– రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు
– రాష్ట్రంలో మొట్ట మొదటి ” స్లీప్ తెరపెటిక్స్ ” కేంద్రాన్ని జూబ్లీహిల్స్ లో ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
– పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్, శాసన మండలి చీఫ్ విప్ భాను ప్రసాద్ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే దానం నాగేందర్
గురక నిద్ర అనారోగ్యానికి దారితీస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.ఆదివారం ఫిలిం నగర్, జూబ్లీహిల్స్ లో రాష్ట్రంలోనే మొట్ట మొదటి ” స్లీప్ తెరపెటిక్స్ ” కేంద్రాన్ని హరీష్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గురక నిద్ర అనేక అనర్థాలకు దారి తీస్తుందని అన్నారు. దీంతో పాటు నిద్ర రాకపోవడం, నిద్రలో నడవడం, అతిగా నిద్ర పోవడం వంటి సమస్యలకు ” స్లీప్ తేరపెటిక్స్ ” కేంద్రం ఎంతో ఉపయోగ పడుతుందని హరీష్ రావు తెలిపారు.
గురక నిద్ర, నిద్ర లేమీ సమస్యలు ప్రతి ఒక్కరికీ ఇబ్బంది కలిగిస్తోందని, స్లీప్ తెరపెటిక్స్ కేంద్రంలో చక్కని పరిష్కారం దొరుకుతుందని, ఈ కేంద్రం ఫౌండర్ – కం – డైరెక్టర్ డాక్టర్ హర్శిని ప్రతీక్ వినూత్న ఆలోచనలకు రూప కల్పన చేశారని హరీష్ రావు అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, శాసన మండలి చీఫ్ విప్ టీ. భాను ప్రసాద్ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ వెంకటేష్, ఐ.ఎం.ఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బీ.ఎన్. రావు, పల్మాలాజిస్ట్ లు డాక్టర్ విజయ్ కుమార్ , డాక్టర్ శుభాకర్, డాక్టర్ పవన్, స్లీప్ THERAPEUTICS ఫౌండర్, డైరెక్టర్ డాక్టర్ హర్షిని ప్రతీక్, తదితరులు పాల్గొన్నారు.