Suryaa.co.in

Andhra Pradesh

నిజాలు చెప్పడమే నేరమా?

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

జగన్ రెడ్డి జమానాలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం కూడా మహాపరాధమే. విద్యా దీవెన, వసతి దీవెన ఫెయిల్యూర్ కార్యక్రమాలనేది జగమెరిగిన సత్యం! జగన్ ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురైన మాట వాస్తవం. కాకినాడ జిల్లా సూరంపాలెం వద్ద జగన్ బస్సు ఆపి విద్యా దీవెన, వసతి దీవెన అందుతున్నాయా అని విద్యార్థులను అడగగా, అందడం లేదంటూ విద్యార్థులు నిరసన తెలపడమే నేరమైంది. వైసీపీ నేతలు కాలేజ్ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి వాస్తవాన్ని బయట పెట్టిన విద్యార్థులను సస్పెండ్ చేయించడం దారుణం. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించడం తగునా జగన్? చిత్తశుద్ధి ఉంటే విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించి, కాలేజీ యాజమాన్యాల వద్ద ఉండిపోయిన 8లక్షల సర్టిఫికెట్లు విద్యార్థులకు అందజేయాలి. తక్షణమే విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలి.

LEAVE A RESPONSE