-బీజేపీలోకి వైసీపీ నాయకుల చేరిక
-కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే సుజనాచౌదరి
పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్ కు చెందిన వైసీపీ నాయకులు మంగళవారం పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) సమక్షంలో బిజెపిలో చేరారు. వైసీపీ నాయకుడు యలకల అనిల్ ఆధ్వర్యంలో 50 మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి సుజనా చౌదరి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎమ్మెల్యే సుజనా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల వైసీపీ అరాచక పాలన అంతమైందన్నారు. ఇది పనిచేసే ప్రభుత్వం. ఎన్డీయే కూటమి గెలుపుతో రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొస్తామని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ పాలన ఉంటుందన్నారు.
ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ సహకారంతో భారతీయ జనతా పార్టీలో చేరినట్లు నాయకులు కుంభ రమేష్ తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కటింగ్ నిర్వహించి స్థానిక మహిళలకు చీరలు ,దుప్పట్లు, పంపిణీ చేశారు. కార్యక్రమంలో యలకల అనిల్, నాగరాజు, రెడ్డిపల్లి రాజు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.