Suryaa.co.in

Political News

కరీంనగర్ లో మళ్లీ సంజయ్ గెలుపు సాధ్యమేనా?

తెలంగాణాలో బీజేపీ గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మెన్స్ చేసింది. ఆ పార్టీ డబుల్ డిజిట్ నంబర్ సాధ్యం కాకపోయినా ఉన్నంతలో ఎనిమిది సీట్లు గెలుచుకుని ఉనికి చాటుకుంది. ఇక అందరి చూపూ పార్లమెంట్ ఎన్నికల మీద ఉంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు అంటే జాతీయ పార్టీల పనితీరు మీద జరుగుతాయి. ఆ విధంగా బీజేపీకి ఏమైనా కలసివస్తుందా అన్నది ఒక చర్చ ఉంది.

ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో బీజేపీ తెలంగాణాలో అనూహ్యంగా నాలుగు పార్లమెంట్ సీట్లను గెలుచుకుంది. దాంతో ఈసారి ఆ నంబర్ ని వీలైతే డబుల్ చేయాలని చూస్తోంది. అంటే గతసారి గెలిచిన నాలుగు సీట్లకు తోడుగా మరో నాలుగు గెలుచుకోవడం అన్న మాట.

ఇక బీజేపీ ఎన్ని సీట్లు గెలవబోతోంది, అందులో కచ్చితంగా గెలిచే సీట్లు ఏవీ అన్న చర్చ కూడా ఉంది. అవేంటి అంటే ఆసక్తికరమే అని అంటున్నారు. ఇక కరీంనగర్ ఎంపీ సీటు బీజేపీ చేతిలో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ వచ్చిన బండి సంజయ్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.

అయితే ఇటీవల ఒక ప్రముఖ సంస్థ చేసిన సర్వే ప్రకారం చూస్తే కరీంనగర్ ఎంపీ సీటు నుంచి బండి సంజయ్ ఈసారి లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తారు అని వచ్చిందట. లక్ష ఓట్ల మెజారిటీ అంటే మామూలు విషయం కాదు. అది కూడా బీజేపీ అభ్యర్థికి ఆ రేంజిలో మెజారిటీ అంటే కరీంనగర్ సీటు మీద బీజేపీకి పట్టు బిగిసినట్లే అని అంటున్నారు. ఇలా ఒక్కసారిగా బండి సంజయ్ జాతకం మారిపోవడానికి కారణం ఏంటి అన్నది చూస్తే ఇటీవల కాలంలో రకరకాలైన ఫ్యాక్టర్లు పనిచేశాయి అని అంటున్నారు. అందులో ముఖ్యమైనది అయోధ్య రామమందిరం ఎఫెక్ట్ అని అంటున్నారు.

రామ మందిరం అన్నది బలమైన హిందూత్వ సెంటిమెంట్ గా మారిపోయింది అని అంటున్నారు. బీజేపీకి అది పాజిటివ్ గా వేవ్ క్రియేట్ అయ్యేలా చేస్తోంది అని అంటున్నారు. కరీంనగర్ లో ఎటూ బీజేపీ గెలిచి ఉంది సిట్టింగ్ సీటు కాబట్టి ఆ ప్రభావం కచ్చితంగా బండి సంజయ్ గెలుపు మీద పడింది అని అంటున్నారు. మరో ఫ్యాక్టర్ ఏమిటి అంటే ఇక్కడ బీఆర్ఎస్ వీక్ అయింది అని కూడా అంటున్నారు.

అదే సమయంలో కరీంనగర్ లో కాంగ్రెస్ కి బలమైన క్యాండిడేట్ ఎవరూ లేకపోవడం కూడా బండి సంజయ్ గెలుపునకు కలసి వచ్చే అంశంగా చూస్తున్నారుట. ఇలా రకరకాలైన సమీకరణాలు ప్లస్ అవుతున్న వేళ బండి సంజయ్ కి కరీంనగర్ లక్ష ఓట్లతో మరోసారి దక్కబోతోంది అని అంటున్నారు.

ఇక్కడ రెండవ సారి కమల వికాసం జరిగి మొత్తం తెలంగాణాలో బీజేపీకి గ్యారంటీగా దక్కే సీటు ఇదే అన్నది స్పష్టం చేస్తోంది అని అంటున్నారు. మరో వాస్తవం కూడా వ్యక్తిగతంగా బండి సంజయ్ విషయంలో పనిచేస్తోంది అని అంటున్నారు. ఆయన తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్నపుడు బాగా పనిచేసారు అన్న భావన అయితే ప్రజలలో ఉంది అంటున్నారు.

బండి సంజయ్ బీజేపీ బండిని దూకుడుగా నడిపిన తీరుతో కమలం రెపరెపలు సర్వత్రా నాడు కనిపించాయి. అంతే కాదు బండి సంజయ్ అంటే యూత్ లో ఒక రకమైన అట్రాక్షన్ కూడా ఉంది అని అంటున్నారు. అది ఆయనకు కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లో బాగా అనుకూలం అయ్యే చాన్స్ ఉంది అని అంటున్నారు.

ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడాక బీఆర్ ఎస్ డీలా పడిపోయింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నా ఇంకా బీఆర్ఎస్ లో ఆ జోరు జోష్ అయితే పెద్దగా కనిపించడం లేదు. తమకు అనూహ్యమైన ఓటమి ఎదురైంది అని గులాబీ పార్టీ ఇంకా అంతర్మధనంలోనే ఉంది.

దాంతో ఆ ఎన్నికల తర్వాత కచ్చితంగా నాలుగైదు నెలలు తేడా లేకుండా వస్తున్న ఈ ఎన్నికలు అధికార కాంగ్రెస్ తో పాటు విపక్షంలో ఉన్న బీజేపీకి కూడా బాగా కలిసి వస్తున్నాయని అంటున్నారు. పైగా బీజేపీ హిందూత్వ నినాదం కూడా పనిచేసే చాన్స్ ఉంది. మోడీ ఇమేజ్ ఎటూ వర్కౌట్ అవుతుంది. అన్నీ కలసి కరీంనగర్ బండిదే అని చాటి చెప్పబోతున్నాయని అంటున్నారు.

– రవి

LEAVE A RESPONSE