– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
ఓటమి భయంతోనే జగన్ ప్రభుత్వం చంద్రబాబుపై కుట్ర పన్నుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు …చిత్తూరు జిల్లా పుంగనూరు కేసులో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఓటమి భయంతోనే. పులివెందులలో చంద్రబాబు సమావేశానికి కనీ వినీ ఎరుగని రీతిలో వచ్చిన ప్రజా స్పందన చూసి జగన్ కు గంగవెర్రులెత్తాయి.
పుంగనూరు కేసులో చిత్తూరు ఎస్పీ, డీజీపీ అమ్మినేని, ముఖ్యమంత్రి జగన్, సజ్జల కలిసి చంద్రబాబుపై కుట్ర పన్నారు. హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పుంగనూరులో తెలుగుదేశం కార్యకర్తల తలకు, కాళ్లకు, ఒంటిపై విపరీతంగా దెబ్బలు తగిలాయి. ఈ దిశగా దర్యాప్తు చేయరా?ఎస్పీ రిశాంత్ రెడ్డి, డీఐజీ అమ్మిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్ రెడ్డిల కుట్రను ప్రజలు నమ్మొద్దు.
పుంగనూరు టీడీపీ ఇన్ ఛార్జ్ చల్లా బాబు డ్రైవర్ ను కొట్టి భయపెట్టి అతని నుండి స్టేట్ మెంట్ ను వీరే రికార్డు చేసి అతని సంతకం తీసుకున్నారు. ఆ స్టేట్ మెంట్ కల్పితం, కుట్రపూరితం. ప్రభుత్వాలు మారినా, ముఖ్యమంత్రులు మారినా అదే పోలీసు యంత్రాంగం కొనసాగుతుందనే విషయన్ని పోలీసులు గ్రహించాలి. పోలీసులను చంపాలని టీడీపీ ఎందుకు కుట్ర పన్నుతుంది.
రాష్ట్రంలో చట్టాల నియమాలకు లోబడి శాంతిని కాపాడాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగానికి ఉంది. ప్రభుత్వాలు మారినా, ముఖ్యమంత్రులు మారినా అదే పోలీసు యంత్రాంగం కొనసాగుతుందని పోలీసులు గ్రహించాలి. పోలీసులను టార్గెట్ చేసుకుని వారిని శత్రువులుగా చూసే రాజకీయ ఉద్దేశం టీడీపీకి ఎప్పుడూ లేదు.ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తాను తలపెట్టిన కుట్రలు, నేరాల్లో కొంతమంది పోలీసు అధికారులను భాగస్వాముల్ని చేస్తున్నారని మా ఆవేదన.
అంగళ్లు, పుంగనూరు బైపాస్ ల వద్ద జరిగిన ఘటనలపై ఒక స్థానిక రాజకీయ నాయకుడిని, సహాయకుడిని లోబరచుకున్నారు. టీడీపీ సీనియర్ నాయకులు పోలీసులపై దాడి చేయడానికి కుట్ర పన్ని అమలు చేసినట్లుగా బలవంతంగా వాంగ్మూలం తీసుకున్నారు. ఈ కేసులో ఏదో మహా విజయం సాధించినట్లు జగన్ ప్రభుత్వం చంకలు గుద్దుకుంటోంది. ఓటమి భయంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ రెడ్డి పన్నిన కుట్రలో ఈ వాంగ్మూలం ఒక భాగం. చంద్రబాబును అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
చంద్రబాబు పర్యటనల సందర్భంగా సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.అంగళ్లు, పుంగనూరు బైపాస్ ల వద్ద చంద్రబాబుకు రక్షణ ఉండే ఎన్ ఎస్ జి సిబ్బంది తమ బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ ను అడ్డుపెట్టి కాపాడివుండకపోతే చంద్రబాబుపై భీకర దాడి జరిగి ఉండేది. ఈ దృశ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా టీవీల్లో చూశారు.గత ఎన్నికలకు ముందు సొంత బాబాయిని లేపించేసిన జగన్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబును అవసరమైతే అడ్డు తొలగించడానికి ఏమాత్రం వెనుకాడడు.
జన్మతహా జగన్ ది క్రిమినల్ మైండ్.చంద్రబాబు పట్ల జగన్ రెడ్డి వ్యవహారం, ఆలోచనా శైలి, జగన్ గతం ఆందోళనకరంగా ఉంది.ఏదేమైనా ప్రతి తెదేపా కార్యకర్త తమ ప్రాణాలు పణంగా పెట్టైనా జగన్ కుట్రల నుండి చంద్రబాబును కాపాడుకుంటారు. తన కుట్రలు అమలు చేయడానికి పోలీసులను బలిపశువులు చేయొద్దని ముఖ్యమంత్రికి సూచిస్తున్నాం. పద్ధతి ప్రకారం రాజకీయ పోరాటం చేద్దాం. కుట్రపూరిత రాజకీయాలతో నవ్యాంధ్రను కలుషితం చేయొద్దని జగన్ రెడ్డిని కోరుకుంటున్నాం.
ఎన్ని కుట్రలు పన్నాలనుకున్నా, ఎన్ని అఘాయిత్యాలు చేయాలనుకున్నా చంద్రబాబును ఏమీ చేయలేరు. ప్రజలు ఆయన వెంటే ఉన్నారు. చంద్రబాబుకు ఏ ఇబ్బంది కలిగినా.. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాల్సివుంటుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వివరించారు.