• జుల్ఫీ రావుడి అనే వ్యక్తిని ఏ2 విజయసాయిరెడ్డిచెప్పాడని ముఖ్యమంత్రి మిడిల్ఈస్ట్ దేశాలప్రత్యేక ప్రతినిధిగా నియమించారు
• సదరు జుల్ఫీ రావుడికి ఏ2కి ఉన్నసంబందమేంటి? జుల్ఫీ రావుడినే విదేశాల్లో ముఖ్యమంత్రి మనీలాండరింగ్ వ్యవహారాలు చూస్తాడన్న మాట నిజమాకాదా?
• తనమనీలాండరింగ్ కోసం, విదేశాల్లో తనకు అవసరమైన అక్రమమార్గాల సంబంధంకోసం జుల్ఫీ రావుడిని నియమించారా?
•విజయవాడలో ఆషీ ట్రేడింగ్ కంపెనీకి రూ.లక్షా75వేలకోట్ల విలువైన హెరాయిన్ గుజరాత్ నుంచి దిగుమతికి నిర్దేశిస్తే, రాష్ట్ర డీజీపీ ఏమీలేదని చెప్పడం విడ్డూరం, ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనం
• ఆషీ ట్రేడింగ్ కంపెనీ 9 సార్లు జీఎస్టీ చెల్లింపులుచేస్తే, సదరు కంపెనీ కార్యకలాపాలు ఇసుమంతైనా రాష్ట్రంలో లేవని డీజీపీ చెప్పడం, డ్రగ్స్ సరఫరాదారులకు వత్తాసుపలకడమే
• గుజరాత్ లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్ విజయవాడలోని ఆషీ ట్రేడింగ్ కంపెనీకి రావాల్సి ఉంది
• అదే ముంద్రా పోర్టునుంచి జూన్ లో రూ.లక్షా75వేలకోట్ల విలువైన 25మెట్రిక్ టన్నుల హెరాయిన్ ఆషీ ట్రేడింగ్ కంపెనీకి వచ్చింది నిజంకాదా?
• ముంద్రాపోర్టు నుంచి ఇటీవల ముఖ్యమంత్రిని కలిసింది ఎవరు? వారికి రాజ్యసభ సీటు ఇవ్వబోతున్నారా?
• ఈ హెరాయిన్ దిగుమతికి, ముంద్రాపోర్టునుంచి వచ్చిన వారికి ఏమైనా సంబంధాలున్నాయా?
• ఆషీ ట్రేడింగ్ కంపెనీ సుధాకర్ ఎవరు? కాకినాడకుచెందిన అలీషా ఎవరు.. అతనికి, వైసీపీఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఉన్నసంబంధమేంటి?
• అతని సోదరుడు వీరభద్రా రెడ్డికి కూడా అలీషా కు ఉన్న లింకేమిటి? సుధా కర్ , అలీషాలది ఒకేగ్రామమన్నది నిజమేనా?
• అలీషాకు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మధ్య మంచి సంబంధాలున్నాయి
• ద్వారంపూడి కుటుంబం కాకినాడపోర్టుని గుప్పిట్లో పెట్టుకున్న మాట వాస్తవమా..కాదా?
• గుజరాత్ ముంద్రాపోర్టులో పట్టుబడిన డ్రగ్స్ గురించి తాముచెప్పడంకాదు. స్వయంగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామే చెప్పారు
• గుజరాత్ లోని అదానీపోర్ట్ (ముంద్రాపోర్టు) లో ఇంటిలిజెన్స్ వారు, రూ. లక్షా80వేలకోట్ల విలువైన హెరాయిన్ పట్టుకున్నారని సెప్టెంబర్ 24న ఎంపీ ట్వీట్ చేశారు
• ఆఫ్ఘనిస్తాన్ కు, విజయవాడకు ఉన్న లింకేమిటో కూడా ముఖ్యమంత్రి బయటపెట్టాలి
• తాలిబన్లకు తాడేపల్లి రాజప్రాసాదానికి ఉన్న లింకులకు ఈ హెరాయిన్ దిగుబమతికి ఏమైనా సంబంధాలున్నాయా?
– టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పటినుంచీ రాష్ట్రం నేరస్తులకుస్వర్గధామంగా, అరాచకశక్తులకు అడ్డాగా మారిందని, డ్రగ్ ట్రాఫికర్స్ కు రాష్ట్రం పెద్దట్రావెల్ జంక్షన్ గా తయారైందని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య తేల్చిచెప్పా రు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయనమాటల్లోనే …
జగన్మోహన్ రెడ్డి అవగాహానారాహిత్యంతో, పరిపాలనకు ఆయనకున్న అవగాహనాలేమితో ఆంధ్రప్రదేశ్ యువత నిర్వీర్యమవుతోంది. హెరాయిన్, గంజాయి, ఇతరమాదకద్రవ్యాలు ఏపీయువతను నిర్వీర్యంచేస్తున్నాయి. ఆఖరికి డ్రగ్ ట్రాఫికింగ్ కు ఆంధప్రదేశ్ రాష్ట్రం మూలస్తంభంలా మారితే, విజయవాడ నగరం ముఖ్యపట్టణంలా మారింది. అందుకు సంబంధించిన ఆధారాలను సేకరించాల్సిన ఖర్మప్రతిపక్షానికి పడితే, వాటిగురించి ప్రజలకు చెప్పాల్సిన ప్రభుత్వం మౌనవ్రతం చేబూనింది. రాష్ట్రంలో మూడు టన్నుల హెరాయిన్ పట్టుబడితే, (ఒక్కోటన్ను రూ.7వేలకోట్లవరకుఉం టుంది.) పట్టించుకోరా? గుజరాత్ లోని ముంద్రాపోర్టు నుంచి రూ.21వేలకోట్లవిలువైన హెరాయిన్ విజయవాడలోని దుర్గాపూర్ణ వైశాలి గోవిందరాజు, ఆషీ ట్రేడింగ్ కంపెనీకి రావాల్సిఉంది. తాను మాట్లాడేది ఊరికే విని, ముఖ్యమంత్రి వెళ్లిపోతే కుదరదు… ఇప్పుడు తాను మాట్లా డుతున్న అంశం రాష్ట్రయువత నిర్వీర్యానికి, కొందరువ్యక్తులు ఉగ్రవాదుల తో సంబంధాలుపెంచుకోవడానికి సంబంధించిన అంశం. అందుకే తాను చెప్పేది ముఖ్యమంత్రి సీరియస్ గా వినాలి.
గుజరాత్ లోని ముంద్రా పోర్టులో పట్టుబడినహెరాయిన్ విజయవాడలోని ఆషీ ట్రేడింగ్ కంపెనీకి రావాల్సిఉంది. ఆ రాష్ట్రంలో, ఇక్కడిచిరునామాతో హెరాయిన్ పట్టుబడితే ముఖ్యమంత్రి, డీజీపీఉలిక్కిపడాలి. కానీ అలా జరగలేదు. సదరువ్యవహారంపై డీజీపీసవాంగ్, ముఖ్యమంత్రి కలిసి ప్రజల నుమోసగించేలా మాట్లాడారు. ఆషీ ట్రేడింగ్ కంపెనీ చిరునామామాత్రమే విజయవాడలోఉందని, సదరుసంస్థ కార్యకలాపాలు ఇసుమంతైనా రాష్ట్రం లో లేవని డీజీపీ చెప్పారు.
ఏఆధారాలతో, ఏసమాచారంతో ఆయన అలా మాట్లాడారు. అలా మాట్లాడిన డీజీపీచేతుల్లో రాష్ట్రప్రజలు, యువత క్షేమ మేనా అన్నసందేహం కలుగుతోంది. రూ.21వేలకోట్ల హెరాయిన్ విజయ వాడ నగరానికి దిగుమతి కాబోతూపట్టుబడితే, డీజీపీ పోలీస్ శాఖ బాస్ లా కాకుండా సినిమాల్లో కమెడియన్ లా మాట్లాడాడు. ఈ వ్యవహారంలో డీజీపీ చాలాఇబ్బందులు పడబోతున్నారు. ఆయన్నివిచారించడానికి ప్రత్యేకబృందంరాబోతోంది. ఆషీ ట్రేడింగ్ కంపెనీ 17-11-2020 నుంచి జూన్ 2021 వరకు 9సార్లు జీఎస్టీ చెల్లింపులుచేసింది. తామువ్యాపారం చేశామంటూ, దుర్గాపూర్ణ వైశాలి గోవిందరాజు గారు 9సార్లు జీఎస్టీ కట్టారు. ఇంతజరిగితే ముఖ్యమంత్రి గారు నోరుతెరవరా? అదే ముంద్రా పోర్టునుంచి జూన్ లో రూ.లక్షా75వేలకోట్ల విలువైన 25మెట్రిక్ టన్నుల హెరాయిన్ ఆషీ ట్రేడింగ్ కంపెనీకి వచ్చింది. నిన్నటికి నిన్న మరో మూడు మెట్రిక్ టన్నులహెరాయిన్ ముంద్రాపోర్టులో సీజ్ చేయడం జరిగింది.
అంటే మొత్తంగా ఒక రాష్ట్ర బడ్జెట్ మొత్తంవిలువైన హెరాయిన్ సదరుకంపెనీకివచ్చింది. ఈ విధంగా రాష్ట్రానికి హెరాయిన్ దిగుమతి అవుతుంటే ముఖ్యమంత్రి దానిపైఎలాంటి ప్రకటన చేయరా? డీజీపీ, ముఖ్యమంత్రి కలిసే దేశద్రోహం చేస్తున్నారా.. లేక ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకుంటున్నారా అనిప్రశ్నిస్తున్నాం. డీజీపీ ఎప్పుడైతే ఆషీ ట్రేడింగ్ కంపెనీ కార్యకలాపాలు రాష్ట్రంలో లేవని చెప్పారో, ఆయన తనవిశ్వసనీయతనుపోగోట్టుకున్నాడు. అందుకే ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రే సమాధానంచెప్పాలి. ఇంతభారీ మొత్తంలో వేలకోట్లవిలువైన మాదకద్రవ్యాలు రాష్ట్రానికివస్తుంటే ముఖ్యమంత్రికి నిద్రఎలా పడుతోంది. ఇంటిలిజెన్స్ విభాగం మత్తులో జోగుతోందా? పోలీస్అధికారులు నిద్రలోఉన్నారా?
జుల్ఫీ రావుడి అనే వ్యక్తిని మిడిల్ ఈస్ట్ దేశాలకు ప్రత్యేకప్రతినిధిగా జగన్ ప్రభుత్వం నియమించింది. సదరు జుల్ఫీ రావుడి ఏ2 విజయసాయిరెడ్డికి అనుంగుఅనుచరుడు. ఆ జుల్ఫీ మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఏంచేస్తున్నాడు? అతని నియామకంకోసం తీవ్రంగా కృషిచేసిన విజయసాయిరెడ్డికి, అతన్ని నియమించిన ముఖ్యమంత్రికి హెరాయిన్ లావాదేవీలగురించి ఏమైనా తెలుసునా? రాష్ట్రానికి రావాల్సిఉండి, ముంద్రాపోర్టులో పట్టుబడిన హెరాయిన్ పై ముఖ్యమంత్రికి ఏమైనా తెలుసునా? జుల్ఫీ రావుడికి ఏమైనా దానితో సంబంధముందా? ప్రభుత్వం అతన్ని నియమించాక మిడిల్ ఈస్ట్ దేశాల్లోఏంచేస్తున్నాడు? తన మనీలాండరింగ్ కోసం, విదేశాల్లో మనకు అవసరమైన అక్రమమార్గాల సంబంధంకోసం ముఖ్య మంత్రిగారు, జుల్ఫీ రావుడిని వాడారా? ఇంత జరిగాక కూడా ముఖ్యమంత్రి నోరుమూసుకొని కూర్చుంటానంటే కుదరదు? తక్షణమే వాస్తవాలతో ఆయన నోరువిప్పాలి.
రాష్ట్రంలోని ఆషీ ట్రేడింగ్ కంపెనీఎలాంటి కార్యకలా పాలు నిర్వహించలేదనిచెప్పినప్పుడే, డీజీపీ మాట్లాడేఅర్హతకోల్పోయాడు. ఇక నోరువిప్పాల్సిందిముఖ్యమంత్రే. జుల్ఫీ రావుడి గురించి తెలియాలంటే ఏ2 విజయసాయిరెడ్డిని, ముఖ్యమంత్రి తెరపైకితేవాలి. ఈ జుల్ఫీ రావుడి, ఏ2 విజయసాయిరెడ్డికి మనీలాండరింగ్ వ్యవహారాల్లో సహయకుడని విన్నాం.. అదినిజమా? ముఖ్యమంత్రి మనీలాండరింగ్ వ్యవహారాలు మొత్తం విదేశాల్లోఅతనే చూస్తాడని కూడా విన్నాం….అదినిజమా, కాదా? జుల్ఫీ రావుడికి ఆఫ్ఘనిస్తాన్ తో సంబంధముందని చెబుతున్నారు.. అది వాస్తవమాకాదా?
ఆఫ్ఘనిస్తాన్ కు, ఆంధ్రప్రదేశ్ కుఉన్న సంబంధమేంటి.. తాలిబన్లకు, విజయవాడకు ఉన్న లింకేమిటో ముఖ్యమంత్రే చెప్పాలి. ఆషీ ట్రేడింగ్ కంపెనీ సుధాకర్ ఎవరు? కాకినాడకేంద్రంగా సాగిన కార్యకలాపాలపై డీజీపీ ఏం విచారించారు? ఆయన అసలు డీజీపీనా లేక లేమెన్ నా? కాకినాడకుచెందిన అలీషా ఎవరు.. అతనువైసీపీఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి బాగాతెలుసట. అతని సోదరుడు వీరభద్రా రెడ్డికి కూడా అలీషా తెలుసట. అలీషా ఎవరు…సుధాకర్ ఎవరు? సుధా కర్ , అలీషాలది ఒకేగ్రామం. అలీషాకు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మధ్య మంచి సంబంధాలున్నాయి. ఈ విధంగా ఉన్నలింకులేమిటో తెలు సుకోకుండా డీజీపీఏంలేదని ఎలా చెబుతారు? సుధాకర్ కు చెందిన ఆషీ ట్రేడింగ్ కంపెనీ ద్వారా రాష్ట్రంలో ఎంతహెరాయిన్ ఏఏ నగరాలకు, ఎక్కడి కి వెళ్లిందో ముఖ్యమంత్రే చెప్పాలి. యువతను మత్తులోముంచి తనపబ్బం గడుపుకోవాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశమా?
ఎక్కడో డీఆర్ఐ వారు, తెలంగాణ పోలీసులు, మాదకద్రవ్యాలపై హెచ్చరించేవరకు ఏపీ పోలీస్ ఏంచేస్తోంది? ఇది ముఖ్యమంత్రికి, డీజీపీకి సిగ్గుచేటు కాదా? ఈ మొత్తం బాగోతంపై ముఖ్యమంత్రి రాష్ట్రప్రజలకు సమాధానంచెప్పాలి. ఆయన సొంతచెల్లే ఈ ముఖ్యమంత్రి దొంగఓట్లతో అధికారంలోకివచ్చాడని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక రాష్ట్రానికిఏమిటీ ఖర్మ? వేలకోట్ల హెరాయిన్ రాష్ట్రంలోకి దిగుమతి అవుతుంటే, యువత నిర్వీర్య మవుతుంటే, ముఖ్యమంత్రి నోరువిప్పరా? ముఖ్యమంత్రి పదవంటే ఊరికే కూర్చోవడంకాదు.
గతంలో జగన్మోహన్ రెడ్డిని మంచిముఖ్యమంత్రి అనిపొగిడిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామే సెప్టెంబర్ 24నఒక ట్వీట్ పెట్టారు. దానిలో ఆయన గుజరాత్ లోని అదానీపోర్ట్ (ముంద్రాపోర్టు) లో ఇంటిలిజెన్స్ వారు, రూ. లక్షా80వేలకోట్ల విలువైన హెరాయిన్ పట్టుకున్నారని చెప్పారు. ఆయన చెప్పిందే తాము చెబుతున్నాం. ముంద్రా పోర్టునుంచి విజయవాడకు హెరాయిన్ దిగుమతికావడానికి రంగంసిద్ధమైందని సుబ్రహ్మణ్యస్వామే చెప్పారు. ఇంతస్పష్టంగా డ్రగ్స్ ట్రాఫికింగ్ కు విజయవాడ కేంద్రంగా మారి తే ముఖ్యమంత్రి సమాధానంచెప్పకపోతే ఎలా? అలీషా ఎవరు..సుధాకర్ ఎవరు. వారిద్దరికి ఉన్నసంబంధాలేమిటి? అలీషాకు, వైసీపీఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఉన్నలింకేమిటి? వినోద్ అగర్వాల్ ఎవరు…అనేది ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి. డ్రగ్స్ వ్యవహారంపై ఏమీవిచారించకుండా డీజీపీఅలాఎందుకు మాట్లాడారో కూడా ముఖ్యమంత్రే చెప్పాలి.
సీబీఐ కేసులేంటో…. ముఖ్యమంత్రిపై ఉన్నకేసుల విచారణేంటో అంతా డ్రామాలా ఉంది. ఆ వ్యవహారంగురించి తరువాత మాట్లాడతాను. రిలయన్స్ సంస్థవారే తనతండ్రిగారి మరణానికి కారణమని నమ్మిన జగన్మోహన్ రెడ్డి, సదరు సంస్థవారు చెప్పినవ్యక్తికే రాజ్యసభపదవిఎలా ఇచ్చారు. గుజరాత్ లోని ముంద్రాపోర్టుకు, జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ పదవి ఇచ్చిన వ్యక్తికి ఏం సంబంధముంది? గుజరాత్ లోని ముంద్రా పోర్టుకి సంబంధించిన వ్యక్తులుఎవరైనా ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి ని కలిశారా….వస్తే ఎందుకొచ్చారు? వారికి, ముఖ్యమంత్రికి మధ్య ఏం చర్చజరిగిందో, ఆయనే చెప్పాలి. రాష్ట్రానికి విచ్చలవిడిగా హెరాయిన్ ది గుమతి అవుతోందని డీఆర్ఐ నిర్ధారించింది. బీజేపీఎంపీ సుబ్రహ్మణ్యస్వా మి చెప్పారు. ఆషీ ట్రేడింగ్ కంపెనీ జీఎస్టీ చెల్లింపులు బయటపడ్డాయి. ఆఫ్ఘనిస్తాన్ తో, తాలిబన్లతో ఈ రాష్ట్రానికి, ఇక్కడిప్రభుత్వానికి ఏంసంబంధ ముందో కూడా ముఖ్యమంత్రి స్పష్టంచేయాలి?
హూ ఈజ్ ఆంధ్రప్రదేశ్ డ్రగ్ డాన్ అన్నప్రశ్నకు కూడా ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలి. మొన్నటికి మొన్న జగన్ కేబినెట్ లోని మంత్రి రూ.6కోట్లతో చెన్నైలోదొరికాడు. మరోమంత్రేమో ప్రత్యేకవిమానంలో రష్యా కు వెళ్లాడు. ఈ వ్యవహారాలన్నీఏమిటి..ఒకదానితో ఒకదానికి ఉన్న సంబంధమేమిటో ముఖ్యమంత్రే బహిర్గతంచేయాలని డిమాండ్ చేస్తున్నా. టీడీపీనేత పట్టాభి ఆధారాలతో సహా డ్రగ్స్ ట్రాఫికింగ్ వ్యవహారాన్ని బహిర్గ తపరిచినా ప్రభుత్వంలోచలనంలేదు. కాబట్టే కొందరి నోళ్లు తెరిపించడానికే తాను గళంవిప్పాల్సివచ్చింది. ఈరోజు తాను లేవనెత్తిన అంశాలన్నింటిపై ముఖ్యమంత్రే నోరువిప్పాలి.
ఆయన గుమాస్తా సజ్జలో..డీజీపీనో మాట్లాడటం కుదరదు. డ్రగ్స్ ట్రాఫికింగ్ లో పట్టుబడితే, నేరం రుజువైతే ఎంతటివారికై నా ఉరిశిక్షపడటంఖాయం. అలాంటి వ్యవహారంలో వాస్తవాలుస్పష్టంగా కనిపిస్తుంటే ముఖ్యమంత్రి నోరుతెరవకపోతే ఎలా? గుజరాత్ లోని ముంద్రాపోర్టు లో పట్టుబడిన హెరాయిన్ గుట్టుమట్లు విచారించడానికి స్వయంగా దేశప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా లే పూనుకోవాలి. వారు స్వయంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ బృందంతో , ఈ డ్రగ్స్ ట్రాఫికింగ్ పై దర్యాప్తుజరిపించాలి. అప్పుడే ఆఫ్ఘనిస్తాన్ కు ఆంధ్రప్రదేశ్ కు ఉన్న లింకు లేమిటో, తాలిబన్లకు విజయవాడకు ఉన్న సంబంధమేమి టో బయటకువస్తుంది.