయాబెటిస్ తో పాటు కాన్సర్ తో బాధపడుతున్నాడు.
విషప్రయోగం వలన చికిత్సకు స్పందించే అవకాశం చాలా తక్కువ ఎందుకంటే డయాబెటిస్ ఉండడం వలన!

దావూద్ ని ఇప్పటికే రహస్య ప్రదేశంలో ఖననం చేసింది ఆర్మీ.
ఎలాంటి వార్త బయటికి రాకుండా ఉండడానికి మియాందాద్ కుటుంబాన్ని హౌస్ అరెస్ట్ చేయడమే కాదు దావూద్ మరణ వార్తను రహస్యంగా ఉంచమని మియాందాద్ ని హెచ్చరించింది ఆర్మీ!

1993 ముంబై బాంబ్ దాడుల తరువాత దావూద్ మొదట పాకిస్థాన్ పారిపోయాడు. దానికి సహకరించింది అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి శరద్ పవార్!
పాకిస్థాన్ దావూద్ కి తమ దేశ పౌరసత్వం ఇచ్చి(మారుపెరుతో) పాస్పోర్ట్ ఇచ్చింది.
పాకిస్థాన్ నుండి దుబాయ్ కి వెళ్ళిపోయాడు దావూద్. తరువాత దుబాయ్ నుండి ముంబై లో ఉన్న తన నేర సామ్రాజ్యాన్ని నిర్వహించాడు!
అమెరికా తో పాటు UN దావూద్ ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించగానే దావూద్ దుబాయ్ నుండి పాకిస్థాన్ కి తిరిగి వచ్చేశాడు!

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆయుధ స్మగ్లింగ్, వ్యవస్థీృత హత్యలు, కిడ్నాపింగ్, ఇలా పలు అభియోగాలు ఉన్నాయి దావూద్ మీద.
మోస్ట్ వాంటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ దావూద్!

పాకిస్థాన్ దావూద్ గురుంచి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు!
మోస్ట్ వాంటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ దావూద్ తమ దేశంలో లేడని పాకిస్థాన్ ఇప్పటివరకు అబద్ధం చెప్తూ వస్తున్నది.
6. భారత గూఢచార సంస్థ RAW దావూద్ కరాచీ లోని KLIFFTON ప్రాంతంలో ఒక సురక్షితమైన భవనంలో ISI భద్రతా వలయంలో ఉన్నాడని ఆధారాలతో సహా ప్రకటించింది!
7. కానీ ఆ భవనం పాకిస్థాన్ పౌరుడిది అని పాక్ ప్రభుత్వం RAW అధారాలని తోసిపుచ్చింది.

గత 4నెలలుగా పాకిస్థాన్ లో గుర్తు తెలియని వ్యక్తులు పలు టెర్రరిస్టులను చంపడం వెనుక RAW హస్తం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి!
నిజానికి గుర్తు తెలియని వ్యక్తులు చేసిన,చేస్తున్న హత్యలు,విష ప్రయోగాలతో RAW కి ఎలాంటి సంబంధం లేదు!
మరి ఎవరు చేస్తున్నారు?
ISI చేస్తున్నది!
ఎందుకు తన మనుషులని ISI చంపుతున్నది?
చాలా సింపుల్ లాజిక్ ఉన్నది!
అది FATF (FINANCIAL ACTION TASK FORCE).
FATF నిబంధనలు అమలు చేయాలి!
టెర్రరిస్ట్ ఆర్గనైజింగ్ లకి నిధులు సమకూరకుండ చూడాలి.
టెర్రర్ ఔట్ ఫిట్ లని నిషేధించాలి!
గుర్తించిన టెర్రరిస్టులను అరెస్ట్ చేసి జైలులో పెట్టాలి!
అప్పుడే అంతర్జాతీయ ఆర్థిక సహాయం అందుతుంది పాకిస్థాన్ కి .
కానీ పాకిస్థాన్ పౌర ప్రభుత్వం కానీ,సైన్యం కానీ ఈపని చేయలేవు!
1947 నుండి పాకిస్థాన్ ఆర్మీ మత పరమైన అంశాలు మీద అక్కడి ముల్లాలకి స్వేచ్ఛని ఇచ్చి ప్రోత్సహిస్తూ వచ్చింది.
ఇప్పుడు మత పరమైన సంస్థల మీద చర్యలు తీసుకుంటే అంతర్యుద్ధం తప్పదు.
కాబట్టి ముఖ్యులని చంపితే ఆయా సంస్థలు తాత్కాలికంగా మూత పడతాయి!
తాలిబాన్ ఫ్యాక్టర్ మరో కోణం ఉంది!
ఇప్పటికే పాకిస్థాన్ లోని ఉగ్ర గ్రూపులు తాలిబాన్ తరహా పాలన కావాలని కోరుతున్నాయి.
FATF నిబంధనల ప్రకారం ఉగ్ర గ్రూపులను నిషేధిస్తే అవి పేరు మార్చుకొని తాలిబాన్ తో చేతులు కలుపుతాయి.ఇది మరింత ప్రమాదకరం అవుతుంది సైన్యానికి అయినా, ISI కి అయినా!

ISI వెనుక లేకుండా నేరుగా జైలులో ఉన్న వాళ్ళని విషం పెట్టి హత్య చేయడానికి RAW కి యాక్సెస్ ఉండదు!అది ISI కే సాధ్యం!
ISI చేసే హత్యలు అన్నీ RAW ఖాతాలోకి వేస్తున్నది!
పాక్ ప్రజలతో పాటు ఇటు భారత్ లోని సోషల్ మీడియాలో కూడా RAW కి అంటగడుతున్నారు!
ISI కి కావాల్సింది ఇదే!

మరి దావూద్ హత్య వెనుక ISI ఉందా?
దావూద్ తన 58 వ పుట్టినరోజున అందరినీ పిలిచి గ్రాండ్ పార్టీ ఇవ్వడానికి కారణం ఉంది!
దావూద్ తన స్వంత రాజకీయ పార్టీ ప్రకటించాలని అనుకున్నాడు తన పుట్టిన రోజున!
ఇది ISI కి ఇష్టం లేదు!
పైగా పార్టీ కి ఇమ్రాన్ ఖాన్ ని పిలిచాడు దావూద్!
దావూద్ స్వంత రాజకీయ పార్టీ పెడితే అది దావూద్ పాకిస్థాన్ లోనే ఉన్నాడు అని తెలిసిపోతుంది ప్రపంచానికి!
ఇన్నాళ్లూ దావూద్ పాకిస్థాన్ లో లేడు అని చెప్తూ వచ్చిన పాకిస్థాన్ మీద FATF బ్లాక్ లిస్ట్ లో పెట్టే అవకాశం ఉంది!
బిన్ లాడెన్ విషయంలో పాకిస్థాన్ మా దేశంలో లేడు అంటూ బుకాయించింది కానీ చివరికి అమెరికన్ సీల్స్ లాడెన్ ని మట్టుబెట్టిన తరువాతే విషయం బయటపడ్డది !
IMF, వరల్డ్ బ్యాంక్ లతో పాటు ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు పాకిస్థాన్ కి అప్పు ఇవ్వడానికి నిరాకరిస్తున్న తరుణంలో దావూద్ పాకిస్థాన్ లోనే ఉన్నాడు అని బయట పడితే ఇక అప్పుపుట్టడం కష్టం!

అందుకే PNS షిఫ హాస్పిటల్ నుండి దావూద్ మృత దేహాన్ని 5 కార్ల కాన్వాయ్ తో కరాచీ లోని స్మశానానికి తరలించి ఖననం చేశారు!
మరి దావూద్ బ్రతికున్నడా? మరణిoచాడ?
ఇలాంటివాటికి పాకిస్థాన్ స్పందించలేదు!
ఎలాంటి ధృవీకరణ చేయలేదు!
చోటా షకీల్ చెప్తున్నాడు దావూద్ మరణించలేదు అనే వార్త లో నిజం లేదు.
అసలు దావూద్ కి సంబంధించి 1990 ల నాటి ఫోటో తప్పితే గత 35ఏళ్లుగా ఎలాంటి కొత్త ఫోటో ఎవరిదగ్గర లేదు అంటే అర్ధం చేసుకోవచ్చు ISI ఎంత జాగ్రత్తగా ఉందో!

దావూద్ ని ISI చంపేస్తే తరువాత ఏమిటి?
54 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి దావూద్ దగ్గర!
వాటిని నిర్వహించేది ISI మాత్రమే!
వాటిని ISI స్వాధీనం చేసుకుని ఇంకొకరిని దావూద్ స్థానంలో నియమించి కొనసాగిస్తుంది!
చోటా షకీల్ లాంటి వాళ్ళు ఇంకా దావూద్ తో టచ్ లో ఉన్నాను అని చెప్పుకొని బ్రతుకుతున్నారు తప్పితే.. ISI కి తెలియకుండా అనుమతి లేకుండా ఎవరూ దావూద్ తో మాట్లాడలేరు!
స్వస్తి

LEAVE A RESPONSE