Suryaa.co.in

Andhra Pradesh

దళిత అధికారుల్ని తన స్వార్థానికి వాడుకొని వదిలేయడం జగన్ కు అలవాటుగా మారింది

• సీఐడీ చీఫ్ గా సునీల్ కుమార్ ముఖ్యమంత్రి చెప్పిందల్లా చేసి, చివరకు అప్రాధాన్యత విభాగంలోకి వెళ్లాడు
• అతని తర్వాత బాధ్యతలు చేపట్టిన సంజయ్, జగన్ ఆదేశాలతో రెచ్చిపోయి మార్గదర్శిపై తప్పుడు కేసులు పెట్టి, చివరకు ఎక్కడికెళ్లాడో తెలియదు
• సీఐడీ బాస్ గా వచ్చిన సీతారామాంజనేయులు వైసీపీ రూల్స్ కాకుండా ఐపీఎస్ రూల్స్ పాటించాలని కోరుతున్నాం
– మాజీ మంత్రి పీతల సుజాత

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓట్లేసిగెలిపించి, ముఖ్యమంత్రి అయ్యాక ఆయనపల్లకీ మోసిన దళితుల్ని సీఎం వాడుకొని వదిలేయడం బాధాకరమ ని, దళితవర్గానికిచెందిన ఐ.పీ.ఎస్. ఐ.ఏ.ఎస్ లు జగన్ వికృత క్రీడకు బలిఅయ్యారని, మాజీమంత్రి పీతలసుజాత తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే …

“ సీఐడీ చీఫ్ గా నిబంధనలకు విరుద్ధంగా, వైసీపీ రూల్స్ ప్రకారం పనిచేసిన సునీల్ కుమార్ పరిస్థితి ఏమైంది? సునీల్ కుమార్ ముఖ్యమంత్రి చెప్పిందల్లా చేసి చివరకు కోర్టులతో చీవాట్లుతిన్నాడు. ఆయన తర్వాత బాధ్యతలుచేపట్టిన సంజయ్, అనారోగ్య మనిచెప్పి సెలవుపై వెళ్లాల్సిన అగత్యం ఎందుకొచ్చింది? మార్గదర్శిసంస్థపై కక్షసాధిం పుల కోసం సంజయ్ ను జగన్ వాడుకున్నాడు.

గతంలో డీజీపీగా పనిచేసిన సవాంగ్ ను ముఖ్యమంత్రి ఎంతగానమ్మించి వంచించాడో ప్రజలందరూ చూశారు. ఉన్నత చదువులు చదివిన అధికారుల్ని తనఅవసరానికి వాడుకొని ముఖ్యమంత్రి ఏ విధంగా పక్కనపెడుతున్నా డో అందరూ గ్రహించాలి. గతంలో తండ్రి అధికారం అడ్డుపెట్టుకొని, అవినీతికిపాల్పడి, తన ధనదాహానికి ఎందరో ఐఏఎస్ అధికారుల్ని జగన్ బలిచేశాడు.

సీఐడీ బాస్ గా సీతారామాంజనేయులు అనే అధికారి బాధ్యతలు చేపట్టారు. ఆయన తనహోదా కాపాడుకుంటూ, సక్రమంగా, సమర్థవంతంగా విధినిర్వహణచేయాలని కోరుతున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డో, ముఖ్యమంత్రో, మరొకరోచెప్పింది వినకుండా, ఐపీ ఎస్ నిబంధనలప్రకారం సీతారామాంజనేయులు నడుచుకోవాలి.

గతంలోఉన్న అధికా రులు వైసీపీ రూల్స్ ప్రకారం నడవబట్టే, వారిని ముఖ్యమంత్రి కూరలో కరివేపాకులా పక్కనపెట్టాడు. ఐ.ఏ.ఎస్. ఐ.పీ.ఎస్ అధికారులుచట్టప్రకారం, రాజ్యాంగబద్దంగా నడిస్తే నే ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం ఏర్పడుతుంది. ఈ వాస్తవాన్ని సివిల్ సర్వీసెస్ అధి కారులు గుర్తెరిగి మసులకుంటే మంచిది.” అని పీతలసుజాత హితవుపలికారు.

LEAVE A RESPONSE