-టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
సీఎం కాన్వాయ్ కోసం RTA అధికారులు ఒంగోలులో ప్రజల కారు లాక్కెళ్ళడం రాష్ట్రం లో దౌర్భాగ్యపు పాలనకు నిదర్శనం. కుటుంబంతో తిరుమల దర్శనానికి వెళ్తున్న వినుకొండ వాసి వేముల శ్రీనివాస్ వాహనాన్ని, రవాణా శాఖ అధికారులు బలవంతంగా తీసుకు వెళ్ళడం దారుణం. భార్యా, పిల్లలతో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డున దింపేసే హక్కు ఈ అధికారులకు ఎవరిచ్చారు? సీఎం కాన్వాయ్ కోసం కారు పెట్టుకోలేని స్థితికి రాష్ట్రం ఎందుకు వెళ్ళింది? ప్రభుత్వ అధికారులే ఇలాంటి చర్యలకు పాల్పడడం ద్వారా ప్రజలకు ఏమి చెప్పాలి అనుకుంటున్నారు? సీఎం వస్తే షాప్స్ మూసేయడం…. సిఎం కాన్వాయ్ కోసం వాహనదారుల కార్లు లాక్కెళ్ళడం సిగ్గుచేటు.ఇది కూడా చదవండి.. సీఎం వచ్చారంటే.. జనం చచ్చారంతే!