Suryaa.co.in

Telangana

రక్షణ లేని ప్రభుత్వ బాలికల సంక్షేమ హాస్టల్స్

– బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి

భువనగిరి SC హాస్టల్ లో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు భవ్య, వైష్ణవి ఆత్మహత్య పై అనుమానాలకు దారి తిస్తున్న తీరు పై బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి స్పందించారు. హాస్టల్ వార్డెన్ చెపుతున్న కారణాలు, విద్యార్థినుల తల్లితండ్రులు చెప్పే కారణాలు ఎక్కడానమ్మశక్యంగా లేవు. విద్యార్థినుల వంటిపై ఉన్న గాయాలను చుస్తే అనుమానం కల్గడం, ఆ విద్యార్థినులది హత్యనా? ఆత్మహత్య నా? అనే అనుమానం కలుగుతుంది.

కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ జరిపించి, వాళ్ళ చావుకి కారణం అయిన వారి పట్ల కఠినంగా చర్యలు తీసుకొని విద్యార్థినుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలి అని శిల్పా రెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. లేని పక్షంలో మృతి చెందిన విద్యార్థినుల కుటుంబాల తరపున న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం అని, ప్రభుత్వ బాలికల సంక్షేమ హాస్టల్స్ కి రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు ఎందుకు అని ప్రశ్నించడం జరిగింది.

LEAVE A RESPONSE