Home » తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడిస్తాం:పీతల సుజాత

తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడిస్తాం:పీతల సుజాత

మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబుకి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు నర్సీపట్నం నుండి వచ్చే బదులు అక్కడ గంజాయి సాగు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటే బాగుండేదని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. దళిత ఓట్లతో గద్దె నెక్కి నేడు అదే దళితులను సీఎం జగన్ అనగదొక్కుతున్నారని ఆమె ఆరోపించారు. పోలీసులను పంపి దళిత నేతలను బెదిరించలేరన్నారు. ఏపీని డ్రగ్స్ కేంద్రంగా మార్చిన ప్రభుత్వ పెద్దలు సిగ్గుతో తలదించుకోవాలని సూచించారు. నక్కా ఆనంద్ బాబుపై వేధింపు చర్యలు ఆపకపోతే దళితులు అంతా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడిస్తామని పీతల సుజాత హెచ్చరించారు.

Leave a Reply