Suryaa.co.in

Andhra Pradesh

ఎమ్మెల్సీ ఆదేశాలు లేకుండా ఇక్జాల్ పీఏ రామకృష్ణారెడ్డిని హత్య చేయడం సాధ్యమా?

-రామకృష్ణారెడ్డి హత్యలో సూత్రదారియైన ఎమ్మెల్సీపై కేసు ఎందుకు పెట్టలేదు?
-భాధిత కుటుంబ మహిళలపై మంత్రి పెద్దిరెడ్డి దురుసు ప్రవర్తన నేరస్తులకు కొమ్ముకాయడం కాదా?
– మాజీ మంత్రి పల్లె రఘునాధ్ రెడ్డి

హిందూపురం నియోజకవర్గంలో విధ్యాధికుడైన వైకాపా నేత చెవులూరు రామకృష్ణారెడ్డిని వైకాపా పార్టీకే చెందిన ఎమ్మెల్సీ ఇక్బాల్ పీఏ ఆధ్వర్యంలో అమానుషంగా హత్య చేయడం జరిగింది. ఎమ్మెల్సీ ఆదేశాలు లేకుండా ఇక్జాల్ గారి పీఏ హత్య చేయడం సాధ్యమా? మరి ఇక్బాల్ పైన ఎందుకు కేసు పెట్టలేదు? భాధిత కుటుంబీకులైన మహిళలపై మంత్రి రామచంద్రారెడ్డి దురుసుగా ప్రవర్తించడం నేరస్తులకు కొమ్ముకాయడం కాదా?

రామకృష్ణారెడ్డి హత్యలో సూత్రధారులపై కేసు నమోదు చేయకుండా, వారిని అరెస్టు చేయకుండా చేసే పరామర్శలు ముసలి కన్నీరు కాదా? ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ ని హత్యచేసి డోర్ డెలివరీ చేశారు. మరో ఎమ్మెల్సీ ఇక్బాల్ ముఠా తమ పార్టీ నేతను హత్య చేసింది. అలాగే విజయవాడలో తమ పార్టీ వారినే వైకాపా నేతలు హత్య చేశారు.

వివేకానంద రెడ్డి హత్యకేసులో నింధితులైన శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డిలకు సుప్రీంకోర్టులో కపిల్ సిబాల్ లాంటి కోట్లు తీసుకునే న్యాయవాదులను పెట్టుకునే స్థోమత ఉన్నదా? మరి ఆ డబ్బు ఎవరిచ్చారనేది బహిరంగ రహస్యమే. అలాగే డ్రైవర్ దస్తగిరి తనకు రక్షణలేదని ఎస్పీకి నివేదించే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో నేరస్తులు ఎలా పేట్రోగిపోతున్నారో, శాంతభద్రతలు ఎలా మంటగలిసిపోతున్నాయో అనేదానికి ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలి?

LEAVE A RESPONSE