Suryaa.co.in

Andhra Pradesh

గొంగడి పట్టిన చేతులతోనే వైసీపీని గోతిలో పెట్టడం ఖాయం

పెద్దిరెడ్డి ఎన్ని అరాచకాలు చేసినా ఓడిపోవడం ఖాయం

-టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్

గొంగడి పట్టిన చేతులతోనే వైసీపీని గోతిలో పెట్టడం ఖాయం. యాదవులను, యాదవ కులవృత్తిని అవమానించిన వైసీపీ నేతలకు యాదవుల గురించి మాట్లాడే అర్హత లేదు.

అహంకారంతో పుంగనూరులో బీసీ నాయకుడు రామచంద్ర యాదవ్‌పై దాడి చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యాదవులతో ఏవిధంగా సమావేశం పేడతారు? వైసీపీ వేధింపులకు బలైంది యాదవులు కాదా? పుంగనూరులో పెద్దిరెడ్డికి చెందిన శివశక్తి డైయిరీ ద్వారా యాదవుల నుంచి పాలు సేకరించి లీటర్‌కు రూ.20 మాత్రమే ఇచ్చి కష్టాన్ని దోచుకుంది మీరు కాదా? తిరుమల వెంకటేశ్వరస్వామి తొలి దర్శన భాగ్యం దక్కే యాదవులకు టీటీడీ ఛైర్మన్ ఎందుకు ఇవ్వలేదు? పుంగనూరులో పెద్దిరెడ్డిని గెలిపించాలంటూ యాదవులకు పిలుపునివ్వడం సిగ్గుచేటు.

టీడీపీ హయాంలో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదేళ్లలో గొర్రెలు, మేకల కొనుగోలుకు రుణాలు అందిస్తే.. వైసీపీ ప్రభుత్వం ఒక్కరికైనా రుణం ఇచ్చిందా? జీవాలకు నట్టల నివారణ కోసం ఏడాదికి నాలుగు సార్లు కార్యక్రమాలు నిర్వహిస్తే.. జగన్ రెడ్డి ఏడాదికి ఒక్కసారి నిర్వహించడం నిజం కాదా? వ్యాధి నిరోధక టీకాలు టీడీపీ హయాంలో ఉచితంగా వేయిస్తే ఇప్పుడు ఏకంగా రద్దు చేశారు. టీటీడీ ఛైర్మన్ పదవిని టీడీపీ యాదవులకు అప్పగిస్తే వైసీపీ ఏవ్వరికి ఇచ్చింది? జీవాల కొనుగోలు నుండి, వాటికి ఆహారం సరఫరా వరకు అన్ని రకాలైన సదుపాయాలు దూరం చేశారు. పెద్దిరెడ్డి ఎన్ని అరాచకాలు చేసినా ఓడిపోవడం ఖాయం

అనగాని సత్యప్రసాద్
టీడీపీ శాసనసభ్యులు

LEAVE A RESPONSE