ఆంధ్రలో ఏప్రిల్ 15న ఎన్నికలు?

రాష్ట్రంలో ఏప్రిల్ 15 న ఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం అక్షర క్రమం లో మొదట ఉన్న ఆంధ్ర లో మొదటి విడతగా సార్వత్రిక ఎన్నికలు జరగ నున్నట్టుగా అందిన సమాచారం.ఈ నెల 16 న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఒకే విడతగా 175 స్థానాల్లో ఎన్నిక జరగనుంది. ఎన్నికల సిబ్బందికి ఈ నెల 25-29 లోపు న మొదటి విడతగా ట్రైనింగు ఇవ్వనున్నారు.

మరో విడతగా జిల్లాలోని దిగువ తరగతి ఉద్యోగ వర్గాలకు Apr-3 నుండి 5 లోపు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ సారి ఎలక్షన్ డ్యూటీల కోసం కలెక్టరేట్ వర్గాలు కొత్త సాఫ్ట్ వేర్ ను ఉపయోగించనున్నారు. ఉమ్మడి జిల్లా రూపేణ మాత్రమే ఎన్నికలు జరుగనున్నాయి. సిబ్బంది ఎపిక్ ఇన్ఫర్మేషన్ ను అత్యంత త్వరగా అందుబాటు లో ఉంచుకోవాలని కలెక్టరేట్ వర్గాలు తెలుపుతున్నాయి. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి వాటికి భారీ భద్రత ఏర్పాట్లు చేయనున్నారు.

ఈ సారి వికలాంగులు మరియు 80 సం|| లు పై బడిన వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కలిపిచనున్నారు. చాలా జిల్లాల్లో ఉద్యోగ, ఉపాధ్యయ సమాచారం ఓటర్ లిస్ట్ లకు భిన్నంగా ఉండటం కొంత సమస్యగా మారింది అని సెంట్రల్ ఎలక్షన్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా తెలిసిన సమాచారం.

– రవి

Leave a Reply