Suryaa.co.in

Andhra Pradesh

ఎవరు ఎవరింటికి వెళ్లినా 2024లో చంద్రబాబు, పవన్‌లు ఇంటికెళ్లటం ఖాయం

– పవన్, చంద్రబాబు విడివిడిగా జీవిస్తున్నా.. కలిసే ఉన్నారు
– చంద్రబాబు లోకేశ్ ఇంటికి వెళ్తే వార్త అవుతుందా? కాదు కదా
– అలాగే, చంద్రబాబు పవన్ కల్యాణ్‌ ఇంటికెళ్తే వార్త ఎలా అవుతుంది
– చంద్రబాబు, పవన్ బంధాలు ఫెవికాల్ బంధాలు, ప్యాకేజి బంధాలు
– అధికారం పోతే రాష్ట్రంలో ఉండలేమన్నది చంద్రబాబు, పవన్‌ ఫిలాసఫీ
– 2024 తర్వాత వారి శాశ్వత నివాసం హైదరాబాదే
-వలంటీర్ వ్యవస్థపై ఇష్టానుసారం చంద్రబాబు, పవన్‌ ఆరోపణలు
– వలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చంద్రబాబు, పవన్‌ల కుట్ర
– వివేకానంద హత్య కేసులో సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది
– సీబీఐ చార్జిషీట్లనే జడ్జిమెంట్లుగా ఎల్లో మీడియా వక్రీకరిస్తోంది
-ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రధాని మోడీని చంద్రబాబు విమర్శించినప్పుడు కన్నా ఏం చేశారు?
– సత్తెనపల్లిలో ఏదో జరిగిపోతోందని కన్నా హడావుడి
– కన్నా వస్తాద్‌ కాదు.. బిచ్చగాడు
– బూతులు తిట్టడంలో కన్నాకు గిన్నీస్ రికార్డ్ ఇవ్వొచ్చు
– రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు 

పవన్, చంద్రబాబు విడివిడిగా జీవిస్తున్నా.. కలిసే ఉన్నారు
హైదరాబాద్‌లో చంద్రబాబు వెళ్లి పవన్‌ కల్యాణ్‌ కలవబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వారే పచ్చ మీడియాకు లీకులు ఇచ్చినట్లు ఉన్నారు. చంద్రబాబు లోకేశ్‌ ఇంటికి వెళ్తే వార్త అవుతుందా? అలాగే, చంద్రబాబు పవన్ కల్యాణ్‌ ఇంటికి వెళ్తే వార్త ఎలా అవుతుంది.
వీళ్లిద్దరికీ (చంద్రబాబు, పవన్ కల్యాణ్‌) ఇంటికి రహస్య మార్గాలు ఎప్పుడో ఉన్నాయి. ఎప్పటి నుంచో వీరిద్దరూ మంతనాలు చేసుకుంటూనే ఉన్నారు. వీరిద్దరూ విడివిడిగా జీవిస్తున్నా కలిసే ప్రయాణం చేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. దీన్ని ఏదో విధంగా పెద్ద వార్త చేయాలని ఎల్లో మీడియా, చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు.

పవన్, చంద్రబాబుకు స్వరాష్ట్రంలో ఇళ్లే లేవు
వలంటీర్ల వ్యవస్థపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడది ఒకరినొకరు వత్తాసులా?
రాష్ట్రం విడిపోయి సుమారు పదేళ్లు అవుతోంది. వీళ్లకు హైదరాబాద్‌లో ఇళ్లు తప్ప ఇద్దరికీ స్వరాష్ట్రంలో సొంత ఇళ్లు లేవు. హైదరాబాద్‌లో నివాసం ఉంటారు. రహస్యంగా కలుసుకుంటారు. ఒకరికొకరు వత్తాసు పలుకుతూ ఉంటారు.

రామోజీ డైరెక్షన్‌లో చంద్రబాబు నిర్మాతగా వలంటీర్ల వ్యవస్థ మీద ఇష్టమొచ్చినట్లు పవన్‌ మాట్లాడారు. ఆ మాట్లాడిన తర్వాత చంద్రబాబు పవన్‌కు వత్తాసుగా బయల్దేరారు. కోర్టుకు వెళ్లి పరువు నష్టం దావా వేశారు. అవసరమైతే నన్ను జైల్లో పెట్టుకోండి అని పవన్ కల్యాణ్‌ మాట్లాడుతున్నారు. ఒక వ్యవస్థ మీద అనవసరంగా దుర్భాషలాడితే.. వారి పరువును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?
వలంటీర్ వ్యవస్థ మీద ఇష్టానుసారం చంద్రబాబు, పవన్‌లు ఆరోపణలు చేస్తున్నారు
వలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చంద్రబాబు, పవన్‌ల కుట్ర
ఉమెన్ ట్రాఫికింగ్‌కు వలంటీర్ల వ్యవస్థ పనిచేస్తోందని పవన్‌ కల్యాణ్‌ పరోక్షంగా అన్నారు. ఇప్పుడు అదంతా పోయి డేటా అంటున్నారు. గతంలో వలంటీర్ల వ్యవస్థపై మూటలు మోసే ఉద్యోగం, భర్తలు లేనప్పుడు వెళ్లి వలంటీర్లు తలుపులు కొడుతున్నారని చంద్రబాబు అన్నారు. ఈ వలంటీర్ల వ్యవస్థ సమాజంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తోంది కాబట్టి.. ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని కుట్రతో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ చేస్తున్నారు.
వివేకానంద హత్య కేసులో సీబీఐ చార్జిషీటు మాత్రమే దాఖలు చేసింది.
సీబీఐ చార్జిషీట్లలోని వాంగ్మూలాలను జడ్జిమెంట్లుగా ఎల్లో మీడియా వక్రీకరిస్తోంది
వలంటీర్ల వ్యవస్థ కాకపోతే.. వివేకానంద రెడ్డి హత్యపై పవన్, చంద్రబాబు విమర్శలు చేస్తారు. వివేకానంద రెడ్డి హత్యపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. సీబీఐ చార్జిషీటులోని వాంగ్మూలాలనే జడ్జిమెంట్లుగా ఎల్లో మీడియా, చంద్రబాబు, పవన్‌ భావిస్తున్నారు. తద్వారా ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారు.
చంద్రబాబు ఇంటికి పవన్‌ వెళ్తే.. పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్తే వార్త ఎలా అవుతుంది?
చంద్రబాబు పవన్‌ ఇంటికి వెళ్లి కలిసినా? పవన్‌.. చంద్రబాబు ఇంటికి వచ్చి కలిసినా.. చివరికి ఇద్దరూ వెళ్లాల్సింది ఇంటికే. ఈ రాష్ట్రంలో సొంత ఇళ్లు కూడా లేని వ్యక్తులు ఎన్నికల తర్వాత హైదరాబాద్‌లో శాశ్వతమైన తమ ఇళ్లకు వెళ్లే పరిస్థితి వస్తుంది. మా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండని పవన్‌ కల్యాణ్‌ అంటాడు. పాతికో, పరకో కక్కుర్తి పడతాడు. ఆయన ఇంటికి పిలిపించుకుంటాడు. ఈయన ఆయన్ని ఇంటికి వెళ్తాడు. బేరసారాలు ఆడతారు. అక్కడ నాలుగు సీట్లు తీసుకుని ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామో ఫోజులో ఒకరోజు మాట్లాడతారు.

రెండో రోజు మా ప్రభుత్వం లేకపోయినా పర్వాలేదు. మా ప్రభుత్వాన్ని ఎన్నుకోరని, నేను గెలవని కూడా తెల్సని పవన్ అంటాడు. చిత్ర విచిత్రంగా మాట్లాడే పరిస్థితుల్లో టీడీపీ, జనసేన పార్టీలున్నాయి. టీడీపీ, జనసేనలను నమ్మి ప్రజలు ఓట్లు వేయరు. తిరిగి మళ్లీ జగన్ మోహన్‌ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. వీళ్ల (పవన్‌ కల్యాణ్‌) ఇంటికి వాళ్లు.. (చంద్రబాబు) వాళ్లింటికి (చంద్రబాబు) వీళ్లు (పవన్‌) వెళ్లి ఏదో గందరగోళం జరిగిపోతుందనే ఒక రాజకీయ వాతావరణం కల్పించి లబ్ది పొందాలని తాపత్రయపడే వ్యక్తులు చంద్రబాబు, పవన్. చంద్రబాబు అలిగి లోకేశ్‌ ఇంటికి వెళ్లికపోతే అది వార్త. చంద్రబాబు అలిగి పవన్ కల్యాణ్‌ ఇంటికి వెళ్లకపోతే అది వార్త. వాళ్లింటికి.. వీళ్లు వెళ్లినా.. వీళ్ల ఇంటికి వాళ్లు వెళ్లినా అది వార్త కాదు అనేది నాకున్న అవగాహన.

ప్రభుత్వ సభల్లో మోడీని చంద్రబాబు తిట్టారు. కాస్త పాత పేపర్లు తిరగెయ్ కన్నా..
ప్రభుత్వ సొమ్ముతోనే.. టీడీపీ కార్యకర్తలను పోలవరం తీసుకెళ్లి బాబు భజన చేసిన సంగతి గుర్తు చేసుకో
ఇటీవల కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ ఆఫీసులో మీడియా సమావేశంలో విమర్శలు చేశారు. ప్రభుత్వ డబ్బుతో మీటింగ్‌లు పెట్టి వ్యక్తిగతంగా చంద్రబాబును, పవన్‌ కల్యాణ్‌ను సీఎం జగన్‌ మోహన్ రెడ్డి దూషణలు చేస్తున్నారని కన్నా అన్నారు. అలా ప్రభుత్వ ఖర్చుతో మీటింగ్ పెట్టి వ్యక్తిగతంగా దూషించటం తప్పుని కన్నా అన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ డబ్బులతో మీటింగ్‌లు పెట్టి ప్రధాని మోడీని తిట్టినప్పుడు కన్నా ఏమయ్యాడు.

అలా చంద్రబాబు మోడీని తిట్టిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. కావాలంటే పాత పేపర్లు చూడు కన్నా. కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి.. బస్సుల్లో టీడీపీ కార్యకర్తలను పోలవరం తీసుకెళ్లి చంద్రబాబు.. చంద్రబాబు అని భజన చేయించారు. తెలిసి మాట్లాడుతున్నావా.. తెలియక మాట్లాడుతున్నావా కన్నా. సుదీర్ఘకాలం మంత్రిగా చేసిన వ్యక్తి హద్దు మీరి మాట్లాడటం ఏంటి? వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును వెయ్యి రెట్లు పెంచటానికి జగన్ వచ్చారని ప్రజలు అనుకుంటున్నారు. వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు కొత్త సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించి అమలు చేస్తున్నారు.

కన్నా వస్తాద్‌ కాదు.. బిచ్చగాడు
సత్తెనపల్లిలోని స్థానిక అంశాల్లో నాపైన కన్నా విమర్శలు చేశారు. రూ.34 కోట్లతో కేంద్రీయ విద్యాలయానికి 500 మీటర్ల రోడ్డుకు అంబటి రాంబాబు కృషి చేయట్లేదని కన్నా అన్నారు. టీడీపీకి చెందిన పచ్చల నాగేశ్వరరావు కేంద్రీయ విద్యాలయానికి చెందిన పేరెంట్స్‌ కమిటీతో వచ్చి మెమొరాండం ఇచ్చారు. అప్పుడే కలెక్టర్‌తో మాట్లాడి రూ.40 లక్షలు మంజూరు చేయించాను.
ఇంత బ్రహ్మాండంగా స్పందిస్తే బురద చల్లటం ఏమిటి కన్నా లక్ష్మీనారాయణ. కేంద్రీయ విద్యాలయం పక్కనే ఉన్న ఎస్సీ గురుకుల పాఠశాలకు 20 లక్షలు మంజూరు చేయించాను. అసలు ఆ కేంద్ర విద్యాలయం ఇంకా ప్రారంభమే కాలేదు. అది ప్రారంభం అయ్యే నాటికి రోడ్డు ప్రారంభిస్తాం. ఇవన్నీ తెల్సుకోకుండా కేంద్రీయ విద్యాలయానికి సత్తెనపల్లి రోడ్ల మీద బిచ్చమెత్తుతాను అని కన్నా అనటం ఏమిటి? టీడీపీ కార్యకర్తల్లారా.. కన్నా వస్తాద్‌ కాదు.. బిచ్చగాడు. జోలిపట్టి డబ్బులు అడుగుతాడట. నా మీద బురద చల్లి లబ్ది పొందాలని కన్నా అనుకుంటున్నారు.

పోలీసు వ్యవస్థ మీద కన్నా బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు
సత్తెనపల్లిలో గంజాయి అమ్మకాలు సహించేది లేదు
సత్తెనపల్లిలో గంజాయి అమ్మే పరిస్థితి లేదని తనకున్న సమాచారమని అంబటి అన్నారు. దీనిపై టీడీపీ వారికి ఏమైనా సమాచారం ఉంటే పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వండి. పోలీసులు చర్యలు తీసుకుంటారు. గంజాయి, దొంగ సారా అమ్మకాలను ఎట్టి పరిస్థితిల్లో సహించనని నియోజకవర్గంలో ప్రతి పౌరుడికి, టీడీపీ వారికి తెల్సు. టీడీపీ కౌన్సిలర్‌ను గంజాయి తాగి గుద్దారని కన్నా ఆరోపించారు.
గుద్దితే కనీసం కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. దానికి కారణం పోలీసు వ్యవస్థ మీద బురద చల్లాలని కన్నా అనుకున్నారు. డీఎస్పీ మా ఇంట్లో గుమస్తాగా పనిచేస్తున్నారని కన్నా ఆరోపించారు. ఇక్కడున్న డీఎస్పీ అవినీతిలేని వ్యక్తి. ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. లా అండ్ ఆర్డర్‌ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, డీఎస్పీకి ఉంది.

లా అండ్ ఆర్డర్ ఉల్లంఘిస్తే మా పార్టీ వారైనా ఉపేక్షించలేదు
కుటుంబ తగాదాల్లో పోలీసులు కేసు నమోదు చేశారు
కుటుంబ తగాదాలో వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన వ్యక్తులపై పోలీసులు కేసులు పెట్టారు. ఆ కేసులో సహాయం చేయమని నన్ను దూద్‌కే అనే మా పార్టీ వ్యక్తి కోరారు కూడా. చేయను అని చెప్పాను. ఇటీవల ఒక కుటుంబంలో తగాదాలు ముగ్గురిని హత్య చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు తప్పు చేసినా ఉక్కుపాదంతో అణచివేయటం ఈ ప్రభుత్వ ఉద్దేశ్యం, రాంబాబు ఉద్దేశ్యం కూడా. ఏ పార్టీ వాళ్లపైనా పోలీసులు అన్యాయంగా కేసు పెట్టలేదు.
ఒకవేళ టీడీపీలో దూద్‌కే చేరితే చేర్చుకో కన్నా. సందు దొరికిందని ఏదో ఒకమాట మాట్లాడుతున్నారు. అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. పోలీసు వ్యవస్థను గుమస్తాలుగా వాడుకోవాల్సిన దుర్బుద్ధి లేదు. అలాంటి పోలీసులు కూడా ఎవ్వరూ లేరు. మాజీ మంత్రి అయిన కన్నాకు ఈగో సమస్య వచ్చింది. డీఎస్పీ మాట వినటం లేదని పోలీసు వ్యవస్థను డీమోరల్ చేయాలని చూస్తున్నారు.

బూతులు తిట్టడంలో కన్నాకు గిన్నీస్ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం ఇవ్వొచ్చు
చంద్రబాబును, రాయపాటిని కమ్మవారిని బూతులు తిట్టిన కన్నాకు గిన్నీస్ బుక్‌ ఆఫ్ రికార్డ్స్ ఇవ్వొచ్చు. అంత భయంకరంగా కన్నా బూతులు తిడతారు. ఘాటు విమర్శలు చేస్తాను తప్ప బూతులు తిట్టనని అంబటి అన్నారు. గుంటూరులో పీఆర్‌పీకి ఓట్లేసినందుకు కాపులను కన్నా బూతులు తిట్టాడు. నా గురించి మాట్లాడే నైతిక అర్హత కన్నాకు లేదు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించం. రౌడీయిజాన్ని సత్తెనపల్లిలో ఉపేక్షించం అని అంబటి స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE