ఓట్లు వేసి అధికారం ఇవ్వడమే బీసీలు చేసిన తప్పా?

– బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్

గుంటూరు బిజెపి జిల్లా కార్యాలయంలో జిల్లా ఓబిసి మోర్చా అధ్యక్షులు అనుమోలు ఏడుకొండలు గౌడ్ అధ్యక్షతన జరిగిన పత్రికా విలేఖరుల సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ మాట్లాడుతూ…..ఏపీలో బీసీ సమాజం ఆందోళన ఉంది. ఓట్లు వేసి అధికారం ఇవ్వడమే బీసీలు చేసిన తప్పా అని ప్రశ్నించారు.

కార్పొరేషన్ లు పేరుతో ఉమ్మడిగా ఉన్న బీసీల విడగొట్టారు. నిధులు లేని కార్పొరేషన్ లు ఇచ్చి మోసగించారు. ఏపీలో ఉన్న బీసీ సమాజం మిమ్మల్ని క్షమించదు. మీరు ఇచ్చిన మంత్రి పదవీ రేషన్ కార్డు ఇప్పించడానికి కూడా పనికిరాదు. కుల సమీకరణలు కోసమే బీసీలకు మంత్రి పదవీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపిస్తాం. బీసీలకు అన్యాయం చేసేవారికి తగిన బుద్ధి చెబుతాం. రాష్ట్రంలో ఉన్న రెండు ప్రాంతీయ పార్టీల వలన బీసీల సర్వ నాశనం అవుతున్నారు. ప్రాంతీయ పార్టీల స్వార్ధ రాజకీయాలు వలన బీసీలు నష్టపోతున్నారు. 2024లో కుటుంబ పార్టీలను అంతం చేసి స్వస్తి పలుకుతాం.

ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ,ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు అనుమొలు ఏడుకొండలు గౌడ్,జోనల్ ఇంచార్జ్ శివ కృష్ణ, గుంటూరు జిల్లా ఓబీసీ మోర్చా ఇంచార్జి వాసా పల్లపురాజు,ఓబిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆవుల నాగేంద్ర,ఐటి ప్రముఖ్ మకుటం శివ, పబ్లిసిటీ అండ్ లిటరేచర్ ప్రముఖ్ పాలపాటి రవికుమార్,ప్రోగ్రాం కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు, మహిళామోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగమల్లేశ్వరి, చంద్రశేఖర్, సంచారజాతుల స్టేట్ కన్వీనర్ చౌడప్ప,మోతె శేషగిరి,రాఘవాచారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply