Suryaa.co.in

Andhra Pradesh

భాజపా నిజమైన దేశభక్తి కలిగిన పార్టీ

-భాజాపా మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో భాజపా రాష్ట్ర -కార్యాలయంలో మైనార్టీ మోర్చా సోషల్ మీడియా రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ప్రారంభం
– హాజరైన మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, భాజపా నేషనల్ మీడియా కో కన్వీనర్ జశ్వంత్ జైన్

జశ్వంత్ జైన్, భాజపా నేషనల్ మీడియా కో కన్వీనర్ కామెంట్స్:
విజయవాడ: బీజేపీ ముఖ్య ఉద్దేశం అల్ప సంఖ్యాక వర్గాల వారికి పెద్ద పీట వేసే విధంగా ఉంటుంది. భాజపా నిజమైన దేశభక్తి కలిగిన పార్టీ. భాజపా పై జరిగే టప్పుడు పార్టీ శ్రేణులు ప్రచారాన్ని తిప్పికొట్టాలి. దేశ అభివృద్ధి కోసం మోదీ మంచి కృషి చేస్తున్నారు . కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ మోదీ దేశ ప్రజలకు అండగా నిలబడ్డారు. భాజపా కార్యకర్తలు నిజమైన దేశ భక్తులు.

కొన్ని శక్తులు ప్రజల మధ్య మత ఘర్షణలు సృష్టిస్తున్నారు. దేశ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు సోషల్ మీడియా ద్వారా చెప్పాలి. అనేక సంక్షేమ పథకాలు మోదీ చేపట్టారు వాటిని ప్రజలకు తెలపాలి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి పథకం లో వెళ్తుంది. మైనారిటీ సోషల్ మీడియా దీనిని సమాజంలోకి తీసుకెళ్లేలా ప్రతి ఒక్క మైనారిటీ నాయకులు ముందుండాలి.

జన్ ధన్ యోజన, ప్రధాన మంత్రి కిసాన్ యోజన , ఉజ్వల్ యోజన, ఇలాంటి పథకాలు లబ్ది దారులకి నేరుగా బ్యాంక్ ఖాతాలకి డబ్బులు వేస్తున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఇస్తున్నారు. ప్రధాన నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అల్ప సంఖ్య వర్గాల వారికీ చేయూత ఇచ్చి వారిని పైకి తీసుకొచ్చే విధంగా కృషి చేశారు. వీటన్నిటికీ మైనారిటీ సోషల్ మీడియా ప్రచారం చేసే విధంగా ముందుకు వెళ్ళాలి.

తొలుత మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ మాట్లాడుతూ కొన్ని సంస్థలు విషాన్ని నూరిపోస్తున్నాయని అటువంటి వారి పట్ల జాతీయవాద మైనారిటీ లు జాగ్రత్తగా ఉండాలి అన్నారు. సోషల్ మీడియా వేదిక గా వేర్పాటు వాదులు కు ధీటైన జవాబు ఇవ్వాలన్నారు . పిఎఫ్ ఐ, ఎస్ డి పి ఐ సంస్థలు మనరాష్ట్రంలో ఉన్న వాటి మూలాలు తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.

సోషల్ మీడియా వేదిక గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి అని పిలుపు ఇచ్చారు. మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బాషా, మైనారిటీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ షేక్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE