• IB విద్యావిధానం, EDX లాంటి సంస్థల్ని రాష్ట్రవిద్యారంగంలోకి చొప్పించాలనే నిర్ణయాలు జగన్ రెడ్డి ఎవరిని సంప్రదించి తీసుకున్నారు?
• రాష్ట్రంలోని పాఠశాలల స్థితిగతులు.. విద్యార్థుల మేథాసంపత్తి గురించి ముఖ్యమంత్రి ఆలోచించారా?
• విద్యార్థులు..ఉపాధ్యాయులు..తల్లిదండ్రులతో చర్చించారా?
• గతంలో ఎంతో గొప్పగా చెప్పిన ఇంగ్లీష్ మీడియం.. ఫ్రీ బైజూస్ కంటెంట్, సీ.బీ.ఎస్.ఈ ప్రయోగాల మాదిరే IB విద్యావిధానం నిరుపయోగంగా మారదని ముఖ్యమంత్రి చెప్పగలరా?
• IB విద్యావిధానం లాభాపేక్ష లేనిదని, విద్యార్థులకు ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు?
• ఇంతకుముందు IB విధానం అమలుచేసిన పాఠశాలలన్నీ లక్షలకు లక్షలు సొమ్ము చెల్లించింది నిజం కాదా?
• కరిక్యులమ్.. పరీక్షలు.సబ్జెక్టులు అంటూ వివిధపేర్లతో ఒక్కో పాఠశాలపై రూ.50 నుంచి రూ.70లక్షల భారం పడింది నిజం కాదా?
• IB సంస్థతో చేసుకున్న ఒప్పందం వివరాల్ని ప్రభుత్వం ఎందుకు దాస్తోంది?
• ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో 5వేల స్కూళ్లలో మాత్రమే IB విద్యావిధానముంది
• భారతదేశంలో కేవలం 216 పాఠశాలల్లో మాత్రమే అమల్లో ఉంది. అలాంటి విద్యావిధానాన్ని రాష్ట్రంలోని 50వేల పాఠశాలల్లో దశలవారీగా అమలుచేయాలని ముఖ్యమంత్రి ఏకపక్షంగా నిర్ణయించడం రాష్ట్ర విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేయడమే
• ఫలితాలు ఇవ్వని ప్రయోగాలు ఎన్ని చేసినా ఉపయోగం ఉండదనే వాస్తవాన్ని జగన్ రెడ్డి గ్రహించాలి
– టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్
విద్యారంగం పరిపుష్టి గురించి, విద్యార్థుల భవిష్యత్ గురించి పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్టు విద్యారంగంలో జగన్ రెడ్డి చేసిన ప్రయోగాలతో వస్తున్న ఫలితా విద్యా ప్రమాణాలను పూర్తిగా దిగజారుస్తున్నాయని ఆ క్రమంలో వైసీపీప్రభుత్వం కొత్తగా ఏపీలో ప్రవేశపెట్టిన IB (International Baccalaureate) విద్యా విధాన మైతే, రెండోది ఆన్ లైన్ విధానంలో విద్యాబోధన కోసం ఎడెక్స్ అనే సంస్థకు రూ.50కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వడమని ఇలాంటి నూతన విధానాలు ప్రవేశపెట్టే ముం దు విద్యావేత్తలు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రతిపక్షాల అభిప్రాయలు తీసుకోవ డం సహజమని, కానీ జగన్ రెడ్డి అలాంటివేవీ చేయకుండా ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నాడని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయ పాలెం విజయ్ కుమార్ ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
“జగన్ రెడ్డి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, మరో ఇద్దరు విద్యాశాఖ అధికారులే కొత్త విద్యావిధానాలపై నిర్ణయం తీసేసుకు న్నారు. రాష్ట్రవ్యాప్తంగా గతంలో ఇంగ్లీష్ మీడియం బోధన ప్రవేశపెట్టామని, సీబీఎస్ఈ సిలబస్ తీసుకొచ్చామని, బైజూస్ విద్యావిధానమని, ట్యాబ్ ల పంపిణీ (సుమారు 10లక్షల ట్యాబ్ లు) అని ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకున్నారు.
వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి… విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుం దా…బోధనాంశాలు వారికి అర్థమవుతున్నాయా అనే అంశాలేవీ ఈ ముఖ్యమంత్రికి పట్టడంలేదు. విద్యార్థులు… ఉపాధ్యాయులు ఏమైపోతే నాకేంటి, నేను అనుకున్నదే జరగాలనే ధోరణితో ఉన్న ముఖ్యమంత్రి కొత్తగా ప్రవేశపెట్టాలను కుంటున్న IB విద్యావిధానం తీరుతెన్నులు ఎలా ఉంటాయని ఆలోచించారా? ఏమైనా పరిశీలించి.. పరిశోధించారా? అంటే …అవేం జరగలేదు.
IB విద్యావిధానం అమలుచేయాలంటే ప్రాథమిక పాఠశాలకే సంవత్సరానికి రూ.50 నుంచి రూ.70 లక్షలవరకు ఖర్చవుతోంది. ఇంత వ్యయంతో కూడిన విద్యావిధానాన్ని రాష్ట్రంలోని పేద, సామాన్య కుటుంబాల విద్యార్థులు భరించగలరా?
IB విద్యావిధానం ఎలా ఉండనుందా అని తాము ఆ వెబ్ సైట్ ను పరిశీలిస్తే, ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం కనిపించింది. ఒప్పందం ప్రకారం IB అనే సంస్థ మన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తొలుత 1 వ తరగతి..మరుసటి సంవత్సరం రెండో తరగతి..ఆ తర్వాత మూడో తరగతి…ఇలా 2037 నాటికి 12వ తరగతి వరకు IB కరిక్యులమ్ పరీక్షలు, assessment ఇలా అన్నీ స్కూళ్ళను IBaffiliated లేదా IBauthorised గా మార్చేస్తాయి. ఈ వ్యవహారం అంతా పరిశీలించాక ఒక చిన్న సందేహం కలుగుతోంది. అసలు ఈ I Bauthorised అంటే ఏమిటి?Affiliated అంటే ఏమిటి? డబ్బులేమైనా కట్టాలా? ఎవరైనా ఊరికే ఎందుకిస్తారు? అనే ప్రశ్నలు వేసుకుంటూ కచ్చితంగా ఏదో మతలబు ఉంటే ఉంటుందని IB వెబ్ సైట్ ను క్షుణ్ణంగా పరిశీలించాము.
ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో సుమారు 5వేల స్కూళ్లలో ఈ IB విద్యావిధానముంది. భారతదేశంలో కేవలం 216 పాఠశాలల్లో మాత్రమే అమల్లో ఉంది. అలానే ఉమ్మడి రాష్ట్రంలో చూస్తే కేవలం 12 స్కూళ్లలో మాత్రమే అమలవుతోంది. అలాంటి విద్యావిధానం ఎంతవరకు విద్యార్థులకు పని కొస్తుంది.. వారు ఎంతవరకు దాన్ని అర్థం చేసుకోగలరని ఆలోచించకుండా రాష్ట్రంలో 4,500 ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
IB విద్యావిధానం అమల్లోకి తీసుకొస్తే రాష్ట్రంలో అనేక కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఉదాహరణకు ఎవరైనా ఒక పాఠశాల ఏర్పాటుచేస్తే, దానిలో IB విద్యావిధానం అమలుచేయాలంటే, తొలుత రూ.3,75,000ల ఫీజు కట్టాలి. ఆ సొమ్ముని కూడా స్విట్జర్లాండ్ కరెన్సీ ఫ్రాంక్స్ రూపంలో కట్టాలి. మన రాష్ట్రం లో రూ.3,75,000లు ఫ్రాంక్స్ లోకి మారిస్తే 3,927 (దాదాపు 4,000) ఫ్రాంక్స్ చెల్లించాలి. ఇదంతా కేవలం అప్లికేషన్ ఫీజు మాత్రమే. ఆ సొమ్ము కట్టాక IB వారు మీ పాఠశాలను పరిశీ లించి వారొక నిర్ణయానికి వస్తారు.
తర్వాత మనం ఏర్పాటు చేసుకున్న పాఠశాలకు వారి అభ్యర్థిత్వ్వం పొందడానికి మరో 9,291 ఫ్రాంక్ష్ (అంటే రూ.7,71,000లు) కట్టాలి. మీ పాఠశా లకు పూర్తిస్థాయి గుర్తింపు వచ్చే వరకు సంవత్సరానికి రూ.7,71,000లచొప్పున వసూలు చేస్తూనే ఉంటారు. ఆ సొమ్ము చెల్లించాక సంవత్సరానికి 20 గంటల చొప్పున IB వారు మీ పాఠశాలకు కన్సల్టేషన్ సపోర్ట్ ఇస్తారు. సంవత్సరంలో రెండుసార్లు మీ పాఠశాలను ఒక బృం దం వచ్చి పరిశీలిస్తుంది. IB వెబ్ సైట్లోని పాఠ్యాంశాలను మీ పాఠశాల తరుపున వినియోగిం చుకోవచ్చు.
రెండేళ్ల తర్వాత మరలా మీ పాఠశాల నుంచి మీరు గుర్తింపు ఇవ్వండని అడిగి తే అప్పుడు IBవారు మీ పాఠశాలకు ఆథరైజేషన్ ఇస్తారు. ఆ ఆథరైజేషన్ కు మరలా అదనంగా రూ.3,25,000వరకు చెల్లించాలి. ఆ తర్వాత మీ పాఠశాల IB పరిధిలోకి వస్తుంది. అలా వచ్చాక ప్రతి సంవత్సరం రూ.7,50,000లు కడితేనే IB ఆథరైజేషన్ మీకు ఏటా లభి స్తుంది. ఈ ప్రకారం చూస్తే ఒక పాఠశాల తక్కువలో తక్కువగా రూ.30లక్షలు చెల్లించాలి.
ఒక సాధారణ ప్రాథమిక పాఠశాల ఈస్థాయిలో సొమ్ము కట్టడం సాధ్యమయ్యే పనేనా? అదలా ఉంటే మరలా విద్యార్థులకు నిర్వహించే పరీక్షలకోసం అదనంగా సబ్జెక్ట్ ల వారీగా చెల్లించాలి. అవి కూడా కలిపితే ఒక్కో ప్రాథమిక పాఠశాలకు సంవత్సరానికి రూ. 50 నుంచి రూ.70 లక్ష ల వరకు భారం పడుతుంది. ఇంత వ్యయంతో కూడిన విద్యావిధానం వల్ల ఎలాంటి ఫలితా లు వస్తాయో, విద్యార్థులకు జరిగే మేలేమిటో ముఖ్యమంత్రి చెప్పాలి.
రాష్ట్రంలోని 58 వేల పాఠశాలల్లో దశలవారీగా IB విద్యావిధానం అమలుచేస్తే రూ.24వేల కోట్ల ఖర్చవుతుంది. ఈ సొమ్మంతా ఎవరు కట్టాలి.. ప్రభుత్వం కడుతుందా.. IB విధానం అమలు చేసే నిర్వాహాకులు కడతారా?
మన రాష్ట్రంలో ఇప్పుడు సుమారు 58వేలపాఠశాలలున్నాయి. ఒక్కోపాఠశాలకు రూ.7,75, 000 చొప్పున కడితే రూ.4,400కోట్లు అవుతుంది. ఆ సొమ్మంతా కేవలం పాఠశాలలు IB విద్యావిధానానికి పనికొస్తాయో లేదో చూడటానికి మాత్రమే. అదికాకుండా పైని చెప్పినట్టుగా పరీక్షలకు సంబంధించిన ఫీజులు, సబ్జెక్ట్ ల ఫీజులు కూడా చెల్లిస్తే మొత్తంగా రూ.24 వేలకోట్లు అవుతుంది. IB విద్యావిధానం తీసుకొస్తానని ప్రజల మధ్య కబుర్లు చెబుతున్న జగన్ రెడ్డి… ఈ సొమ్ము అంతా ఎవరు కట్టాలో.. కట్టడం వల్ల రాష్ట్ర విద్యార్థులకు.. ప్రభుత్వ పాఠశాలలకు ఒరిగే మేలేమిటో ఆయనే చెప్పాలి.
IB విద్యావిధానం ఉన్న స్కూళ్లలో ఎల్.కే.జీకే రూ.3 లక్షల వరకు ఖర్చవుతోంది. ఈ స్థాయిలో లక్షలు కట్టి సామాన్యులు…పేదలు తమ బిడ్డలకు విద్యాబోధన అందించగలరా? అసలు రాష్ట్రంలోని పాఠశాలలన్నింటిలో IB విద్యావిధానం ప్రవేశపెడితే, అన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించగలిగే సామర్థ్యం IB విద్యావిధానం నిర్వాహకులకు ఉందా? దీనిపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారు?
IB విద్యావిధానం అమల్లోని గుట్టుమట్లపై ముఖ్యమంత్రి నోరు విప్పాల్సిందే
గతంలో బైజూస్ కంటెంట్ అని విద్యార్థుల్ని మోసగించినట్టే..ఇప్పుడు ఈ IB విద్యావిధానం ద్వారా వారి జీవితాల్ని ఏంచేయాలనుకుంటున్నారో ముఖ్యమంత్రి చెప్పాలి. ఎవరు ఎన్ని మాట్లాడినా జగన్ రెడ్డి నోరు విప్పడు. మరి విద్యాశాఖ అధికారులు అయినా చెప్పాలిగా! ముఖ్యమంత్రి ఎవరిని సంప్రదించి, ఎవరు ఒప్పుకున్నారని IB విద్యావిధానం అమలుకు సిద్ధమయ్యారు.
తన అనాలోచిత, ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్ర విద్యావ్యవస్థను త్రిశంకు స్వర్గం లోకి నెట్టిన జగన్ రెడ్డి ప్రాథమిక విద్యాబోధన స్థాయిలోనే ఇలా విద్యార్థుల జీవితాలతో ఆట లాడవద్దని కోరుతున్నాం. ప్రపంచవ్యాప్తంగానే IB విద్యావిధానం కేవలం 5వేల స్కూళ్లలో అమల్లో ఉంటే, ఏకంగా రాష్ట్రంలో 5వేల పాఠశాలల్లో ప్రాథమిక విద్యస్థాయి నుంచే ఎలా ప్రవేశ పెడతారు? రాష్ట్రం రూపాయి ఇవ్వకుండా మొత్తం తామే ఖర్చుపెడతామని IB వారు ఏపీ ప్రభుత్వానికి చెప్పారా?
అధికారాంతంలో జగన్ రెడ్డి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదు
అధికారం చివరికి వచ్చాక జగన్ రెడ్డి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంతమాత్రం సరైన పద్ధతి కాదు. సరళంగా ఉన్న రాష్ట్ర విద్యావ్యవస్థను.. గరళంగా మార్చవద్దని జగన్ రెడ్డిని కోరుతున్నాం. అసలు ఈ IB విద్యావిధానం నిజంగా మంచి స్కీమా..లేక జగన్ రెడ్డికి మాత్ర మే పనికొచ్చే స్కామా? వీసమెత్తు ప్రయోజనంలేని పనికిరాని విధానాలతో విద్యారంగాన్ని జగన్ రెడ్డి విధ్వంసం చేశారనే చెప్పాలి.
కొద్దిరోజుల్లో ఎన్నికల కోడ్ రాబోతుంటే, ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని, ఉపాధ్యా యుల్ని గందరగోళంలోకి నెట్టడం కాదా? సీ.బీ.ఎస్.ఈ, ఎన్.సీ.ఈ.ఆర్.టీ, IB విద్యావిధానంలో ఏది మంచిదంటే ఎవరూ చెప్పలేరు. ప్రతిదానిలో కచ్చితంగా ఏవో లోటుపాట్లు ఉంటాయి.
ఇక చివరిగా EDx (ఎడెక్స్) విషయానికి వస్తే..!
EDX లాంటి సంస్థలు మార్కెట్లో చాలా ఉన్నాయి. అదొక ఫర్ ప్రాఫిట్ సంస్థ. ఈ సంస్థను తొలుత అమెరికా ప్రొఫెసర్లు పెట్టినా దరిమిలా దాన్ని అమెరికన్ బిజినెస్ సంస్థలు కొనేశాయి. EDX లో ఉచితంగా 2000 ఆన్ లైన్ కోర్సులు ఉంటాయి. దానికి ఏ certificate రాదూ. ఇస్తే మన రాష్ట్రం , మన ప్రభుత్వమే ఇచ్చుకోవాలి . డబ్బులు కట్టి చదివితే, ఆ కోర్సు పెట్టిన సంస్థ certificate ఇస్తుంది.
దానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఫ్రీ కోర్స్ లు నేర్చుకోవడానికి ఎవ్వరైనా EDX website లో లాగిన్ కావచ్చు. కోట్లకు కోట్లు ఇచ్చి కోర్సులు కొనుక్కొనే బదులు కేంద్రం ప్రభుత్వం స్వయం అనే పోర్టల్ ద్వారా అనేక కోర్సులు అందిస్తోంది. COURSERA, UDAACITY, DATACAMP…లాంటి కోర్సులు చాలా ఉన్నాయి. హడావుడిగా కనీసం టెండర్లు కూడా పిలవకుండా….ముందుగా 50 కోట్లు EDX మసుగులో చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధమవ్వడంపై జగన్ రెడ్డి నోరువిప్పాలి.
IB పేరుతో రాష్ట్ర విద్యారంగాన్ని జగన్ రెడ్డి IP పెట్టేస్తున్నాడు
IB అయినా.. EDXఅయినా ఏవీ ఊరికే రావు. ఏ సంస్థా ఊరికే వాటి పరిజ్ఞానాన్ని అందించవు. ఇలాంటి వాటి పేర్లుచెబుతూ, రాష్ట్ర విద్యారంగాన్ని IP (దివాళా) తీయించడానికి సిద్ధమయ్యాడు. IB విద్యావిధానం మంచిదైతే, ఎవరినీ సంప్రదించకుండా దాన్ని బలవతంగా ఏపీలోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి ఎందుకు ప్రయత్నిస్తున్నారు ”అని విజయ్ కుమార్ నిలదీశారు.