Suryaa.co.in

Telangana

బషీర్ బాగ్ కాల్పులకు కారణం కేసీఆర్

– నేను పాస్ పోర్ట్ బ్రోకర్ కొడుకుని కాదు
– కేటీఆర్ లాగా అమెరికాలో బాత్‌రూంలు కడగలేదు
– ఉచిత విద్యుత్ పెటేంట్‌ కాంగ్రెస్ పార్టీదే
– ఉచిత్ విద్యుత్ తో పాటు నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది
– బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల ఫాంహౌస్ లు, భూములు ఉన్న ప్రాంతాల్లో 10 నుంచి 12 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా
– కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్
– కేసీఆర్ 24 గంటలవిద్యుత్ పేరుతో దోపిడీ
– ఉచిత కరెంట్ ఇవ్వడం కుదరదని ఆనాడు తెలుగుదేశంతో చెప్పించిన వ్యక్తి కేసీఆర్
– త్వరలో మోటార్లకు కేసీఆర్ మీటర్లు పెట్టబోతున్నారు
– ఉచిత విద్యుత్ సరఫరాపై కోమటిరెడ్డి, జీవన్ రెడ్డి ఇచ్చిన సవాల్ ను స్వీకరించండి
– చంద్రబాబు దగ్గర చెప్పులు మోసిన మీరా నా గురించి మాట్లాడేది
– 27 లక్షల 50వేల మోటార్లకు రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు బిగించబోతుంది
– మగాళ్లు అయితే సిట్టింగ్‌లకే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని లేకుంటే మాడా అని ఒప్పుకోవాలి
– గతంలో సీబీఐ విచారణ కోరిన లక్ష్మణ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు
– టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

“2004 ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ అంశాన్ని కాంగ్రెస్ ప్రకటించిందని.. ఉచిత కరెంట్ ఇవ్వడం కుదరదని తెలుగుదేశంతో చెప్పించిన వ్యక్తి చంద్రశేఖర్ రావు. అ నాడు విద్యుత్ ఉద్యమంలో రైతులను చంపిన పాపం ముమ్మాటికీ కేసీఆర్ దే అని” టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఊర్లో పెళ్లికి కుక్కల సందడిలాగా పుట్టలో పడుకున్న పాములు బయటకి వచ్చి తనను నిందిస్తున్నారని మండిపడ్డారు. అమెరికాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కొందరు నిపుణులు తెలంగాణ ప్రభుత్వ పాలసీలపై ప్రశ్నలు సంధించారని… కాంగ్రెస్ పార్టీ విధివిధానాలు తాను క్లియర్‌గా వివరించినట్లు చెప్పారు. తాను చెప్పిన సమాధానంలో కొంత భాగాన్ని కట్ చేసి ప్రచారం చేశారని ఆరోపించారు.

ఐటీ మంత్రి అతి తెలివి ప్రదర్శించి చిల్లర వ్యవహారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్‌పై మరోసారి చర్చ జరగడం మంచిదేఅని అన్నారు. కేటీఆర్ వస్తే వ్యవసాయంలో ఇద్దరం పోటీ పడదామన్నారు.

‘‘ఉచిత విద్యుత్ పెటేంట్‌ కాంగ్రెస్ పార్టీదే. సొంతంగా వ్యవసాయం చేసిన వ్యక్తిని నేను. వ్యవసాయం గురించి పూర్తిగా నాకు తెలుసు. దుక్కి దున్నిన వాడిని. కేటీఆర్ లాగా అమెరికాలో బాత్‌రూంలు కడగలేదు. నేను పాస్ పోర్ట్ బ్రోకర్ కొడుకుని కాదు. నేను దళారీ కొడుకును కాదు’’ అంటూ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు

తెలుగుదేశం హయంలో జరిగిన బషీర్ బాగ్ కాల్పుల సమయంలో కేసీఆర్ ఆ పార్టీలో కీలకంగా ఉన్నారని గుర్తు చేశారు. నాటి రైతుల పరిస్థితులను గమనించిన కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం… ఉచిత విద్యుత్ తో పాటు రైతులపై నమోదైన అన్ని కేసులను హామీ ఇచ్చిందన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఎన్నికయ్యారని చెప్పారు. ప్రమాణస్వీకారం సందర్భంగా… ఉచిత విద్యుత్ ఫైల్ పై సంతకం చేశారని అన్నారు. ఉచిత్ విద్యుత్ తో పాటు నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని స్పష్టం చేశారు.

రైతులకు ఉచిత విద్యుత్ కోసం16 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రభుత్వం చెబుతున్నదని.. వాస్తవంగా చిన్న, సన్నకారు రైతులకు ఎనిమిది గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల ఫాంహౌస్ లు, భూములు ఉన్న ప్రాంతాల్లో 10 నుంచి 12 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు.ఉచిత విద్యుత్ పై బీఆర్ఎస్ తో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ఉచిత విద్యుత్ పథకం తీసుకు వచ్చిందే కాంగ్రెస్ అన్నారు. రైతులను అన్నివిధాలా ఆదుకొని, వ్యవసాయాన్ని పండుగ చేసింది కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ వల్లే ఈ రోజు తెలంగాణలో విద్యుత్ వెలుగులు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా 12 గంటలకు మించి ఉచిత విద్యుత్ సరఫరా కానప్పుడు.. 16 వేల కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

సీఎం కేసీఆర్.. ఉచిత విద్యుత్ పేరుతో.. ఆ బడ్జెట్ కింది కేటాయించిన నిధుల్లో సగం డబ్బు.. అంటే ఏడాదికి 8 వేల కోట్లు రూపాయలు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి.వాస్తవంగా కేసీఆర్ 24 గంటలవిద్యుత్ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. ఎక్కడా లేని రేటుకు తెలంగాణ విద్యుత్ కొనుగోలు చేస్తోందని, కేంద్రం మాట వినకుండా అధిక రేటుకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.

ఉచిత విద్యుత్‌తో పాటు రాయితీపై ఎన్నో వ్యవసాయ పనిముట్లు ఇచ్చింది. రాష్ట్రవిభజన తర్వాత విద్యుత్‌ విషయంలో నష్టం జరగకుండా కాంగ్రెస్‌ అధిష్ఠానం జాగ్రత్తలు తీసుకుంది. వినియోగం ఆధారంగా తెలంగాణకే ఎక్కువ విద్యుత్‌ వచ్చేలా సోనియాగాంధీ చర్యలు తీసుకున్నారు. జనాభా ప్రాతిపదికన పంచితే తెలంగాణకు 38 శాతం మాత్రమే విద్యుత్ దక్కేది.

దాంతో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు తెలంగాణ లో చీకట్లు కమ్ముకునేవి. దీంతో జనాభా ప్రాతిపదికన కాకుండా, వినియోగం ఆధారంగా విద్యుత్ కేటాయించారు. అందుకే తెలంగాణకు 53శాతం, ఏపీకి 47 శాతం విద్యుత్‌ కేటాయించారు. ఇందుకోసం అప్పటి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు కృషి చేశారు అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని అప్పట్లో కేసీఆర్ గొప్పగా చెప్పారు. 2.60 పైసలకే విద్యుత్ ప్లాంట్లు ఇస్తామని … ప్లాంట్ల ఏర్పాటు విరమించుకోవాలని అప్పటి కేంద్రం విద్యుత్ మంత్రి పీయూష్ గోయెల్ చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏ ప్లస్ గ్రేడ్ ఉన్న డిస్కంలు.. కేసీఆర్ పాలనలో సీ మైనస్ కు పడిపోయాయి.

కాంగ్రెస్ హయాంలో మొదటి పది స్థానాల్లో ఉన్న డిస్కంలు… కేసీఆర్ హయాంలో చివరి పడిస్తానాల్లోకి పడిపోయాయి. 24 గంటల ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ కు ఎలాంటి శశభిషలు లేవు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరుతామన్నారు రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 17న మా మేనిఫెస్టోలో ప్రకటిస్తాం..ఉచిత విద్యుత్ ముసుగులో ఏడాదికి 8వేల కోట్లు దోచుకుంటున్నారు. పవర్ ప్లాంట్ల విషయంలో కేసీఆర్ 45వేల కోట్లకు టెండర్లు ఇచ్చి అందులో అవినీతికి పాల్పడ్డారు. దోపిడీలు చేసి ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ ను రద్దు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి.

” అన్ని సబ్ స్టేషన్ల లాక్ బుక్కులు సరెండర్ చేయాల్సిందిగా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. కేటీఆర్ , హరీష్ ను సూటిగా అడుగుతున్నా..24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై కోమటిరెడ్డి, జీవన్ రెడ్డి ఇచ్చిన సవాల్ ను స్వీకరించండి” అని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. మీ అసలు నిజం బయటపడుతుందనే బీఆరెస్ నిరసనల డ్రామాలు చేస్తుందని విమర్శించారు.

“కరీంనగర్ చౌరస్తాలో గుమ్మికింద పందికొక్కు నన్ను ఉరి తీస్తా అని మాట్లాడుతుండు… నేను చంద్రబాబు శిష్యుడినని చెబుతున్నారు. మరి కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారు? చంద్రబాబు దగ్గర చెప్పులు మోసిన మీరా నా గురించి మాట్లాడేది” రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

“27 లక్షల 50వేల మోటార్లకు రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు బిగించబోతుంది. ఇది నిజం కాదని చెప్పడానికి మీలో ఎవరు వస్తారు?” అని బీఆర్ఎస్ నాయకులకు సవాల్ చేశారు. జూలై 2 న ఖమ్మం సభతో మేం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తే… నిన్న నిరసనలతో బీఆరెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభించిందన్నారు.

“బీఆర్ఎస్‌కు కాంగ్రెస్సే ప్రత్యర్థి, ప్రతిపక్షం అని ఆ పార్టీ చేపట్టిన నిరసనలు, ధర్నాలతో తేలిపోయిందని మరోసారి రేవంత్ స్పష్టం చేశారు. 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 80 శాతం ఎమ్మెల్యేలు ఓడిపోతారని సర్వే రిపోర్టులో తేలిందని రేవంత్ సంచలన విషయాన్ని బయటపెట్టారు. అంతేకాదు.. గులాబీ బాస్, సీఎం కేసీఆర్ కూడా గజ్వేల్‌లో ఓడిపోతారని సర్వేల్లో తేలిందని రేవంత్ చెప్పుకొచ్చారు. అందుకే కేసీఆర్ పక్క నియోజకవర్గాలను వెతుక్కుంటున్నారని రేవంత్ తెలిపారు.

బీఆర్ఎస్‌లో ఇప్పుడున్న సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తానని కేసీఆర్ ఎందుకు చెప్పడం లేదు..? అని రేవంత్ ప్రశ్నించారు. మగాళ్లు అయితే సిట్టింగ్‌లకే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని లేకుంటే మాడా అని ఒప్పుకోవాలని” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

24 గంటల విద్యుత్ పై గతంలో సీబీఐ విచారణ కోరిన లక్ష్మణ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎం లా మారిందని ఆరోపణలు చేసిన మోడీ, అమిత్ షా.. కాళేశ్వరం అవినీతిపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు.

LEAVE A RESPONSE