– విజయ సాయి రెడ్డి.. బీజేపి మౌత్ పీస్
– రాజ్యసభలో విజయసాయి రెడ్డి ఉపన్యాసంతో రుజువైంది
– ఎపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్
రాష్ట్రంలో వైసీపీ.. బీజేపీకి బి. టీమ్ గా పనిచేస్తుందని ఈ రోజు రాజ్యసభలో విజయసాయి రెడ్డి ఉపన్యాసం ద్వారా ఋజువైంది. ‘కాంగ్రెస్ ముక్త భారత్’ అనే నినాదం ఇచ్చిన బిజేపి విధానాన్నే, వైసీపీ కూడా ఈ రోజు రాజ్యసభలో విజయ సాయి రెడ్డి ద్వారా స్పష్టం చేసింది. దేశంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుండటంతో.. జగన్ పార్టీ గుండెల్లో భయం కలిగిస్తోంది.
రానున్న 2024 జగన్ ఓటమి ఖాయం. జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా పార్లమెంటు సభ్యునిగా తొలి రాజకీయ అవకాశం పొందిన జగన్ మోహన్ రెడ్డి…కాంగ్రెస్ ముక్త భారత్ కోరడం తల్లి పాలు తాగి… ద్రోహం చేయడం గా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. బీజేపీ విధానాన్ని, భాషను.. వైసీపీ మాట్లాడటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.
కాంగ్రెస్ పార్టీ కి వెన్నుముక లేదని విజయ సాయిరెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా వుంది. జగన్ పార్టీ కి వెన్నుముక బీజేపి.. రక్తం బీజేపి.. గాలి బీజేపి గా మారింది కనుకనే కాంగ్రెస్ పార్టీ పైన అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. విజయ సాయి రెడ్డి.. బీజేపి మౌత్ పీస్ లా ఈ రోజు రాజ్య సభ లో మాట్లాడారు.
రాష్ట ప్రజలు ఆలోచించాలి.. రాజశేఖర రెడ్డి అభిమానులు ఆలోచించాలి. వైఎస్ఆర్ ఆశయాలను పాటించే వారు.. జాతీయ కాంగ్రెస్ పార్టీ చెంతకు చేరి బీజేపి విధానాలను ఓడించాలి. బీజేపి తో కుమ్మక్కు అయిన వైసీపీ ని రానున్న ఎన్నికల్లో
ఓడించాలి.