Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా…పోలీసు వ్యవస్థ ఉందా?

– ముఖ్యమంత్రి, డి.జి.పి ప్రోద్బలంతోనే ప్రత్యక్ష దాడులు
– టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్ళు పై వైసీపీ గుండాల దాడులు దారుణం, దుర్మార్గం
– జీవీ ఆంజనేయులు
నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విలేకరులతో మాట్లాడారు. టీడీపీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. పక్కా ప్రణాళికతో టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు చేశారు.మంగళగిరిలోని తెదేపా జాతీయ కార్యాలయం, వైజాగ్ లోని తెదేపా ప్రధాన కార్యాలయం, తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై వైకాపా నాయకులు, కార్యకర్తలు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా… పాసిస్టు దేశంలో ఉన్నామా?రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా… ప్రభుత్వం ఉందా… పోలీసు వ్యవస్థ ఉందా… అని ప్రశ్నించారు.ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రతిపక్షం ఎండగడుతుంది, ఎత్తి చూపుతుంది. విమర్శలు చేస్తే ఇటువంటి దాడులు చేయడం ఎంతవరకు సమంజసం?
తెదేపా జాతీయ కార్యాలయంపై దాడి చేయడం అంటే ఇంతకంటే దారుణం మరొకటి లేదు. ఇటువంటి వాళ్లను గుర్తించి తక్షణమే గుర్తించి, కేసులు నమోదు చేసి, నడిరోడ్డుపై ఉరితీయాలి. దీనికి ముఖ్యమంత్రి, డిజిపి బాధ్యత వహించాలి. ఎప్పుడైనా ఇటువంటి సంఘటనలు దేశ రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా జరిగాయా… ముఖ్యమంత్రి, డి.జి.పి ప్రోద్బలంతోనే ప్రత్యక్ష దాడులు జరిగాయి.
కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి. భయపడాల్సిన అవసరం లేదు. మనకు మనమే రక్షణ గా ఉండాలి. మన ప్రాణాలు, ఆస్తుల్ని మనమే కాపాడుకోవాలి. ముఖ్యమంత్రి ఈ సంఘటనతో సిగ్గుతో తలదించుకొని రాజీనామా చేయాలి. ఇంత దారుణం జరిగితే స్పందించని పోలీసు శాఖ తీరు చూస్తుంటే జాలేస్తుంది. మీ కంటే ఎక్కువ కార్యకర్తల బలం ఉంది. ప్రజాస్వామ్యంపై గౌరవం తో ఓపిగ్గా ఉంటున్నాం. మేము కూడా అదే పని చేస్తే మీ పార్టీ కనిపించదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని తక్షణమే కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE