- సీఎం తమ నాయకుల తప్పుడు పనులను సమర్ధిస్తున్నందున పదేపదే తప్పులు
- అరగంట కావాలన్న అవంతికి మంత్రిపదవి తీసేసి గంట కావాలన్న అంబటికి మంత్రి పదవా?
- 15 లక్షల మంది గోరంట్ల మాధవ్ ని అత్యున్నత పార్లమెంటులో కూర్చోపెట్టింది బట్టలు లేకుండా న్యూడ్ విడియో కాల్స్ మాట్లడటానికా?
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా
సీఎం తమ నాయకుల తప్పుడు పనులను సమర్ధిస్తున్నందునే మిగతా నాయకులు పదేపదే తప్పులు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా విమర్శించారు. శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దేశంలోని ప్రజాస్వామ్య వాదులు, మహిళా సంఘాలు ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ విడియో చూసి ఏమిటి మాకు ఈ దౌర్భాగ్య పరిస్థితి అంటున్నారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి నైతిక విలువలు అస్సలు లేవు అంటున్నారు. ఉంటే.. అరగంట కావాలన్న మంత్రి అవంతి శ్రీనివాస్ కి మంత్రి పదవి తీసేసి గంట కావాలన్న అంబటి రాంబాబుకు మంత్రి పదవిని కట్టబెడతారా? గోరంట్ల మాధవ్ చేసిన నీచపు పనిని జగన్ రెడ్డి ఎందుకు సమర్ధిస్తున్నారు? వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు పనులను ముఖ్యమంత్రి సమర్ధిస్తున్నారు కాబట్టే వారు పదేపదే సమాజం సిగ్గు పడే విధంగా తప్పులు చేస్తున్నారు. దేశం, రాష్ట్ర మహిళలు ఇటువంటి వీడియోలు చూసి సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, మహిళా కమీషన్, రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నా, ఖండిస్తున్నా ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు. మహిళల పట్ల తప్పుగా ప్రవర్తించిన గోరంట్ల మాధవ్ పై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ముఖ్యమంత్రి తాను చేసిన తప్పలకు మించి వారి నాయకులు చేయలేదని భావిస్తున్నారా? గోరంట్ల మాధవ్ మాట్లడిన న్యూడ్ విడియో కాల్ నిజమని, ఒరిజనల్ అని జగన్ మోహన్ రెడ్డి మనస్సాక్షికి తెలుసు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ రెడ్డికి ఆ విడియో గోరంట్ల మాధవ్ దే అని ఇంటెలిజెన్సి రిపోర్ట్ వచ్చినా కూడ ఎంపీని వెనకేసుకురావడంలో ఆంతర్యం ఏమిటి? ఏ రాజకీయ పార్టీలోనైనా నాయకులు తప్పు చేసినపుడు అధినాయకులు చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఆ రాజకీయ పార్టీలోనివారు తప్పులు చేయడానికి భయపడతారు. దేశ రాజకీయ వ్యవస్థలో చిన్న అభియోగం వస్తేనే రాజీనామ చేసిన రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు. నేడు గోరంట్ల మాధవ్ కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ విడియోని కేంద్ర ఫోరెన్సీక్ ల్యాబ్ కు పంపించి రిపోర్టు తెప్పించగలరా అని సవాల్ విసిరారు. న్యూడ్ విడియో విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ పై ఎందుకు కేసు నమోదు చేయలేదు? ముఖ్యమంత్రికి మహిళల పట్ల చిత్తశుద్ధి లేదు అని దీన్ని బట్టి అర్థమౌతోంది. ఇటువంటి నీచ పనులు చేసే వ్యక్తులను నేను క్షమించను అని జగన్ నోటి వెంట రాదు ఎందుకు? తప్పు చేసిన గోరంట్ల మాధవ్ కంటే తప్పును సమర్థిస్తున్న ముఖ్యమంత్రిదే పెద్ద తప్పు. అచ్చోసిన ఆంబోతుల్లా వ్యవహరిస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మేల్యేలను సమర్దించుకుంటూ వస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తుదకు పాశ్చాత్తాప పడతారు.
ఇతర రాజకీయ నాయకుల తప్పులను భూతద్దంలో చూసే సీఎం తమ ఎంపీ విషయంలో వివక్షత ఎందుకు? నేడు గోరంట్ల మాధవ్ ను వెనుక నుండి జగన్ రెడ్డి మాట్లాడిస్తున్నాడనేది వాస్తవం అని ఎద్దేవా చేశారు. ఒరిజినల్ వీడియో ఉంది. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోను మరో సెల్ తో విడియో తీసి వైరల్ చేశారు అని ఎస్పీ మాట్లాడడం విడ్డూరంగా ఉంది. అది ఒరిజినల్ అవునో కాదో తెలియడానికి ఒరిజినల్ విడియో కావాలని ఎస్పీ అనడం నిందితుడిని రక్షించే క్రమమే. తెలుగుదేశం పార్టీ వాళ్లు ఏదైనా చిన్న పోస్టు పెట్టినా వెతికి వెతికి పట్టుకుంటున్నారు. ఎంపీ ఒరిజినల్ విడియోని జగన్ రెడ్డి ప్రభుత్వం పట్టుకోలేదా?. ఒరిజినల్ విడియోని సంపాదించాలంటే సమయం పడుతుంది, వెతుకుతున్నాం అని ఎస్పీ పకీరప్ప చెప్పటం కాలయాపన కోసమే. గోరంట్ల మాధవ్ మాత్రం నిజం తేలిపోయినట్టు కడిగిన ముత్యంలా బయటికి వచ్చినట్టు కితాబిచ్చుకుంటున్నారు. బురద నుండి వచ్చిన గేదెను కడిగితే వచ్చిన గేదెలా గోరంట్ల మాధవ్ మాట్లాడుతున్నాడు. విడియోలో ముందు కనపడుతుంటే జిమ్ చేసిన వీడియోని వెనుక నుంచి చూపించి మార్ఫింగ్ చేశారని కప్పిప్పుచ్చుకుంటున్నారు. జిమ్ వీడియోని చూపించుకోవడానికి నువ్వేమైనా హృతిక్ రోషన్ అనుకుంటున్నావా? గోరంట్ల మాధవ్ చేసిన పనికి అతని కుటుంబం తలెత్తుకొని తిరగగలదా అని ప్రశ్నించారు. 15 లక్షల మంది గోరంట్ల మాధవ్ ని అత్యున్నతమైన పార్లమెంటులోకూర్చోపెట్టింది బట్టలు లేకుండా న్యూడ్ విడియో కాల్స్ మాట్లడటానికా? బిసిని అని చెప్పకుంటున్న గోరంట్ల మాధవ్ ను బీసీలే ఛీదరించుకుంటున్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ దేశంలో ఏ పౌరుడు తప్పు చేసినా ఒకే సెక్షన్ పెట్టాడు. బీసీలకు ఒక న్యాయం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మరో న్యాయం లేదు. గోరంట్ల మాధవ్ బిసి అని చెప్పుకుంటూ అతను చేసిన పనికి బిసి లంతా తల దించుకుంటున్నారు. అవకాశం వచ్చిన బిసికి చెందిన ఎంపీ వ్యవహరించిన తీరు చూస్తే బిసిలను సమాజం ఏమంటుంది? దయచేసి బిసి అని చెప్పుకోవద్దని బీసీ నాయకులు చెబుతున్నారు.
ఏబీయన్ రాధాకృష్ణా, టివి5 బి.ఆర్. నాయుడు, చంద్రబాబు నాయుడు, లోకేష్ లను మాధవ్ పరుష పదాలు మాట్లాడుతున్నాడు. మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు అనేక సార్లు మాకు ఎదుటి వారు ఎలా మాట్లాడిన ప్రజాస్వామ్య బద్ధంగా మాట్లాడాలని చెబుతారు అందుకే ఆ బాష మాట్లాడటానికి కూడ మా వల్ల కావడం లేదన్నారు. ఈనాడు రామోజీ రావు, ఏబీయన్ రాధాకృష్ణా, టివి5 బి.ఆర్. నాయుడు, చంద్రబాబు నాయుడు, లోకేష్, తెలుగుదేశం పార్టీ నాయకులని ఎంత తిడితే అంత ప్రమోషన్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని వైసీపీ నాయకులు వారిని విమర్శించడానికి ఎగబడుతున్నారు. నేడు దేశ వ్యాప్తంగా ప్రజలు ముఖ్యమంత్రి ఎందుకు ఇటుంటి వారి పై స్పందించడం లేదని చర్చించుకుంటున్నారు. జగన్ రెడ్డి తప్పు చేసిన మాధవ్ పై చర్యలు తీసుకొంటే ప్రజలు హర్షిస్తారు. ఎంపీ పై చర్యలు తీసుకోకుంటే ముఖ్యమంత్రి అభాసుపాలవుతాడు. ఎంపీ మీద చర్యలు తీసుకోలేనపుడు తప్పు చేసిన సామాన్యుడి మీద ఏ విధంగా చర్యలు తీసుకొంటారు? బూతులు మాట్లాడుతున్న నాయకులు, మంత్రులకు తప్పని చెప్పకపోతే సామాన్య ప్రజలు కూడ ఆ భాష మాట్లాడతారు.
151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీలని ఇస్తే ముఖ్యమంత్రి చేసే నిర్వాకం ఇదా? ముఖ్యమంత్రి నేరస్తులని కాపాడటమే పనిగా పెట్టుకున్నాడు. సొంత బాబాయిని హత్య చేసిన వారిని కూడ రక్షించే పనిలో జగన్ రెడ్డి ఉన్నారు . వైసీపీ లో ఎవరు తప్పు చేసినా జగన్ రెడ్డి వారికి అండగా నిలబడుతున్నాడు. పృధ్వీ ఫోన్ లో అన్న మాటకి జగన్ రెడ్డి అతని పై చర్యలు తీసుకొని, అవంతి శ్రీనివాస్, అంబంటి రాంబాబు, గోరంట్ల మాధవ్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? జగన్ రెడ్డి తప్పుల్ని సమర్థించి, తెలుగుదేశం పార్టీ నాయకులని నోటికొచ్చినట్టు తిట్టే నాయకులు ఎన్ని తప్పులు చేసినా వారిని క్షమించే ధోరిణిలో జగన్ రెడ్డి ఉన్నాడు. నేడు పార్లమెంటుకి మాధవ్ వెళితే 539 మంది సభ్యులు కూడ ఉమ్మేసే పరిస్ధితి ఉంది. ప్రజల్లోకి మాధవ్ ఏ మోహం పెట్టుకొని వెళ్తున్నాడు? అనే భావం ప్రజల్లో కలుగుతుంది. గోరంట్ల మాధవ్ తప్పు చేశాడని పార్లమెంటు స్పీకర్ కు లేఖ రాయాలన్నారు. గోరంట్ల మాధవ్ నోటిని అదుపులో పెట్టుకోవాలి. దేశ వ్యాప్తంగా ఉన్న మహిళలు అందరికి గోరంట్ల మాధవ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. జగన్ రెడ్డి ఇటువంటి వాళ్ళ పై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలే సమాధానం చెబుతారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా హెచ్చరించారు.