Suryaa.co.in

Food & Health

మినరల్ వాటర్ డేంజరేనా?

– మామూలు నీళ్లు మంచివేనా?
– రాగి, ఇత్తడి మట్టి పాత్రలతో లాభమేమిటి?

మినరల్ వాటర్ తాగితే ప్రమాదమా? దాని వల్ల ఉపయోగం లేకపోగా, ఆరోగ్యానికి ప్రమాదమా? అందులో కెమికల్స్ కలిపేస్తున్నారా? మినరల్ వాటర్ కంటే మామూలు మంచినీళ్లు మంచివేకదా? అవేమైనా కలుషితమైనవా? ఇదీ ఇప్పుడు సర్వత్రా జరుగుతున్న చర్చ. ఆ కథేమిటో చూద్దాం.
మనం నీరు త్రాగేముందు ఈ మధ్య కాలంలో ఏవేవో యంత్రాల ద్వారా శుద్ధి చేసిన…మినరల్ వాటర్ ని కొని అవే మంచివి అని లీటర్ 4 రూపాయల నుండి 5 రూపాయలు పెట్టి కొంటున్నాం.
కిన్లే లాంటి పెద్ద వ్యాపార సంస్థలు లీటర్ డబ్బా 20/- అమ్ము తున్నారు.
కానీ వాటిలో స్వచ్చత ఉందా… అనే సందేహం… చాలా మందిలో ఉంది.
కానీ ఈ మధ్య చేసిన సర్వేలలో తేలిన విషయం. ఏమంటే…
నీళ్ళలో ఒక కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్ లా అమ్ము తున్నారు. దీని వలన ప్రమాదమే. కానీ ఉపయోగం లేదు. రోగాలని కొనుక్కొని తెచ్చుకుంటున్నారు.
ఇదంతా ఎందుకు చేస్తున్నారు?
అంటే ఆరోగ్యం కోసం అంటారు అందరూ. రోగాల బారిన పడ కూడదు. అను కుంటూనే రోగాలని కొను.. క్కుంటున్నారు.
ఇంకో విషయం ఏంటంటే .. బయట మార్కెట్ లో కొనే మినరల్ వాటర్ వలన, మన శరీరంలో ఎముకల చుట్టూ ఉండే కాల్షియం కరిగి పోయి ఎముకలు డొల్ల అవు తున్నాయి. దీని వలన ఎముక పటుత్వం కోల్పోయి , చిన్న చిన్న సంఘటనలకే విరిగి పోతున్నాయి.
ఇంతకీ విషయం ఏంటంటే..
భారత దేశంలో ఉన్న మన పూర్వీకులు, కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే…మన ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్పారు.
అందులో ఇది ఒకటి.
నీటిని శుభ్రపరిచేందుకు రాగి, ఇత్తడి బిందెలు, చెంబులు వాడేవారు. వీటిని వాడటం వలన నీటి లో ఉండే సూక్ష్మ క్రిములు చని పోతాయి.
ఈ మధ్య జరిగిన ఒక ప్రయోగంలో ”రోబ్ రీడ్” అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ పాత్రలు,
మట్టి పాత్రలు, ఇత్తడి, రాగి పాత్రలలో విరోచన కారి అయిన ఒక సూక్ష్మ క్రిమిని వేశారు. దీనిని 24 గంటల తరువాత పరిశీలించగా ఇత్తడి రాగి పాత్రలలో వేసిన క్రిములు శాతం తగ్గింది.
మరల 48 గంటల తరువాత పరిశీలించగా.. రాగి మరియు ఇత్తడి పాత్రలలో క్రిములు 99 శాతం నశించి పోయాయి.
కానీ ప్లాస్టిక్పా త్రలలో వేసిన క్రిమి 24 గంటలకి రెట్టింపు అయింది. 48 గంటలకి దానికి రెట్టింపు అయింది అని కనుగొన్నారు.
ఈ మధ్య కాలం లో అనేక బహుళ అంతస్తుల హోటల్స్ లో రాగి పాత్రలని వాడటం గమనార్హం. ఎందు కంటే వారి కష్టమర్స్ ఆరోగ్యం వారికి ముఖ్యం కదా.

కాబట్టి
వాన కాలం 4 నెలలు – రాగి పాత్రలో నీళ్లు
చలి కాలం 4 నెలలు – ఇత్తడి పాత్రలో నీళ్లు
ఎండ కాలం 4 నెలలు – మట్టి పాత్రలో (కుండ) నీరు త్రాగడం శ్రేయస్కరం.

కనుక రాగి, ఇత్తడి మట్టి పాత్రలను వాడండి.
అల్యూమినియం, ప్లాస్టిక్ వదలండి.
ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
యూజ్ ఫుల్ ఇన్ఫర్ మేషన్ కాబట్టి… దీనిని మిగతా వారికీ తెలియ
చేయండి.

LEAVE A RESPONSE