– నర్సాపురంలో జగన్ రెడ్డి అసహనానికి కారణం ఇదేనా?
• బాబాయ్ కి బైబై చెప్పినంత తేలికకాదు జగన్ రెడ్డీ…. మా పెద్దాయనకి బైబై చెప్పడం
• జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ కాస్త “అరాచకప్రదేశ్” గా మారింది
• ప్రజల్లో నీకుఅంత ఆదరణే ఉంటే, రోడ్లకు ఇరువైపులా బారికేడ్లు, వేలాదిపోలీసులు ఎందుకు జగన్ రెడ్డీ?
• జగన్ రెడ్డి పాలనలో “ఏంఖర్మ- ఆంధ్రప్రదేశ్ కి” అంటున్న ఆర్బీఐ తాజా నివేదిక
– టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
రాష్ట్ర ముఖ్యమంత్రిలోని అసహనం, కోపం, ఈర్ష్యాద్వేషాలు పతాకస్థాయికి చేరాయని, చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ఏమారుమూల ప్రాంతానికి వెళ్లినా అక్కడ కనిపిస్తోన్న జనసునామీలే అందుకు కారణమని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎద్దేవాచేశారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే..
“చరిత్రలో ఎన్నడూ చూడనంతజనం కర్నూలులో చంద్రబాబు నాయుడి పర్యటనకువచ్చారు. సైకో ముఖ్యమంత్రి బాదుడు తట్టుకోలేకనే ప్రజలంతా ఏం ఖర్మ-ఈ రాష్ట్రానికి అంటూ మనోవేదనతో, గతంలో చంద్రబాబునాయుడి గారి సుపరిపాలన గుర్తుచేసుకొని తిరిగి ఆయనముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి మంచిరోజులు వస్తాయన్న ప్రగాఢవిశ్వాసంతోనే టీడీపీఅధినేతకు ఘననీరాజనాలు పలుకుతున్నారని అర్థమవుతోంది. నేడు నరసాపురంలో జరిగిన ముఖ్యమంత్రి సభకు ప్రజల్ని ఇళ్లనుంచి బలవంతంగా లాక్కొచ్చి, బస్సుల్లోకుక్కి తరలించినాకూడా ప్రజలుమధ్యలోనే బారికేడ్లుదూకి మరీపారిపోయారు. ముఖ్య మంత్రి, వైసీపీనేతలు చెప్పే అబద్ధాలువినలేక జనంపరుగులు పెడుతుంటే, పోలీసులు వారిని అడ్డుకోవడాని కి ప్రయత్నించారు.
తెలుగుదేశంపార్టీ చేపట్టబోతున్న ‘ఇదేంఖర్మ-మనరాష్ట్రానికి’ కార్యక్రమంపై జగన్ రెడ్డి తన అక్కసంతా వెళ్లగక్కాడు. ఏవర్గంవారిని పలకరించినా అందరినోటా ఒకటేమాట ‘ఇదేంఖర్మ-మనరాష్ట్రానికి’. చంద్ర బాబుకి బైబై చెప్పడానికి జనం సిద్ధంగాలేరు జగన్ రెడ్డీ… బాబాయ్ కి బైబై చెప్పినంత తేలికకాదు.. మా పెద్దాయనకి బైబైచెప్పడం అంటే. జగన్ రెడ్డీ…నిన్ను భూస్థాపితం చేసేవరకు చంద్రబాబునాయుడు గారు విశ్రమించరని గుర్తుపెట్టుకో. నాలుగుదశాబ్దాల సుధీర్ఘ రాజకీయం అనుభవంఉన్న వ్యక్తి, నిజాయితీ, నిబద్ధతలకు నిలువుటద్దం చంద్రబాబని తెలుసుకో జగన్ రెడ్డీ.
98శాతం హామీలు నెరవేరిస్తే, ప్రజలంతా నీ పక్కనుంటే నరసాపురం పట్టణంలోని ప్రతిసందులో బారికేడ్లు ఎందుకుపెట్టారో చెప్పు జగన్ రెడ్డీ? జగన్ రెడ్డికి బారికేడ్లపై ఉన్నమోజు చూసే ప్రజలంతా ఆయన్ని ముద్దుగా బారికేడ్ రెడ్డి అని పిలుస్తున్నారు. ఏరాష్ట్రంలో అయినా, ముఖ్య మంత్రి పర్యటనల్లో దుకాణాలు మూయిస్తున్నారా… బంద్ పాటిస్తున్నారా? కళాశాలలు, పాఠశాలలు, దుకాణాలు మూయించి అప్రకటితకర్ఫ్యూ అమలుచేస్తూ, యుద్ధవాతావరణం సృష్టిస్తున్నారా?
ముఖ్యమంత్రికి ప్రజల్లోకి రావడానికి ఎందుకంతభయం? రాష్ట్రాన్ని అరాచకప్రదేశ్ గా మార్చారు కాబట్టే భయప డుతున్నారు. జగన్ రెడ్డి అరాచకం, జేట్యాక్స్ దందా భరించలేకనే, చంద్రబాబు రాయలసీమకు తీసుకొచ్చిన జాకీపరిశ్రమ రాష్ట్రంవదిలిపారిపోయింది. అదేనా జగన్ రెడ్డీ…తమరి అద్భుతమైన పరిపాలన?
ఆంధ్రప్రదేశ్ అరాచకప్రదేశ్ గా మారడం, పరిశ్రమలు రాష్ట్రం విడిచిపోవడం ఖర్మకాక ఏంటి జగన్ రెడ్డి? చంద్రబాబునాయుడి గారి హయాంలో ఏపీ సన్ రైజ్ స్టేట్ గా ఉంటే, ఇప్పుడు సన్ సెట్ స్టేట్ గా మారింది. రాష్ట్రంలో రౌడీరాజ్యం నడుస్తోంది. ఇవన్నీ జగన్ రెడ్డికి తెలిసే, ప్రజలను నేరుగా ఎదుర్కోలేక ‘బారికేడ్ల రెడ్డి’గా మారిపోయాడు. పోలీసులు, బారికేడ్లమధ్యన దొంగలాగా దాక్కొనిదాక్కొని ప్రజలమధ్యన తిరుగుతున్నాడు. ఎందుకయ్యా జగన్ రెడ్డీ… నీకుఅంతఖర్మ? వేలాదిపోలీసులు లేకుండా జనంలోకి వెళ్లలేని ఖర్మ ఈదేశంలో నీకుమాత్రమే పట్టింది జగన్ రెడ్డి.
ఆర్బీఐ తాజా నివేదిక సంగతేంటి జగన్ రెడ్డి?
దేశంలోని అన్నిరాష్ట్రాలు అనేకరంగాల్లో సాధించిన వృద్ధిరేటు వివరాలు తెలియచేస్తూ ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తాజాగా నివేదిక విడుదలచేసింది. ఏఏ రాష్ట్రాలు ఎంతప్రగతిసాధిస్తున్నాయో గణాంకాలతో సహా వివరించింది. ఆనివేదిక చూస్తే ఈ సైకోముఖ్యమంత్రి పరిపాలన ఎలాఉందో ప్రజలకు అర్థ మవుతుంది. 2014-19మధ్య చంద్రబాబు నాయుడి 5ఏళ్ల పాలనలో రాష్ట్ర జీఎస్డీపీ (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్) పెరుగుదలచూస్తే, రూ.2లక్షల19వేల500కోట్ల రూపాయలు పెరిగింది. 2013-14లో రూ.4లక్షల7వేల114 కోట్లుగాఉన్న జీఎస్డీపీ, 2018-19కి రూ.6లక్షల26వేల614కోట్లకు పెరిగింది. అంటే 5సంవత్సరాల్లో రూ.2లక్షల19వేల500కోట్లు, 53.92శాతం పెరిగింది. ప్రతిసంవత్సరం 10.78శాతం జీఎస్డీపీ గ్రోత్ రేట్ తో ఏపీ డబుల్ డిజిట్ అభివృద్ధి సాధించింది. ఈ పనికిమాలిన ముఖ్యమంత్రి హయాంలో, గత మూడేళ్ల కాలంలో మాత్రం కేవలం 6.4శాతం గ్రోత్ రేట్ కే రాష్ట్రం పరిమితమైంది. 2018-19కి సగటున సంవత్సరానికి 10.78శాతం గ్రోత్ రేట్ సాధించినరాష్ట్రం, 2021-22నాటికి 6.4శాతానికి పడిపోవడం ఖర్మకాక మరేమిటి జగన్ రెడ్డీ? డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ సగానికి ఎందుకు పడిపోయిందో సమాధానంచెప్పు జగన్ రెడ్డీ.
2014-19మధ్యన టీడీపీప్రభుత్వంలో రాష్ట్రం సాధించిన గ్రోత్ రేట్, దేశంలో మరే పెద్ద రాష్ట్రం సాధించలేదు. 2014-19 మధ్యన కర్ణాటక10.4శాతం గ్రోత్ రేట్ సాధిస్తే, తమిళనాడు 8.28శాతం, రాజస్థాన్ 7.94శాతం, ఉత్తరప్రదేశ్ 7.36శాతం, అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర కేవలం 7.18శాతం, పంజాబ్ కేవలం 6.5శాతం సాధిస్తే, చంద్రబాబునాయుడి సారథ్యంలోని ఏపీ ఒక్కటే 10.78శాతం గ్రోత్ రేట్ తో అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయం మేంచెప్పడంలేదు…రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక చెబుతోంది. 10.78శాతం గ్రోత్ రేట్ 6.4శాతానికి పడిపోవడం ఖర్మకాక ఏమిటి జగన్ రెడ్డి?
మొత్తంగా రాష్ట్ర జీఎస్డీపీనే కాకుండా వివిధరంగాల అభివృద్ధిలో రాష్ట్రంయొక్క అధ్వాన్నస్థితిని కూడా ఆర్బీఐ బయటపెట్టింది.
ఆర్బీఐ నివేదికలోని నగ్నసత్యాలు …..
తయారీరంగం : 2013-14మధ్యన తయారీరంగం రూ.38,574కోట్లవిలువగల ఉత్పత్తిసాధిస్తే, 2018-19నాటికి అది రూ.71,514కోట్లకి చేరింది. అంటే ఐదేళ్లలోరూ.32,940కోట్ల విలువపెరిగింది. ఆ విధంగా 2014-19 మధ్యన టీడీపీ ప్రభుత్వంలో తయారీరంగం 17శాతం అద్భుతమైన గ్రోత్ రేట్ సాధించగా, చేతగాని వైసీపీపాలనలో 2019-22మధ్య దారుణంగా3.6శాతానికి పడిపోయింది. ఎక్కడ17శాతం…ఎక్కడ 3.6శాతం జగన్ రెడ్డీ… ఇదిరాష్ట్రానికిఖర్మకాక ఏమిటి?
నిర్మాణరంగం : 2014-19మధ్యన నిర్మాణరంగం సగటున ఏడాదికి 4.7శాతం గ్రోత్ రేట్ సాధిస్తే, 2021-22నాటికి అది1.9శాతానికి పడిపోయింది. బాబుగారి సారథ్యంలో నిర్మాణరంగం క్లిష్టపరిస్థితులను సైతం తట్టుకొని 4.7శాతం వృద్ధిచెందగా, నేడు జేట్యాక్స్ సీఎం పాలనలో 1.9శాతానికి దిగజారింది.
పరిశ్రమల రంగం : 2013-14లో పరిశ్రమలరంగం రూ.99,344కోట్ల విలువగల ఉత్పత్తిసాధిస్తే, అది 2018-19నాటికి రూ.1,52,003కోట్లకు చేరింది. అంటే 5సంవత్సరాలకాలంలో రూ.52,659కోట్ల ఉత్పత్తి విలువ (53శాతం) చంద్రబాబు హయాంలో పెరిగింది. 2014-19 మధ్య, టీడీపీప్రభుత్వంలో 10.6శాతం గ్రోత్ రేట్ సాధించిన రాష్ట్రం, జగన్ పాలనలో దానిలో సగానికిపడిపోయి, 5.86శాతానికి పరిమితమైంది. ఇదిఖర్మకాక మరేమిటి జగన్ రెడ్డీ? జాకీ లాంటి పెద్దపరిశ్రమలే పారిపోతుంటే గ్రోత్ రేట్ ఎక్కడినుంచి వస్తుంది?
సేవారంగం : 2013-14లో సేవారంగంలో 1,67,887కోట్ల ఉత్పత్తి విలువసాధించిన రాష్ట్రం, 2018-19నాటికి రూ.2,36,254కోట్లకు చేరింది. అంటే 5సంవత్సరాల కాలంలో సేవారంగంలో 68,367కోట్ల ఉత్పత్తి విలువ (40.7శాతం) పెరగడం జరిగింది. ఆరకంగా చంద్రబాబుపాలనలో సేవారంగంలో 8.14శాతంవృద్ధిరేటు సాధించినరాష్ట్రం, జగన్ రెడ్డి హాయాంలో 6.9శాతానికి కృశించుకుపోయింది.
వ్యవసాయ రంగం : వ్యవసాయరంగంలో బియ్యందిగుబడులు 2013-14లో 63లక్షల69వేల టన్నులుంటే, 2018-19 సమయానికి 82లక్షల34వేలటన్నులకు పెరిగింది. 5ఏళ్లలో 12లక్షల65వేలటన్నుల బియ్యం దిగుబడులు పెరిగాయి. ఆవిధంగా చంద్రబాబుగారి హాయాంలో బియ్యం దిగుబడులు 18.15శాతం వృద్ధిచెందగా, 2020-21నాటికి జగన్ పాలనలో బియ్యం దిగుబడులు 78,82,900టన్నులకు పడిపోయి, దారుణాతిదారుణంగా వృద్ధిరేటు (-)4.27 నెగెటివ్ గ్రోత్ రేట్ తో తిరోగమనంలో నిలిచింది. వ్యవసాయరంగం ఇంతలా దిగజారిపోవడం రాష్ట్రానికి, రైతాంగానికి ఖర్మకాక మరేమిటి జగన్ రెడ్డీ?
ఆక్వారంగం : ఆక్వారంగానికి నేడుతానేదో ఒరగబెట్టినట్టు నర్సాపురంలో కబుర్లుచెప్పిన జగన్ రెడ్డి, 2014-19మధ్య బాబుగారి నేతృత్వంలో రికార్డుస్థాయిలో రాష్ట్రంలో చేపలఉత్పత్తి 101.6శాతం పెరిగిందన్న నిజాన్ని గ్రహించాలి. 2014-15లో చేపలదిగుబడి కేవలం19.79లక్షలటన్నులుఉంటే, 2018-19కి 39లక్షల91 వేలటన్నులుపెరిగి, ఐదేళ్లలో 20.1లక్షలటన్నుల వృద్ధిసాధించింది. 2014-15కి 2018-19కి మధ్యన 101శాతం చేపలదిగుబడి పెరిగింది. ఈలెక్కలే చెబుతున్నాయి జగన్ రెడ్డీ…. ఆక్వారంగానికి ఎవరు ఎలాంటిమేలుచేశారో. ఆక్వా రంగానికి దేశంలో ఏప్రభుత్వం చేయనంత మేలుచేసింది చంద్రబాబుగారు ఒక్కరే.
పాడిపరిశ్రమ : అమూల్ సంస్థతో అద్భుతాలు సృష్టిస్తానని, పాడిపరిశ్రమ రూపురేఖలు సమూలంగా మార్చేస్తానని జగన్ రెడ్డి ప్రగల్భాలుపలికాడు. 2014-15లో రాష్ట్రంలోపాలదిగుబడి 96లక్షల56వేల టన్నులుంటే, 2018-19కి కోటి50లక్షల44వేలటన్నులకు పెరిగింది. దాదాపుగా చంద్రబాబునాయుడిగారి ఐదేళ్లపాలనలో పాలదిగుబడి 53లక్షల88వేలటన్నులు పెరిగింది. 2018-19లో కోటి50లక్షల44వేల టన్నులున్న పాలదిగుబడి, జగన్ రెడ్డి దిక్కుమాలిన ప్రభుత్వంలో 2020-21వచ్చేసరికి కోటి47లక్షల 14వేలటన్నులకు పడిపోయింది అంటే 3లక్షల30వేలటన్నుల పాలదిగుబడి జగన్ హాయాంలో తగ్గిపోయింది. పాడిరైతులకు సకాలంలో డబ్బులుచెల్లించకపోతే రైతులు పాలుఎలాపోస్తారు జగన్ రెడ్డీ? ఏంచేస్తోంది జగన్ రెడ్డీ నువ్వు తీసుకొచ్చిన అమూల్ సంస్థ? ఆర్బీఐ తాజానివేదికలో ఏ అంశాన్ని తీసుకున్నా, రాష్ట్రం యొక్క పరిస్థితి జగన్ రెడ్డి పాలనలో ఎంత దయనీయంగా ఉందో స్పష్టమవుతోంది.
ఆర్బీఐ నివేదిక కూడా జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి పట్టిన ఖర్మను అంకెలతో సహా వివరిస్తోంది. పేజీ నెంబర్లతో సహా ఆర్బీఐ నివేదికలోని అంశాలను స్పష్టంచేశాము… జగన్ రెడ్డికి చేతనైతే నివేదిక చదివాక వాస్తవాలు మాట్లాడాలి. తప్పుడురాతలు రాసే బురదపత్రిక, పకోడిపేపర్ ను చేతిలో పట్టుకొని జగన్ రెడ్డి అబద్దాలు చెప్పినంతకాలం, తాము వాస్తవాలను ప్రజలకు వివరిస్తూనే ఉంటాము. నర్సాపురంలో నేడు జగన్ రెడ్డి ఎంతఏడ్చినా, గగ్గోలుపెట్టి మొత్తుకున్నా, మాపై ఎంతవిషకక్కినా ప్రజలెవరూ ఆయన్ని నమ్మే పరిస్థితిలో లేరని, నిజాలతో జగన్ రెడ్డి చెప్పే అబద్ధాలను పటాపంచలు చేస్తూనే ఉంటాము” అని పట్టాభిరామ్ తేల్చిచెప్పారు.