Suryaa.co.in

International National

ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి అరెస్ట్

– బంగ్లాదేశ్ ప్రభుత్వచర్యపై భారత్ ఆందోళన
– బెయిల్ నిరాకరణపై ఆందోళన
– బంగ్లాలో హిందువులపు దాడుల పట్ల ఆవేదన

ఢాకా: ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారిని బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేయడంపై భారత్ విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌లో మైనార్టీ హిందువుల భద్రత పట్ల చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి గత నెలలో అక్కడ జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జెండాను ఉద్దేశించి ఆయన పలు వ్యాఖ్యలు చేసినట్లు బంగ్లాదేశ్ మీడియా కథనాలు చెబుతున్నాయి.

ఢాకా విమానాశ్రయంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనకు కోర్టు బెయిల్‌ను నిరాకరించింది. ఆయన అరెస్ట్‌ను నిరసిస్తూ పలు సంఘాలు బంగ్లాదేశ్‌లో ఆందోళనలు చేపట్టాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనార్టీలపై దాడులు సరికాదని, హిందువులు, మైనార్టీలందరికీ భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులను కోరినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.

బంగ్లాలో ఇప్పటికే హిందువులు, మైనార్టీలపై తీవ్రవాద గ్రూప్‌లు దాడులు చేస్తున్నాయని, ఇలాంటి సమయంలోనే అరెస్ట్ ఘటన ఆందోళనకరమని, బంగ్లాదేశ్‌లో మైనార్టీ ఇళ్లలో దోపిడీలు, విధ్వంసం, దేవాలయాలను అపవిత్రం చేయడం వంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయని గుర్తు చేసింది. చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి అరెస్ట్, బెయిల్ నిరాకరణపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.

LEAVE A RESPONSE