• శ్రీవారి ఆలయ నిర్మాణప్రదేశం పర్యావరణ హితంకాదని తెలిసీ టీటీడీ అక్కడే ఎందుకు శంఖుస్థాపన చేసింది?
• కేంద్రప్రభుత్వం స్పందించి, స్థానిక మీడియాలో కథనాలు వచ్చేవరకు, ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్థలం పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ఉందని టీటీడీ గ్రహించలేదా.. తెలిసీ తెలియనట్టు నటించిందా?
• తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల్ని వన్యమృగాల బారినుంచి రక్షించలేని టీటీడీ, ఎక్కడో వేరే రాష్ట్రంలో ఆలయాలు నిర్మించి స్వామి వారి కీర్తిప్రతిష్టలు పెంచుతుందా?
– టీడీపీ అధికారప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నవీ ముంబైలోని ఉల్ వే ప్రాంతంలో రూ.70 కోట్ల వ్యయంతో, పెద్ద వేంకటేశ్వ రస్వామి ఆలయ నిర్మాణానికి 2023 జూన్ 7న శంఖుస్థాపన చేసిందని, సదరు ఆలయ నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలం పర్యావరణ హితం కాదని తెలిసీ దాన్ని ఎంపిక చేయడంపై టీటీడీ ఏం సమాధానం చెబుతుందని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“ రుషికొండలో నిర్మాణాలు చేపడుతూ ఏపీ ప్రభుత్వం నడిచిన దారిలోనే టీటీడీ నడవ డం పలు అనుమానాలకు తావిస్తోంది. నవీ ముంబైలో శ్రీవారి ఆలయం నిర్మించాలను కున్న ప్రదేశం పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ఉందని టీటీడీకి రెండేళ్లక్రితమే తెలుసు. ఎల్ అండ్ టీ సంస్థ చేపట్టాలనుకున్న ఎంటీహెచ్ఎల్ (ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్) కు మడ అడవుల్లోని 16 ఎకరాలను కాస్టింగ్ యార్డ్ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం కేటాయించింది.
అదే 16 ఎకరాల్లో 10 ఎకరాలను మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీకి కేటాయించింది. ఆలయ నిర్మాణానికి అవసరమైన భూమిని ఉచితంగా ఇస్తామని, తిరుమల ఆలయాన్ని పోలి ఉండేలా తమరాష్ట్రంలో నిర్మించే ఆలయం ఉండాలని, అప్పట్లోనే మహారాష్ట్ర సర్కార్ టీటీడీకి షరతు పెట్టింది. మడ అడవుల్లో నిర్మాణాలకోసం ఎల్ అండ్ టీ సంస్థకు కేటాయించిన స్థలాన్నే ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే దానిపై టీటీడీ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు?
;lపర్యావరణ హితమై న అలాంటి ప్రదేశంలో నిర్మాణాలు చేపట్టడం సీ.ఆర్.జెడ్ (కోస్టల్ రెగ్యులేషన్ జోన్) యాక్ట్ నిబంధనలకు విరుద్ధం. శ్రీవారి ఆలయ నిర్మాణంపై కేంద్రానికి ఫిర్యాదులు అంద డంతో కేంద్రప్రభుత్వం వెంటనే స్పందించింది. మడఅటవీ ప్రాంతమైన ప్రదేశంలో ఆలయ నిర్మాణం చేపట్టడానికి వీల్లేదని మహారాష్ట్రలోని స్థానిక మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఇవన్నీ తమకు తెలియదన్నట్టే టీటీడీ వ్యవహరిస్తోంది.
కేంద్రప్రభుత్వం స్పందించి, స్థానిక మీడియాలో కథనాలు వచ్చేవరకు, ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్థలం పర్యావరణానికి అనుకూలం కాదని టీటీడీకి తెలియదా?
ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందిన తిరుమల తిరుమతి దేవస్థానం విభాగం ముంబైలో నిర్మించాలనుకున్న శ్రీవారి ఆలయ నిర్మాణంపై వచ్చిన ఫిర్యాదులు.. తలె త్తిన అడ్డంకులపై ఎలా స్పందిస్తుంది? కేంద్రప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యంతరాలతో గతంలో ఆలయనిర్మాణానికి మహారాష్ట్రప్రభుత్వం కేటాయించిన 40వేల చదరపు అడు గుల్లో కుదరదని, కేవలం 11595 చదరపు అడుగుల్లో మాత్రమే నిర్మించాలని తాజాగా ఆదేశించింది.
ప్రపంచప్రఖ్యాతి పొందిన ధార్మిక సంస్థ టీటీడీ ఇలా అడ్డగోలుగా పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా మహారాష్ట్రలో స్వామి ఆలయ నిర్మాణానికి ఎందుకు పూనుకుంది. తిరుమలలో ప్లాస్టిక్ వాడకం నిషేధమని చెప్పే టీటీడీ, ముంబై ఆలయ నిర్మాణంలో ఎందుకు పర్యావరణ హితంగా వ్యవహరించలేకపోయింది? టీటీడీ నిర్ణయా న్ని ఏ న్యాయస్థానం సమర్థించదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అయితే నిస్సందేహంగా టీటీడీ నిర్ణయాన్ని తిరస్కరిస్తుంది.
రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని ఇష్టమొచ్చిన ట్టు రుషికొండలో నిర్మాణాలు చేపడుతున్నారు. అలానే తూర్పుగోదావరి జిల్లాలో మడ అటవీ ప్రాంతంలోనే పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చారు. ఏపీలో సాగినట్టే ఇతర రాష్ట్రాల్లో కూడా తమ ఆటలు సాగుతాయని రాష్ట్రప్రభుత్వం, టీటీడీ భావించాయా?
ముంబైలో శ్రీవారి ఆలయం నిర్మించాలనుకున్న ప్రదేశం పర్యావరణ నిబంధనలకు విరుద్ధమని టీటీడీకి తెలియదా? తెలిసీ గుడ్డిగా ఎందుకు ముందుకెళ్లారు? ఇంట్లో ఈగలమోత.. బయట పల్లకీల మోత అన్నట్టుగా స్వయంగా తిరుమల క్షేత్రంలో భక్తులకు రక్షణ లేకుండా పోయింది. దానికి తోడు బయటి రాష్ట్రాల్లో ఇలాంటి పరువు తక్కువ పనులతో మరింతగా స్వామివారి పవిత్రతను మంటగలిపేలా టీటీడీ వ్యవహ రించడాన్ని ఏమనాలి?
తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని అమరావతి ప్రాంతంలో తిరుమల ఆలయాన్ని ముమ్మూర్తులా పోలిఉండేలా శ్రీవారి ఆలయం నిర్మాణంకోసం 150 ఎకరాలు కేటాయించింది. ఆ ప్రాంతంలో ఆలయ నిర్మాణం చేపట్టడానికి ఇష్టపడ ని జగన్ సర్కార్, ఎక్కడో రాష్ట్రంకాని రాష్ట్రంలో ఆలయాల నిర్మాణం చేపట్టి, అప్రదిష్ట పాలు కావడం సిగ్గుచేటు.
ముంబైలో నిర్మించాలనుకున్న శ్రీవారి ఆలయం ఆగమ శాస్త్రం ప్రకారమే టీటీడీ నిర్మిస్తుందా? రూ.70కోట్లతో ఆలయం నిర్మించాక, అప్పుడు పర్యావరణ నిబంధనలు అడ్డువచ్చి నిర్మాణాన్ని నిలిపేస్తే టీటీడీ ఏంచేసేది? మహారా ష్ట్ర ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి ఇచ్చిన భూమి పర్యావరణ హితంకాదని తెలిసీ టీటీడీ గుడ్డిగా ఎందుకు ముందుకెళ్లింది?
తిరుమలకు వచ్చే భక్తుల్ని వన్యమృగాల నుంచి కాపాడలేని టీటీడీ ఎక్కడో ఆలయాలు నిర్మించి స్వామివారి కీర్తిప్రతిష్టలు పెంచుతుందా?
తిరుమల కొండపై వన్యమృగాలు తిరుగుతూ భక్తులపై దాడిచేస్తుంటే వారిని కాపాడటం చేతగాని ఈ ప్రభుత్వం, టీటీడీ విభాగం కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటోంది. కొత్తగా వచ్చిన టీటీడీ ఛైర్మన్ ఈ నాలుగైదు ఏళ్లలోనే తిరుమలగిరుల రూపురేఖలు మారిపోయాయన్నట్టు నిస్సిగ్గుగా కట్టుకథలు చెబుతున్నారు. శేషాచలం అడవులు గతంలో ఎలా ఉన్నాయో.. ఇప్పుడూ అలానే ఉన్నాయి.
అడవుల్లోకి చొరబడి, అక్కడి ప్రకృతి సంపదను కొల్లగొడుతుండటంతో, తమ మనుగడకు ప్రమాదం వాటిల్లుతోంద న్న భయంతో వన్యమృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఆ విషయంపై స్పందిస్తే, ఎక్కడ తమప్రభుత్వం సాగిస్తున్న వనరుల దోపిడీ బయటపడుతుందో అన్న భయం తో టీటీడీ ఛైర్మన్ వన్యప్రాణుల సంచారంపై వక్రభాష్యాలు చెబుతున్నారు.
ముంబైలో నిర్మించే శ్రీవారి ఆలయంపై పెట్టిన శ్రద్ధలో సగంకూడా తిరుమలకు వచ్చే భక్తుల రక్షణ పై పెట్టలేకపోవడం నిజంగా దురదృష్టకరం. దేవదేవుడి ఆవాసమైన తిరుమల క్షేత్రంలో సంచరించే వన్యమృగాలను రక్షించలేని టీటీడీ, ఎక్కడో రాష్ట్రంకాని రాష్ట్రంలో స్వామి వారి ఆలయాలు నిర్మించి శ్రీవారి కీర్తిప్రతిష్టలను ఇనుమడింపచేస్తుందా? చిన్నారి బలైపోయినా టీటీడీలో, ప్రభుత్వంలో చలనంలేదంటే అంతకంటే సిగ్గుచేటు మరోటి ఉంటుందా?” అని విజయ్ కుమార్ ఎద్దేవాచేశారు.