క్యూలో ఇంత మంది జనాలు ఉన్నారు ఎందుకో?
ఎవరైనా గిఫ్ట్‌లు పంచుతున్నారా?
ఏదైనా ఎన్నికల్లో ఓటు వేయడానికి నిల్చున్నారా?
సినీ హీరోని కలవడానికి వచ్చి ఉంటారేమో?
బాబా ఆశీర్వాదాలు అందిస్తున్నారా?
ఇంత క్రమశిక్షణగా తెల్లారేసరికి తమ అభిమాన హీరో రిలీజ్ సినిమా బెనిఫిట్ షో టికెట్ల కోసమన్నట్లు లైనులో నిల్చొన్న వీరంతా ఎవరు? ఎక్కడ? ఏమిటి విశేషం?
తేదీ 07-03-2023 పీలేరు నియోజకవర్గం
కలికిరి ఇందిరమ్మనగర్ విడిది కేంద్రం.
ఉదయం 7 గంటల సమయానికే క్యూలో జనాలు.
అక్కడ నడుస్తోంది సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం
వీరంతా యువనేత నారా లోకేష్‌తో సెల్ఫీ దిగేందుకు వచ్చారు.
కుర్రాళ్లు, ముసలోళ్లు, మహిళలు, కుటుంబాలతో వచ్చినవాళ్లున్నారు.
ఒక్క ఫోటో కోసం వచ్చి, వేచి చూసి, ఫోటో దిగి సంతోషంతో వెళుతున్నారు.
ఈ ఫోటో దిగడానికి వస్తున్నవారు నాయకులు కాదు, పారిశ్రామికవేత్తలు అస్సలే కాదు. కాంట్రాక్టర్లు కాదు, ధనవంతులు లేరు. ఈ క్యూలో ఉన్నదంతా సామాన్య గ్రామీణులు.
లోకేష్ ఆడే మాటలో నిజాయితీ, ఇచ్చే హామీలో నమ్మకం, చెప్పే విషయంలో కచ్చితత్వమే తమని ఇక్కడి రప్పించి ఫోటో దిగేలా చేసిందంటున్నారు జనాలు.
రోజుకి వెయ్యి మందికి పైనే విడిది కేంద్రం వద్దకి వచ్చి సెల్ఫీలు దిగి వెళుతున్నారు.
సామాన్యుల హృదయాలు గెలిచావు లోకేష్. హీరోగా నిలిచావ్ నాయుడుగారబ్బాయి
– శివ.