Suryaa.co.in

Andhra Pradesh

లోకేష్ పాదయాత్రకు పోలీసు రక్షణ ఇలాగేనా?

– పాదయాత్రలో వైసీపీ ఫ్లెక్సీలను ఎలా అనుమతిస్తున్నారు?
– వైసీపీ కార్యకర్తలను పాదయాద ప్రాంతానికి ఎందుకు అనుమతిస్తున్నారు?
– వైసీపీ నేతలను ప్రోత్సహిస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోండి
– ఏపీ డీజీపీకి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ

యువగళం పాదయాత్రకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారంటూ డీజీపీకి లేఖ రాసిన తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య.

లోకేష్ యువగళం పాదయాత్రకు తగిన రక్షణ ఏర్పాట్లు కల్పించాలని గతంలో అనేకమార్లు నేను స్వయంగా అనేక లేఖలు రాసాను. కానీ, పోలీసుల తీరులో మాత్రం మార్పు రాలేదు. సెప్టెంబర్ 2,3 తారీఖుల్లో పాదయాత్ర ఉంగుటూరు నియోజకవర్గానికి చేరుకుంది. నిడమర్రు మండలం నుంచి మందలపర్రు చేరుకున్న సమయంలో వైసీపీ గూండాలు పాదయాత్రపై దాడిచేశారు.

పాదయాత్రలోని వాహనాలపై దాడిచేసి అందులో పాల్గొన్న ప్రజలను బూతులు తిడితూ బెదిరించారు. పాదయాత్ర రక్షణ కల్పించడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారు. పోలీసుల పర్యవేక్షణలోనే పాదయాత్రపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. మందలపర్రులోని పాదయాత్ర మార్గంలోకి వైసీపీ గూండాలను అనుమతించాల్సిన అవసరం ఏమిటి?

పోలీసుల తమ విధి నిర్వహణ సక్రమంగా చేయకుండా నిస్తేజంగా ఉండిపోవడానికి కారణం ఏమిటి? పాదయాత్ర మార్గంలో వైసీపీ ప్లెక్సీలు కట్టేందుకు వైసీపీ మద్దతుదారులను ఎందుకు అనుమతిస్తున్నారు?

పాదయాత్ర శాంతియుతంగా జరిగేలా తగిన భద్రతా ఏర్పాట్లు కల్పించాలని మరోసారు కోరుతున్నా. మందలపర్రులో పాదయాత్రపై దాడిచేసిన వైసీపీ గూండాలపై చట్టపరమైన చర్యలు తీసుకోండి. విధి నిర్వహణలో విఫలమై మందలపర్రులో పాదయాత్రపై దాడికి అనుమతించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోండి.

LEAVE A RESPONSE