Suryaa.co.in

Andhra Pradesh

అది విద్యాదీవెన కాదు.. జగనన్న దగా దీవెన

– విద్యాదీవెన, వసతిదీవెన కింద జగన్ రూ.5వేలకోట్లు చెల్లించాలి
• జగన్ పెట్టిన బకాయిలు విద్యార్థుల భవిష్యత్ కు ప్రతిబంధకాలుగా మారాయి.
•టీడీపీప్రభుత్వం బకాయిపెట్టిన రూ.1800కోట్లను తానుచెల్లిస్తున్నానంటున్న జగన్ మాటలన్నీ పచ్చి అబద్ధాలే.
• వైసీపీప్రభుత్వం తమకు రూ.400కోట్లు చెల్లించాలంటున్న ప్రైవేట్ విద్యాసంస్థలకు జగన్ ఏం సమాధానం చెబుతారు?
• చంద్రబాబు రైతుల్ని పరామర్శించేవరకు ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులేం చేశారు?
– మాజీ మంత్రి పీతల సుజాత

ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపులపై ముఖ్యమంత్రి గొప్పలు చెబుతుంటే, తల్లిదండ్రులు పిల్లల చదువులకోసం అప్పులుచేస్తుంటే, విద్యార్థులు పడుతున్న తిప్పలు అన్నీఇన్నీకావ ని మాజీ మంత్రి పీతల సుజాత ఎద్దేవాచేశారు.మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే…

“ఫీజురీయింబర్స్ మెంట్ అనేది అన్నివర్గాలప్రజలకు గతప్రభుత్వాలు అందించాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల విద్యకోసం, వారి భవిష్యత్ దృష్ట్యా ప్రభుత్వాలు తూచా తప్ప కుండా ఎన్నిఇబ్బందులు ఉన్నా లెక్కచేయకుండా ఎప్పటికప్పుడు కళాశాలలకు డబ్బులు అందించేవి. ప్రభుత్వసహకారంతో ఫీజులకు ఇబ్బంది లేకపోవడంతో విద్యార్థినీ విద్యార్థులు ప్రశాంతంగా చక్కగా చదువుకునేవారు.

జగన్ ప్రభుత్వం 40శాతం ఫీజులు సరిగా కట్టడంలేదని హైకోర్టే చెప్పింది
ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తివిరుద్ధంగా మారింది. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఫీజురీయిం బర్స్ మెంట్ ప్రక్రియను ప్రహసనంగా మార్చాడు. విద్యాదీవెన పేరుతో దగాదీవెన అమలు చేస్తూ విద్యార్థుల భవిష్యత్ తో ఆటలాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డికి బటన్ నొక్కడంతప్ప, ప్రజల సమస్యలు, వారిబాగోగులు, విద్యార్థినీవిద్యార్థుల భవిష్యత్ గురించిన ఆలోచనలేదు. రాష్ట్రహైకోర్టే ప్రభుత్వం ఫీజులు సరిగా కట్టడంలేదని 40శాతం చెల్లింపులుసరిగా లేవని స్పష్టంగా చెప్పింది. న్యాయస్థానం వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏంచెబుతాడు..ఎవరిని నిందిస్తాడు?

ప్రభుత్వమే ఇంకా రూ.400కోట్లు చెల్లించాలని విద్యాసంస్థల యాజమాన్యాలు చెప్పలేదా?
2017-19 మధ్య గతప్రభుత్వం రూ.1800కోట్ల ఫీజురీయింబర్స్ మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టిందని, అప్పటి బకాయిలు తానుచెల్లిస్తున్నానని జగన్మోహన్ రెడ్డి, ఆయన మీడియాతో అసత్యప్రచారం చేయిస్తున్నారు. జగన్ పత్రికల్లో చెప్పేది, బహిరంగసభల్లో చెప్పేవి అన్నీ అబ ద్ధాలే. గతప్రభుత్వం బకాయిలుపెట్టడం..తానుచెల్లించడం అంతా అబద్ధమే. ఇటీవల ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు సమావేశమై ప్రభుత్వం తమకు రూ.400కోట్ల వరకు చెల్లించా లని చెప్పాయి. ఆ బకాయిలు చెల్లించాలన్న విద్యాసంస్థలపై ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతూ, ఇచ్చింది తీసుకోవాలని యాజమాన్యాలను బెదిరిస్తోంది.

మాటవినకపోతే విద్యాసంస్థల్ని మూసేయిస్తామని జగన్ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. జగన్ హయాంలో రాష్ట్రం లో పదోతరగతి ఉత్తీర్ణతాశాతం దారుణంగా పడిపోయింది. పదోతరగతే కాదు, ఇంటర్, ఆపై చదువుల్లో విద్యార్థులు బాగావెనుకపడిపోయారు. చంద్రబాబుహాయాంలో పదోతరగతి ఉత్తీర్ణ తాశాతం 95శాతముంటే, జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏటాతగ్గిపోతోంది. ప్రభుత్వంసకాలంలో విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు చెల్లించకపోవడం, ప్రైవేట్ కళాశాలలు పెట్టే ఒత్తిడితట్టుకో లేక ఇంటర్ విద్యార్థులు చదువుమధ్యలో ఆపేయడమో, చదువుకి స్వస్తిచెప్పడమో, లేక బలవన్మరణాలకు పాల్పడటమో చేస్తున్నారు. జగన్ తాను ఇచ్చినహామీని సక్రమంగా నెర వేరిస్తే విద్యార్థుల జీవితాలు మధ్యలో అర్థంతరంగా ముగుస్తాయా?

జీవో 77తో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఉన్నతవిద్యను దూరం చేసిన జగన్, వారికి మేనమామా? విద్యాదీవెన, వసతిదీవెన కింద జగన్ విద్యార్థులకు రూ.5వేలకోట్లు చెల్లించాలి
ఆ సొమ్ము బకాయిపెట్టడంతో విద్యాసంస్థలు ఫీజులకోసం విద్యార్థుల మెడపై కత్తిపెడుతున్నాయి.
దళితబిడ్డలకు తాను మేనమామను అని చెప్పిన జగన్ తనమేనల్లుళ్లు, మేనకోడళ్లు ఎందు కు ప్రాణాలు తీసుకుంటున్నారో చెప్పాలి. జీవో-77 తీసుకొచ్చి, పీజీ విద్యార్థులకు రీయింబర్స్ మెంట్ లేకుండా చేసిన జగన్ నిర్వాకం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉన్నతవిద్యను దూరం చేసింది. ఫీజురీయింబర్స్ మెంట్ సొమ్ముని విద్యాదీవెన పథకంకింద ఏటా 4విడతల్లో చెల్లిస్తా నన్నజగన్ 4ఏళ్లలో 16 సార్లుచెల్లించాలి. చెప్పినప్రకారం సక్రమంగా ఒక్కసంవత్సరం కూడా చెల్లించలేదు.

వైసీపీప్రభుత్వం నేటికి విద్యాదీవెన కిందే రూ.2,400కోట్లు చెల్లించాల్సిఉంది. అలానే వసతిదీవెన కింద రూ.2,400కోట్లు బకాయిపెట్టింది. మొత్తంగా జగన్ ప్రభుత్వం విద్యార్థులకు రూ.5వేలకోట్లవరకు చెల్లించాల్సి ఉంది. జగన్ విద్యాసంస్థలకు పెట్టిన బకాయి లు విద్యార్థుల భవిష్యత్ కు బంధనాలుగా మారాయి. జగన్ బకాయిలు విద్యార్థులమెడలపై కత్తులుగా మారాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు చదువులు పూర్తిచేసికూడా సర్టిఫికెట్లకోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి.

డబ్బులు కట్టాల్సిందే అంటూ విద్యాసంస్థలు ఒత్తిడి చేస్తుండటంతో విద్యార్థులకు ఏంచేయాలో పాలుపోని పరిస్థితి. మరోపక్క తమబిడ్డల భవిష్యత్ ఏమిటా అని తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళనచెందుతున్నారు. ఇకనైనా జగన్ విద్యార్థుల భవిష్యత్ దృష్టిలోపెట్టుకొని తక్షణమే రూ.5వేలకోట్లను విడుదలచేయాలని డిమాం డ్ చేస్తున్నాం.

చంద్రబాబు రైతులవద్దకెళ్లి, వారిసమస్యలు తెలుసుకునేవరకు ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులేం చేశారు? ప్రజలమధ్య విద్వేషాలు రాజేసి, రాజకీయాలు చేయడం జగన్ కే బాగా తెలుసు
ఎన్నికలకుముందు విచ్చలవిడిగా హామీలిచ్చిన జగన్, ముఖ్యమంత్రి అయ్యాక అన్నీ విస్మరించి తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యాడు. రాష్ట్రం మునిగిపోతున్నా, ప్రజలు చని పోతున్నా ముఖ్యమంత్రికి పట్టదు. మంత్రులేమో అకాలవర్షాలకు, వర్షాలకు తేడా తెలుసుకో కుండా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షనేత రైతులవద్దకు వెళ్లి, వారిని పరామర్శించేవరకు ప్రభుత్వంలో, అధికారుల్లో చలనం లేదు. ప్రతిపక్షనేత రైతులవద్దకు వెళ్లేవరకు వారిముఖం కూడా చూడని జగన్మోహన్ రెడ్డి, మంత్రులే రాజకీయాలుచేస్తున్నారు. అన్నంపెట్టే రైతుల్ని ఎర్రిపప్పలు అనే మంత్రులు కూడా మంత్రులేనా? చంద్రబాబుగారు క్షేత్రస్థాయిలో రైతులవద్దకు వెళ్లేవరకు అధికారలు కనీసంధాన్యం గోతాలు కూడా ఇవ్వలేదు. ఆయన వస్తున్నారనితెలిసి అప్పటికప్పుడు హడావుడిచేసినవారు, చంద్రబాబుగారు రాకముందు ఎందుకు రైతులగోడు పట్టించుకోలేదు?

రాజకీయాలు చేయడం, ప్రజలమధ్య విద్వేషాలు రాజేసి రెచ్చగొట్టిపబ్బంగడుపుకోవడం వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికే బాగాతెలుసు. రంగుమారిన, తడిచిన ధాన్యాన్ని నిల్వచేసుకోవడానికి సరిపడా గోదాములు, గోతాలుకూడా అందించలేని దుర్భరస్థితిలో ఈ ప్రభుత్వంఉంది. టీడీపీఅధినేత చంద్రబాబు రైతులకోసం 12వతేదీన పాదయాత్ర చేయబోతున్నారు. జగన్ ప్రభుత్వం రైతుల్ని ఆదుకునేవరకు ప్రతిపక్షనేత ఊరుకోరు.” అని సుజాత స్పష్టంచేశారు.

LEAVE A RESPONSE