విశాఖపట్టణంలోని మధురవాడలో 190 కోట్ల వ్యయంతో 4 ఎకరాల్లో… 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో… మిలీనియం టవర్స్ నిర్మాణం పూర్తిచేసుకుని 2019 ఫిబ్రవరిలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుచే ప్రారంభించబడింది.
మిలీనియం టవర్స్ ప్రారంబించబడిన రోజునే… ప్రముఖ ఎం.ఎన్.సీ కంపెనీ కాండ్యూయెంట్ టెక్నాలజీస్ కూడ ముఖ్యమంత్రిచే ప్రారంబింపచేసుకుని , తమ కార్యకలాపాలు ప్రారంబించింది అదే మిలీనియం టవర్స్ లో.
ఆనాడు… ఆంధ్రరాష్ట్ర ప్రజలు కొంత ఆలోచించి… మరికొంత వివేకం ప్రదర్శించి ఉండి ఉంటే… ఈరోజు ఎన్నో ఐ.టి కంపెనీలు మన రాష్టంలో కొలువుతీరి… వేలమందికి కొలువులు వచ్చి ఉండేవి. తమ పిల్లల భవిష్యత్తుకి బంగారు బాటలు పడి ఉండేవి.
ఈనాడు చదువుకున్న యువత… ప్రభుత్వ ఉద్యోగాల మాయలో పడి ఇతర రాష్ట్రాలలోని తమ ఐ.టి కొలువులు వదులుకుని వచ్చి చూస్తే… వాలంటీర్ ఉద్యోగాలు, సచివాలయం కొలువులు, రేషన్ బండ్లు, ఫిష్ మటన్ మార్ట్ లు… నిర్దయగా వెక్కిరిస్తున్నాయి.
– రాజేంద్ర మాదల