భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యార్లగడ్డ రామ్ కుమార్, మీడియా ప్యానలిస్ట్ దువ్వూరు సుబ్రహ్మణ్యం
జార్ఖండ్ కి చెందిన రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహూ సన్నిహిత వ్యాపార వర్గాల చెందిన ఇళ్లపై జార్ఖండ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ లలో ఐటీ శాఖ జరిపిన దాడుల్లో వందల కోట్లు నల్లధనం బయటపడటం దేశాన్ని సంభ్రమాచార్యల కు గురి చేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యార్లగడ్డ రామ్ కుమార్ భారతీయ జనతా పార్టీ మీడియా ప్యానలిస్ట్ దువ్వూరు సుబ్రహ్మణ్యం అన్నారు. కాంగ్రెస్ అవినీతి చరిత్ర గురించి చెప్పడం ప్రారంభిస్తే మహాభారతంలోని 18 పర్వాల కన్నా పెద్దదవుతుందని వారు వ్యాఖ్యానించారు.
దేశానికి స్వతంత్రం 1947లో వస్తే 1948లోనే ఆర్మీ జీపులు కుంభకోణం అప్పటి భారత హై కమిషనర్ వీకే కృష్ణమోహన్ హయాంలో ప్రారంభమైందని, నాటి నుంచి 2014 మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించే వరకు ప్రతి కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కుంభకోణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయని యార్లగడ్డ రామ్ కుమార్ అన్నారు. 1951లో సైకిల్ దిగుమతి కుంభకోణం, 1956లో బీహెచ్యూ నిధులు కుంభకోణం ఇలా చెప్పుకుంటూ పోతే స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళ నుంచి కాంగ్రెస్ అవినీతికి మరో పేరుగా మారుపేరుగా ఉన్న విషయం ప్రజలందరికీ తెలుసునని అటువంటి కాంగ్రెస్ నేడు స్వయం ప్రకాశ శక్తి లేని కొద్దిమంది నాయకులు ,పార్టీలతో ఇండియా ఎలియన్స్ ఏర్పాటుచేసి స్వచ్ఛమైన నీతివంతమైన పాలనను అందిస్తున్న నరేంద్ర మోడీ కి భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా చూపటం పట్ల ప్రజల సైతం నవ్వుకుంటున్నారని యార్లగడ్డ రామ్ కుమార్ అన్నారు .
గత నెలరోజుల కాలంలో దేశంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన పరాభవం కాంగ్రెస్ పట్ల ప్రజలకు ఉన్న విముకుతకు దర్పణం పడుతుందని యార్లగడ్డ అభిప్రాయపడ్డారు. బెంగళూరులో కాంగ్రెస్ నాయకుడు బంధువుల ఇంట్లో 42 కోట్లు, అదేవిధంగా యూపీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకుడు పీయూష్ జైన్ ఇంట్లో 200 కోట్లు, కాన్పూర్ లో కాంగ్రెస్ నాయకుడు ఇంట్లో 95 కోట్లు విలువ మేరకు రద్దు చేయబడిన నోట్లు ఐటి,ఈడి శాఖలు స్వాధీనం చేసుకున్న విషయం అందరికీ తెలిసిన చరిత్రని యార్లగడ్డ అన్నారు.
బిజెపి మీడియా ప్యానలిస్ట్ దువ్వూరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 2024 సంవత్సరంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడవసారి 300 పైచిలుకు పార్లమెంటు స్థానాలు స్వతంత్రంగా సాధించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ధీమా వ్యక్తం చేశారు. .2010 సంవత్సరంలో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ స్కాం కాంగ్రెస్ పార్టీని ఢిల్లీలో అధికారానికి దూరం చేసిందని, ది గ్రేట్ ఇండియన్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కాం పిలుచుకునే అనేక స్కాములకు కాంగ్రెస్ సూత్రధారి, పాత్రధారి అని పేదలకు పంచే గోధుమలు, పంచదార, బియ్యం ,కిరోసిన్ వంటి నిత్యవసర సరుకుల నుండి దేశ భద్రతకు ఆర్మీ ఉపయోగించే బోఫర్స్ పిరంగుల వరకు అన్నిట కుంభకోణాలకు పాల్పడిన కాంగ్రెస్ చరిత్రను ఎవరూ మర్చిపోరని 2024లో కాంగ్రెస్ పార్టీకి ,కాంగ్రెస్తో జతకట్టిన మరికొన్ని చిన్నాచితకా పార్టీలకు శృంగభంగం తప్పదని దువ్వూరి అన్నారు. సమావేశంలో మోసలిగంటి సురేష్, పొనుగుపాటి సుబ్బారావు, తుమ్మలపల్లి నాని తదితరులు పాల్గొన్నారు