చిలకలూరిపేట పట్టణంలోని సంజీవనగర్ నందు రెండు వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం రాత్రి రెండు పాములు ఇళ్లలో జొరపడి హల్ చల్ చేసాయి. ఒకటవ లైన్, రెండవ లైన్లలో యువకులు కొండచిలువ, జెర్రిపోతు పాములను కొట్టి చంపారు.సుమారు 5 అడుగుల పొడవున్న పాములను చూసి మహిళలు, పిల్లలు భయభ్రాంతులకు గురి అయ్యారు. కాలనీ చుట్టూ ఉన్న ఖాళీ స్థలాల్లో, తుమ్మచెట్లు అధికంగా పెరిగటంతో తరచూ పాములు ఇళ్ళల్లో కి వసున్నట్లు స్థానికులు చెబుతున్నారు.